ఔరంగజేబు సమాధిని కూల్చివేస్తాం: రాజాసింగ్ 

Publish Date:Apr 1, 2025

Advertisement

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి అంశం  గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన  సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ నుంచి బిజెపి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు సమాధిని కూల్చివేస్తామని ఎమ్మెల్యే అన్నారు. అవసరమైతే మహరాష్ట్ర హిందువులకు తెలంగాణ హిందువులు మద్దత్తు గా నిలుస్తారని రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయ్యాక ఔరంగజేబు, బాబర్  వారసులు ఆందోళనకు గురయ్యారన్నారు. భారత్ ను హిందూ దేశంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించాలని రాజాసింగ్ అభిలషించారు. గతేడాది  ధూల్ పేట నుంచి  శ్రీరామనవమి శోభాయాత్రను ఎంఐఎం అడ్డుకుందని  ఈ యేడు  ఎవరి అనుమతులు, ఆదేశాలు లేకుండానే శ్రీరామనవమి శోభాయాత్రను నిర్వహిస్తామని రాజాసింగ్ చెప్పారు. 

ఔరంగ జేబు ఆఖరి మొఘల్ చక్రవర్తి.   ఆరో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. అంతకుముందు ఉన్న చక్రవర్తులు మతసామరస్యానికి పెద్ద పీట వేస్తే ఔరంగజేబు మాత్రం హిందువులపై జిజియా పన్ను వసూలు చేసిన  చక్రవర్తిగా పేరుతెచ్చుకున్నాడు.  ముస్లింల నుంచి జకాత్ పన్ను, హిందువులనుంచి జిజియా పన్ను వసూలు చేసేవాడని అంటారు. మొఘల్ చక్రవర్తి అయినప్పటికీ  ఇస్లాం ను అనుసరిస్తూ టోపీలు కుట్టి జీవనం సాగించేవాడు. హైద్రాబాద్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మహరాష్ట్రలో ఉన్న ఔరంగ జేబు సమాధిని  ఔరంగాబాద్ లో సందర్శించడంతో భారతీయ జనతాపార్టీ నేతలతో బాటు హిందుత్వ వాదులు తీవ్రంగా ప్రతిఘటించారు.  రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వివిధ రాజకీయ పార్టీలకు   ఔరంగ జేబు సమాధి కేంద్రబిందువయ్యింది. 

మొఘల్ చక్రవర్తుల సమాధులకు ఔరంగ జేబు సమాధి భిన్నంగా ఉంటుంది. కేవలం మట్టితో కప్పిన ఈ సమాధి  అతి నిరాడంబరంగా ఉంటుంది.  సమాధిని పరిరక్షించే బాధ్యత షేక్ షుకుర్ పూర్వికులు తీసుకున్నారు. షేక్ షుకుర్ ఆరోతరానికి చెందిన వారు. సమాధి మీద  వనమూలికలను  మాత్రమే పెంచుతున్నారు.  ఔరంగ జేబు సమాధిని చూడటానికి ప్రపంచనలుమూలలనుంచి పర్యాటకులు ప్రతి నిత్యం వస్తుంటారు. చత్రపతి శంభాజీ మహరాజ్ ను 45 రోజుల పాటు హింసించి చంపేసినట్టు విహెచ్ పి, భజరంగ్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.  ఔరంగజేబు మతగురువు షేక్ జైనుద్దీన్ సమాధి పక్కనే ఈ సమాధిని నిర్మించారు. 


 

By
en-us Political News

  
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
అరవ శ్రీధర్‌పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్‌లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
మొదట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌లో ఉండటంతో టిడిపిలో లేరని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు వచ్చిన కొత్తలో హైదరాబాద్ పరిధిలోని చదువుకున్న యువ నాయకుల వివరాలు సేకరించగా తన పేరు తెరపైకి వచ్చిందన్నారు.
సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ.. చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడి ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది.
గతంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే.. ఇచ్చిన హామీని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు గా నిలబెట్టుకుంది. అయితే, ఈ కొత్త పదవి, అదనపు బాధ్యతలు వైఎస్ షర్మిలకు ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఆమె ముందు అనేక సవాళ్లను ఉంచబోతున్నాయి.
సుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ.. ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం కాదని తేల్చి చెప్పారు.
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.