తమిళనాట సంచలనం: బీజేపీకి అణ్ణామలై గుడ్‌బై?

Publish Date:Jun 1, 2026

Advertisement

దక్షిణాది రాజకీయాల్లో, ముఖ్యంగా తమిళనాడులో అనూహ్యమైన రాజకీయ పరిణామం  సంచలనం రేపుతోంది. తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి  ఫేస్‌గా నిలిచిన ఫైర్‌బ్రాండ్ లీడర్  అణ్ణామలై త్వరలోనే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారనే వార్త ఇప్పుడు తమిళరాజకీయాలలో సంచలనంగా మారింది.  గత దశాబ్ద కాలంగా తమిళనాట కమలం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అహర్నిశలు శ్రమించిన అణ్ణామలై.. ఇప్పుడు అనూహ్యంగా సొంత పంథాను ఎంచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ..  చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

అయితే ఇక్కడి  ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది. కానీ.. ఇటీవలి కాలంలో బీజేపీ అధిష్ఠానంతో ఏర్పడిన తీవ్రమైన సాంస్కృతిక, సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా అణ్ణామలై ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సీనియర్ లీడర్ అయిన అణ్ణామలై  త్వరలోనే బీజేపీకి త  రాజీనామా సమర్పించనున్నారు. పార్టీని వీడిన అనంతరం ఆయన నేరుగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించకుండా, ముందుగా గ్రౌండ్ లెవెల్‌లో ఒక బలమైన స్వచ్ఛంద ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ స్వచ్ఛంద సంస్థ లేదా సామాజిక ఉద్యమం ద్వారా ప్రజల్లోకి వెళ్లి..  తనకంటూ ఒక ప్రత్యేకమైన క్యాడర్‌ను నిర్మించుకున్న తర్వాత పూర్తిస్థాయి పొలిటికల్ పార్టీని లాంచ్ చేయాలని పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. తమిళనాడు ప్రజలు ద్రవిడ సిద్ధాంతాలకు అలవాటు పడి ఉన్నారని, అక్కడ కేవలం బీజేపీ ముద్రతో ఒంటరిగా గెలవడం అసాధ్యమని అణ్ణామలై  క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందంటున్నారు. తమిళ జనం కమలం వైపు చూడటం లేదని స్పష్టమయ్యాక, అక్కడే ఉండి తన పొలిటికల్ కెరీర్‌ను రిస్క్‌లో పడేసుకోవడం కంటే, ద్రవిడ ముద్ర లేని ఒక సరికొత్త ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నారు.  ఇప్పటివరకు దక్షిణాది రాజకీయాల్లో అణ్ణామలైని చూపిస్తూ ఓట్లు రాబట్టాలని చూసిన బీజేపీకి ఇది కోలుకోలేని  దెబ్బేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అణ్ణామలై లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత దూరం కావడం వల్ల తమిళనాట బీజేపీ ఉనికి  సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. 

By
en-us Political News

  
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్‌లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
మొదట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌లో ఉండటంతో టిడిపిలో లేరని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు వచ్చిన కొత్తలో హైదరాబాద్ పరిధిలోని చదువుకున్న యువ నాయకుల వివరాలు సేకరించగా తన పేరు తెరపైకి వచ్చిందన్నారు.
సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు.
గతంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే.. ఇచ్చిన హామీని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు గా నిలబెట్టుకుంది. అయితే, ఈ కొత్త పదవి, అదనపు బాధ్యతలు వైఎస్ షర్మిలకు ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఆమె ముందు అనేక సవాళ్లను ఉంచబోతున్నాయి.
సుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ.. ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం కాదని తేల్చి చెప్పారు.
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరాన్ తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.
రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన వాస్తవ వేదికలో దేశ రాజకీయ పరిస్థితుల
ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఇండియాలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో వచ్చినట్లు ప్రజా విప్లవాలు వస్తాయా అనే చర్చలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ తీవ్రమైన రాజకీయ పరిణామాలపై ప్రముఖ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ లిబర్టీ అధినేత నలమోతు చక్రవర్తి తెలుగువన్ ఇంటర్వ్యూలో అనేక లోతైన విశ్లేషణ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.