పెళ్లి తర్వాత భాగస్వామితో ప్రేమ, స్నేహం ఎంతవరకు సాధ్యం?

Publish Date:Aug 28, 2025

Advertisement



నేటికాలంలో పెళ్ళి ఫిక్స్ అయిందంటే చాలు.. అమ్మాయి అబ్బాయి ఫోన్ నంబర్లు మార్చుకుని ఎంచక్కా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ప్రేమ వివాహం అయితే చెప్పక్కర్లేదు.  అయితే పెళ్లికి ముందు ఉండే స్నేహం, ప్రేమ అనేవి పెళ్లి తర్వాత కూడా ఉంటాయా అంటే.. చాలామంది అవి లేవనే సమాధానం చెబుతారు. అంటే.. పెళ్లికి ముందు ఉండే ప్రేమ,  స్నేహం వంటివి పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఉండటం లేదు.  ఎందుకని?  వివాహం తర్వాత కూడా ప్రేమ అలాగే ఉంటుందని అనుకుంటారు.  కానీ స్నేహానికి స్థలం తగ్గకూడదు. నిజం ఏమిటంటే.. వివాహంలో, స్నేహం,  ప్రేమ రెండూ ఉంటే బంధం మరింత బలపడుతుంది.కానీ ఇవి రెండూ ఉండగలవా? పెళ్లి తర్వాత ప్రేమ, స్నేహం రెండూ భార్యాభర్తల మధ్య ఉండగలవా? భార్యాభర్తల బంధంలో ప్రేమ, స్నేహం రెండూ ఉంటే ఏం జరుగుతుంది?

స్నేహం.. సంబంధానికి పునాది..

ఏ సంబంధానికైనా స్నేహం బలమైన పునాది. భార్యాభర్తలు ఒకరితో ఒకరు స్నేహితులుగా ఉంటే వారి మధ్య బంధం ఓపెన్ గా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. స్నేహం వల్ల ఎక్కువ అవగాహన,  సాన్నిహిత్యం ఉంటుంది. కాబట్టి చిన్న విషయాలకు తగాదాలు తక్కువగా ఉంటాయి.

ప్రేమకు స్నేహమే సపోర్ట్..

వివాహం తర్వాత ప్రేమ  అంటే భార్యాభర్తలు సరదాగా ఉండటం కాదు.. జీవితంలోని బాధ్యతలు, కష్టాల గుండా కూడా ప్రయాణం చేయడం. అటువంటి పరిస్థితిలో ఆ ప్రేమను సజీవంగా ఉంచేది ప్రేమ మాత్రమే. కష్ట సమయాల్లో  మద్దతు ఇచ్చేవాడు మంచి స్నేహితుడు.  ఈ లక్షణాలు వైవాహిక జీవితంలో కూడా ఉపయోగపడతాయి.

స్నేహం, ప్రేమ బ్యాలెన్సింగ్..

చాలా సార్లు భార్యాభర్తలు తమ జీవితంలో ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో అయోమయంలో పడుతుంటారు.  పరిస్థితి మొత్తం చెయ్యి దాటాక.. అయ్యో.. ఈ సందర్బంలో ఫ్రెండ్ గా మాట్లాడి ఉంటే బాగుండు.. ఫలానా సందర్భంలో ఒక లవర్ లాగా ప్రేమను ఎక్ప్స్రెస్ చేసి ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటారు.  అయితే పరిస్థితి ఎలాంటిది అయినా కనీసం స్నేహం, ప్రేమ.. ఏదో ఒకటి ప్రెజెంట్ చేస్తూ ఉంటే అది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. క్రమంగా ఈ స్నేహం, ప్రేమ కూడా బ్యాలెన్సింగ్ గా ఉంటాయి.

అపార్థాలు..

భార్యాభర్తలు కేవలం భార్యాభర్తల్లా కాకుండా పైన చెప్పుకున్నట్టు స్నేహం, ప్రేమను ప్రెజెంట్ చేస్తుంటే.. భార్యాభర్తల మధ్య అపార్థాలు అనే మాటకు అసలు తావే ఉండదు.  ఒకవేళ అపార్థాలు వచ్చినా వాటిని ఎలా పరిష్కరించుకోవాలో వారికి ఇట్టే అర్థం అవుతుంది. వివాహం తర్వాత ప్రేమ, స్నేహం ఉండే జంటలు సమప్రయాణాన్ని చాలా సంతోషంగా చేయగలుగుతారు.

                               *రూపశ్రీ.
 

By
en-us Political News

  
మనిషి జీవితం సక్సెస్ గా ఉండటానికి, కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగడానికి ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
చర్మ సౌందర్యానికి డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉపయోగపడుతుంది? మెరిసే, మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవడానికి సింపుల్ DIY ఫేస్ మాస్క్‌లు మరియు అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ పూర్తి వివరాలు.
ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల జలుబు వస్తుందనే అపోహ నిజమేనా? చల్లటి నీరు, తడి జుట్టు మరియు రోజూ షాంపూ వాడకం గురించి ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.
కాలుష్య గాలిలో ఒక గంటపాటు ఆరుబయట వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు, గుండె మరియు మెదడుపై పడే తీవ్ర ప్రభావం గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి.
చలికాలంలో గాలిలో తేమ తగ్గి పెదవులు పగిలిపోవడం సర్వసాధారణం. పెదవులను మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మరియు పొడిబారకుండా కాపాడుకోవడానికి 7 సులభమైన దినచర్య అలవాట్లు మరియు నిపుణుల చిట్కాలను తెలుసుకోండి.
షుగర్ పేషెంట్లు రాత్రి పూట డిన్నర్ లోకి రైస్ తినాలా లేదా చపాతీ తినాలా? ప్రముఖ డాక్టర్ దీప్తి కరేటి చెప్పిన ఆరోగ్యకరమైన చిట్కాలు మరియు కార్బోహైడ్రేట్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మాంసం కూరలను తలదన్నే రుచితో, రైతన్నల బలానికి రహస్యమైన పచ్చి కూరగాయల రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. సులభమైన పదార్థాలతో విలేజ్ స్టైల్ పచ్చడి తయారీ విధానం.
విద్య లేని వాడు వింత పశువు అన్నారు. కానీ నేటికాలంలో చదువు ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కుగా మారింది
జపాన్‌కు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ హిదేకి వాడా రచించిన ది 80 ఇయర్ వాల్ పుస్తకం ఆధారంగా వృద్ధుల మానసిక మరియు శారీరక ఆరోగ్యం కోసం అందించిన 44 విలువైన సూచనలు, ఆరోగ్య చిట్కాలు మరియు విశేషాల పూర్తి సమాచారం.
భారతీయ వంటింట్లో కొబ్బరి ప్రధాన ఆహార పదార్థం. కూరలో వేయడమే కాకుండా పచ్చళ్ళు, పొడులు, స్వీట్లు .. ఇలా చాలా రకాలుగా కొబ్బరిని వినియోగిస్తారు.
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలసి ఒకే ఇంట్లో ఉండటం మాత్రమే కాదు. కాలంతో పాటు ఉద్యోగ బాధ్యతలు,
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే పవిత్రమైన బంధం. ఈ బంధం ప్రేమ, నమ్మకం మీద గట్టిగా నిలబడుతుంది.
జీవితంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ విషయాలను ఎవరితో పంచుకోవాలి అనే అంశంపై ఆచార చాణక్యుడు చెప్పిన విషయాలు ఎప్పటికీ ఎంతో విలువైనవిగా నిలుస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.