వివేకా హత్య పై బహిరంగ చర్చకు సిద్ధమా...అవినాష్‌కు బీటెక్ రవి సవాల్

Publish Date:Mar 20, 2026

Advertisement

 

మాజీ మంత్రి వైఎస్ వివేకా నంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి తీవ్రంగా ఖండించారు. వివేకా హత్యకేసు నిజా నిజాలు ప్రజలపై మాట్లాడేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  హత్య జరిగిన ప్రదేశాన్ని మార్చడం, రక్తపు మరకలను శుభ్రం చేయించడం వంటి చర్యల వెనుక అవినాష్ రెడ్డి పాత్రపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. వివేకా మరణాన్ని గుండెపోటుగా చూపించే ప్రయత్నం దేశమంతా చూసిందని, దీనిపై ప్రజలకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. 

అయితే ఇప్పుడు అదే విషయాన్ని సునీతపై నెట్టివేయడం అసత్య ప్రచారమని ఆయన విమర్శించారు. రక్తపు మరకలను తొలగించిన వారిని కాపాడేందుకే అవినాష్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీటెక్ రవి ఆరోపించారు. గత ఎన్నికల్లో సునీత, సౌభాగ్యమ్మలు పోటీకి ఒప్పుకోకపోతే అవినాష్ రెడ్డి రాజకీయంగా ఎక్కడ ఉండేవారని ప్రశ్నించారు. ఎంపీ పదవి కూడా సునీత కారణంగానే వచ్చిందని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో నిజానిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో పులివెందుల పూలంగళ్ల సర్కిల్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా అని అవినాష్ రెడ్డికి బీటెక్ రవి సవాల్ విసిరారు. ఈ కేసులో పూర్తి సత్యాలు బయటకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.


 

By
en-us Political News

  
ఒక మత చిహ్నానికి ప్రాధాన్యతనిచ్చి, మరో మత సంప్రదాయాలను కించపరచడం సెలెక్టివ్ టార్గెటింగ్ అని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా లెన్స్ ‌కార్ట్ పట్ల వ్యతిరేకత పెచ్చరిల్లడంతో.. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే సూచనలు కనిపించడంతో.. సంస్థ సీఈఓ పేయుష్ బన్సల్ రంగంలోకి దిగారు.
తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
ఒకటి.. హిజాబ్, టర్బన్ అనుమతి.. అంటే నల్లరంగు హిజాబ్, నల్ల టర్బన్ ధరించవచ్చు. హిజాబ్ ఛాతీ వరకు కవరేజ్ ఉండాలి, కంపెనీ లోగో కనిపించేలా ఉండాలి. అయితే బుర్ఖా మాత్రం స్టోర్లో అనుమతించబడదని గైడ్లో ఉంది. రెండు..బొట్టు, తిలకం చేతితాడుపై నిషేధం.. ఆ డాక్యమెంట్ లో మత చిహ్నం అయిన తిలకం, బింది, స్టిక్కర్ లకు అనుమతి లేదని స్పష్టంగా ఉంది. అలాగే మతపరంగా చేతికి కట్టుకుని తాడు కూడా నిషేధం అని విస్పష్టంగా ఉంది.
ఢిల్లీ హత్యాచార నిందితుడు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసులే నోరెళ్ల పెడుతున్నారు
ఒంటిమిట్ట అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దేశ జనాభా పెరుగుదల రేటు కంటే విద్యార్థుల ఆత్మహత్యల రేటు వేగంగా పెరుగుతోంది. 15 నుండి 20 ఏళ్ల లోపు యువతలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.
ర్యాంకు ఒక లక్ష్యం కాదు.. గుర్తింపుగా సమస్యగా మారుతుంది. పదమూడు ఏళ్ల వయసులోనే జేఈఈ చేయాలి అనే సందేశం బాల్యాన్ని ముందుగానే ముగిస్తుంది. దాని తరువాత వస్తున్న జీవితాన్ని ఎలా జీవించాలో మాత్రం ఎవ్వరూ నేర్పరు. ఫలితంగా, అడ్మిషన్ తర్వాత కలిగే శూన్యత, అపరాధ భావం, వెనుకబడిపోతానేమోనన్న భయం ఇవన్నీ కలిసి కలిసి మానసిక కృంగుబాటుగా మారతాయి.
డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అగ్గి రాజేస్తోంది.
విశాఖకు ఎక్కువ పరిశ్రమలు వచ్చాయని, ఇంకా రాబోతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
దేశ రాజధానిలో ఢిల్లీలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది.
ప్రతి బ్యాంకు శాఖ జీరో మ్యూల్ అకౌంట్స్ లక్ష్యంగా పనిచేయాలని, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఫిర్యాదుల ఆధా రంగా శాఖల పని తీరును అంచనా వేసుకోవాలని పేర్కొన్నారు.బ్యాంకు ఉద్యోగుల కీలక పనితీరు సూచికల్లో ఖాతాల సంఖ్యకన్నా కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ఐఆర్జీసీ తో సంబంధం ఉన్న తస్నీమ్ వార్తా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. హోర్ముజ్ జలసంధి కేవలం చమురు, గ్యాస్ రవాణాకే కాకుండా.. ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థకు కూడా ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ జలసంధి గుండా కనీసం ఏడు ప్రధాన అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్స్ వెళ్తున్నాయి.
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్‌లో తిలక్ వర్మ ప్రదర్శన చూస్తుంటే.. అతడొక సంపూర్ణ బ్యాటర్ అన్నవిషయం అదర్ధమౌతోందన్న ఆకాశ్ చోప్రా.. ముంబై ఇండియన్స్ కు తిలక్ వర్మ భవిష్యత్ కెప్టెన్ కాగల అన్ని అర్హతలూ ఉన్నబ్యాటర్ అని పేర్కొన్నాడు. తిలక్ వర్మ ఐపీఎల్ జట్టును నడిపించే రోజు ఎంతో దూరంలో లేదన్నాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.