Publish Date:Apr 23, 2026
బ్యాంకులు ఖాతాల ఓపెనింగ్ టార్గెట్లకంటే కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. సైబర్ నేరాల నుంచి ఒక్క కస్టమర్ కూడా బాధితుడు కాకుండా చూడ టమే ప్రధాన లక్ష్యంగా బ్యాంకర్లు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో మ్యూల్ ఖాతాల నియంత్రణపై బ్యాంకు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చిన్మయ్ కుమార్ సహా 45 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 75 మంది ఉన్నతా ధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సిపి సజ్జనార్ మాట్లాడుతూ సేఫ్ కస్టమర్ చాలెంజ్ ను బ్యాంకులు స్వీకరించాలని సూచించారు.
ప్రతి బ్యాంకు శాఖ జీరో మ్యూల్ అకౌంట్స్ లక్ష్యంగా పనిచేయాలని, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఫిర్యాదుల ఆధా రంగా శాఖల పని తీరును అంచనా వేసుకోవాలని పేర్కొన్నారు.బ్యాంకు ఉద్యోగుల కీలక పనితీరు సూచికల్లో ఖాతాల సంఖ్యకన్నా కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు.
ఆపరేషన్ ఆక్టోపస్ 2.0లో భాగంగా 850 కేసుల్లో రూ.150 కోట్ల మోసాన్ని గుర్తించాం. మ్యూల్ ఖాతాల ఓపెనింగ్‌లో సహకరించిన 32 మంది బ్యాంకు అధికారులను అరెస్ట్ చేశామని వెల్లడిం చారు. అంతర్జాతీయ సైబర్ ముఠాలు కంబోడియా, వియత్నాం, దుబాయ్ వంటి ప్రాంతాల నుంచి కార్యకలా పాలు కొనసాగిస్తూ స్థానిక బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కై నేరాలకు పాల్పడు తున్నాయని తెలిపారు.
కేవైసీ నిబంధ నలు ఉల్లంఘించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుని, బ్యాంకింగ్ రంగం నుంచి బ్లాక్‌లిస్ట్ చేయాలని సూచించారు.ఫిక్స్‌డ్ డిపాజిట్లు ముందస్తుగా క్లోజ్ చేసేందుకు వచ్చే కస్టమర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సైబర్ నేరగాళ్ల ఒత్తిడితో డబ్బు విత్‌డ్రా చేస్తున్నారా అన్నది పరిశీలించాలని సూచించారు. “మ్యూల్ హంటర్” వంటి ఆధునిక సాంకేతిక పరికరాలు వినియోగించడంతో పాటు 1930 హెల్ప్‌లైన్‌పై విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. సైబర్ నేరాల నెట్‌వర్క్ పూర్తిగా నిర్మూ లించే వరకు పోలీసుల చర్యలు కొనసాగుతాయని సీపీ స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/customer-safety-must-be-the-goal-of-banks-36-218057.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.