Publish Date:Apr 23, 2026
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో నాకౌట్ కు చేరకుండానే వెనుదిరుగుతుందా? అన్న అనుమానాలు ముసురుకున్న వేళ.. తెలుగుతేజం తిలక్ వర్మ తన అద్భుత బ్యాటింగ్ తో ముంబై ఇండియాను మళ్లీ గెలుపు పట్టాలెక్కించాడు. గుజరాత్ టైటాన్స్ పై జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మ అద్భుతమైన సెంచరీతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. కేవలం 45 బంతుల్లోనే అజేయమైన శతకాన్ని నమోదు చేసి ముంబై ఇండియన్స్‌కు భారీ విజయాన్ని అందించారు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ వర్మపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇందులో భాగంగా మాజీ క్రికెటర్ ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ కాబోయే కెప్టెన్ గా పేర్కొన్నాడు. ఆకాశ్ చెప్పా వ్యాఖ్యలు ఇప్పడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు తావిచ్చాయి.
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్‌లో తిలక్ వర్మ ప్రదర్శన చూస్తుంటే.. అతడొక సంపూర్ణ బ్యాటర్ అన్నవిషయం అదర్ధమౌతోందన్న ఆకాశ్ చోప్రా.. ముంబై ఇండియన్స్ కు తిలక్ వర్మ భవిష్యత్ కెప్టెన్ కాగల అన్ని అర్హతలూ ఉన్నబ్యాటర్ అని పేర్కొన్నాడు. తిలక్ వర్మ ఐపీఎల్ జట్టును నడిపించే రోజు ఎంతో దూరంలో లేదన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, వచ్చే రెండేళ్లలో లేదా అంతకంటే ముందే తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ కు సారథ్యం వహిస్తాడని జోస్యం చెప్పాడు. దీంతో సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్థిక్ పాండ్యాకు ఉద్వాసనేనా అన్న చర్చ మొదలైంది.
అది పక్కన పెడితే.. తిలక్ వర్మకు నాయకత్వ బాధ్యతలూమీ కొత్త కాదు. దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్ రంజీ జట్టుకు, దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్‌కు కెప్టెన్ గా వ్యవహరించాడు. అంతర్జాతీయ స్థాయిలో టీమిండియా 'ఏ' జట్టుకు, ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో భారత జట్టుకు కూడా నాయకత్వం వహించిన అనుభవం తిలక్ వర్మకు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆకాశ్ చోప్రా వ్యాఖ్యలు అంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముంబై జట్టులో కూడా రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వంటి దిగ్గజాల తర్వాత ముంబై పగ్గాలను చేపట్టే సత్తా ఉన్న ఏకైక యువ ఆటగాడిగా అభిమానులు తిలక్‌ను చూస్తున్నారు. ఐపీఎల్ 2026లో తిలక్ చేసిన ఈ సంచలన సెంచరీ, అతడి బ్యాటింగ్ సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా, జట్టులో అతనికున్న ప్రాముఖ్యతను కూడా చాటిచెప్పింది. ఇప్పటికిప్పుడు కాకపోయినా వచ్చే ఏడాది రెండేళ్లలో తిలక్ వర్మ ఏదో ఒక ఐపీఎల్ జట్టకు సారథ్యం వహించడం ఖాయమని క్రికెట్ పండితులు కూడా చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mumbai-indians-captain-hardik-pandya-facing-the-axe-36-218048.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.