3 రికార్డులకు చేరువలో విరాట్ కోహ్లీ
Publish Date:Jan 2, 2026
Advertisement
టీమిండియా స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ కొత్త సంవత్సరంలో మూడు ప్రపంచరికార్డులకు చేరువలో ఉన్నాడు. అతడు సౌత్ఆఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక అజేయ హాఫ్ సెంచరీతో 2025ను ఘనంగా ముగించాడు. కొత్త ఏడాదిలో అతు మూడు మైలురాళ్లను అధిగమించవే అవకాశముంది. విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో మరో 339 పరుగులు చేస్తూ.. ఈ లీగ్‌లో 9,000 పరుగులు చేసి తొలి బ్యాట్స్‌మాన్ అవుతాడు. ప్రస్తుతం అతడు 259 ఇన్నింగ్స్‌లో 8,681 పరుగులు చేసి ఐపీఎల్‌లో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అతడి తర్వాత 267 ఇన్నింగ్స్‌లో 7,046 పరుగులు చేసిన రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్‌లో మొదటి నుంచి ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక కోహ్లీ వన్డేల్లో మరో 443 పరుగులు చేస్తే 15,000 మైలురాయిని చేరుకుంటాడు. విరాట్ ప్రస్తుతం 296 ఇన్నింగ్స్‌లో 14,557 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. లిటిల్ మాస్టర్ 452 ఇన్నింగ్స్‌లో 28,426 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు సచిన్ ఒక్కడే వన్డేల్లో 15,000పైగా పరుగుల చేశాడు. మరోవైపు న్యూజిలాండ్, టీమ్ ఇండియాల మధ్య జనవరి 11న తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఒక రికార్డు సృష్టించే అవకాశముంది. ప్రస్తుతం అతడు అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 623 ఇన్నింగ్స్‌లో 27,975 పరుగులు చేశాడు. మరో 42 పరుగులు చేస్తే ఈ విషయంలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర 28,016 పరుగుల రికార్డును అధిగమిస్తాడు. అప్పుడు కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మాన్‌గా అవతరిస్తాడు.
http://www.teluguone.com/news/content/virat-kohlis-record-36-211919.html





