జగన్ ఏపీకి ఒక లాస్ అకౌంట్ లాంటోడా...అయితే అదెలా?
Publish Date:Jan 2, 2026
Advertisement
మాజీ సీఎం జగన్ ఏది వేలు పెడితే అదంతా కూడా ఖర్చేనా.. ఆయన బెయిలుపై బయట ఉండటానికీ ఖర్చే.. అడుగు బయట పెట్టాలంటే ఖర్చే. ఇంత ఖర్చు రాజకీయం నవ్యాంధ్రలాంటి రాష్ట్రానికి అవసరమా? ఇంతకీ జగన్ పెట్టిస్తోన్న అనవసర ఖర్చులేవి? తాజాగా వెలుగులోకి వచ్చినదేంటి? అని చూస్తే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ఫోటో తొలగించాలంటే కూడా డబ్బు ఖర్చు అవసరమవుతుందా? అయితే ఎందుకని? జగన్ గత ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి తద్వారా ఒక్క టీటీడీలోనే పదకొండు వేల కోట్లు లేపేయగా.. మంత్రి అనగాని సత్య ప్రసాద్ చెప్పినట్టు 2025 మొత్తం మద్యనామ సంవత్సరంగా గడిచిపోయిందా. కారణం జగన్ తన హయాంలో చేసిన మద్యం కుంభకోణం వాటి లొసుగులు వెలికి తీయడానికే సరిపోయింది. వీటిలో జగన్ హయాంలో డైరెక్ట్ గా చేసిన లిక్కర్ స్కామ్ విలువే 4 వేల కోట్లు. ఇక నకిలీ మద్యం కుంభ కోణం కొన్ని వేల కోట్లల్లో ఉంటుందని అంచనా. ల్యాండ్- శాండ్- మైన్- వైన్- అంటూ జగన్ తన ఐదేళ్ల కాలంలో చేసిన అరాచకాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. ఆపై సంక్షేమం పేరిట ఎటూగాకుండా చేసిన ఖర్చు సుమారు రెండున్నర లక్షల కోట్లు. ఇవే ఏపీని ఆర్ధిక అంథకారంలో నెట్టేశాయనుకుంటే జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటివి తీస్కొచ్చి ఆయన బొమ్మలను తొలగించాలన్నా డెబ్భై కోట్లు ఖర్చవుతుందని తెలిసి షాకవుతున్నారంతా. ఇప్పటికీ సరిహద్దు రాళ్ల కోసం 700 కోట్లు, కాగా రేషన్ సరుకుల డెలివరీకి మరో 700 కోట్లు, రిషికొండ ప్యాలెస్ కోసం ఇంకో 600 కోట్లు భారీగా ప్రజాధనం వ్యయం చేశారు. ఇక ఎగ్ పఫ్ ల నుంచి మొదలు పెడితే.. ఎలుకులు పట్టడం వంటివి అటుంచితే ఆయన ఇంటి చుట్టూ ఫెన్సింగ్, వైయస్ విగ్రహాల ఖర్చు, వీటితో పాటు పార్టీ రంగుల పై చేసిన వ్యయం వంటివి తడిసి మోపెడయ్యాయి. వీటన్నిటి నుంచి విముక్తి కలిగించాలన్నా కూడా ఎదురు ఖర్చు చేయాల్సి వస్తోంది. కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. జగన్ ఫోటో తొలగించాలంటే రూ.70 కోట్లు కావాల్సిందే అంటున్నారంటే పరిస్తితేంటో ఊహించుకోవచ్చు. ఏ మాట కామాట జగన్ ఏపీకి ఒక లాస్ అకౌంట్ లాంటోడా అంటే అవుననే తెలుస్తోంది. అతడి జాతకం ఎలాంటిదో చెప్పలేం కానీ. ప్రతిదీ ఖర్చే. ఆయన వ్యక్తిగత వియమే తీసుకుంటే బెయిలుపై బయట తిరగడానికి లాయర్లకయ్యే ఖర్చులే ఆరు వేల కోట్ల రూపాయలని అంచనా వేశారు. అలాంటిది జగన్ ఒక రాష్ట్రాన్ని పరిపాలించాడంటే ఇంకెంత ఖర్చు చేస్తాడో ఊహించుకోవచ్చంటున్నారు పలువురు. ఇదే చంద్రబాబు.. స్వయంగా జనం సొమ్ము ఖర్చు చేయకుండా ప్రతిదాన్లో ఒక తరుణోపాయం ఆలోచిస్తారు. అది మెడికల్ కాలేజీల పీపీపీ కావచ్చు, పేదరికాన్ని నిర్మూలించే పీ-4 పథకం కావచ్చు. ఒక వేళ ఆయన మోడీ కోసం యోగాంధ్ర నిర్వహించడానికి 3వందల కోట్లు ఖర్చు చేస్తే, అందులో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే ఉపాయముంటుంది. అదే జగన్ అలాక్కాదు.. ప్రతిదీ వ్యయమే. ఏమాటకామాట ఖర్చు కూడా ఒక పెట్టుబడిలా చేయాలంటారు వారెన్ బఫెట్ లాంటి నిపుణులు. కానీ ఇలాంటివేవీ తెలియని పాబ్లో ఎస్కోబార్ మన జగన్. ఏం చేయద్దాం.. ఏపీ తలరాత అలా తగలబడింది. ఇలాంటి లాస్ పొలిటీషియన్ దొరికాడు ఏపీకని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు ఆర్ధిక రంగ నిపుణులు.
గత ఎన్నికల్లో ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్లే జగన్ ఘోర పరాజయం పాలయ్యారు. అప్పటి వరకూ పట్టాదారు పాసు పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ రాజముద్ర ఉండేది. అది కాదని తన పార్టీ నాయకులు వారించినా వినకుండా తుగ్లక్ చర్య చేపట్టారు జగన్. ఆ పుస్తకాలపై తన ఫోటోలు ముద్రించారు. దీంతో ఆయన కూడా ఈ అరాచక విధానం కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇపుడీ ఫోటోలను తొలగించడానికి కూడా ఏపీ ప్రభుత్వానికి ఖర్చయ్యేలా తెలుస్తోంది. మరి ఇలాంటి ఇంకెన్ని జగన్ మార్క్ నష్టాలు బయట పడతాయో ఏంటో.. అన్న ఆందోళన వ్యక్తమవుతోంది సర్వత్రా.
http://www.teluguone.com/news/content/liquor-scam-36-211924.html





