వినాయక చవితి ప్రసాదాలు...వాటి వెనుక దాగిన ఆరోగ్య రహస్యాలు..!

Publish Date:Sep 11, 2026

Advertisement

వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది భక్తిశ్రద్ధలు, రంగురంగుల మండపాలు, అంతకుమించి స్వామివారికి నివేదించే రకరకాల నైవేద్యాలు. బొజ్జ గణపయ్యకు పెట్టే ప్రసాదాలు కేవలం సంప్రదాయంలో భాగం మాత్రమే కాదు, వాటి వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే ఈ పండుగ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాల వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంటుంది. మన పెద్దలు ఆ కాలానికి తగినట్లుగా, శరీరానికి మేలు చేసే పదార్థాలనే వినాయకుడి ప్రసాదాలుగా మార్చారు. ఆ ప్రసాదాలు ఏమిటి, వాటి వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే..

కుడుములు , ఉండ్రాళ్ళు..

వినాయక చవితి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి కుడుములు, ఉండ్రాళ్ళు. వీటిని నూనె లేకుండా కేవలం ఆవిరి మీద మాత్రమే ఉడికిస్తారు. ఆవిరి మీద ఉడికే ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి చాలా సులభంగా ఉంటాయి. బియ్యపు పిండి, పెసరపప్పు లేదా శనగపప్పు, బెల్లం, కొబ్బరి కలగలిపి వీటిని తయారుచేస్తారు. బియ్యపు పిండి కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఆవిరి వంటకం కావడం వల్ల జీర్ణక్రియకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా పొట్టలో మంట, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఇవి కాపాడతాయి. కొందరు కుడుములను మైదా పిండితో నూనెలో డీప్ ఫ్రై చేసి చేస్తారు. ఇది అంత ఆరోగ్యానికి మంచిది కాదు. 

 బెల్లం , పప్పుధాన్యాల కాంబినేషన్..

అన్ని రకాల ప్రసాదాలలో బెల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయాన్ని శుభ్రపరచడానికి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది. కుడుముల్లో వాడే శనగపప్పు, పెసరపప్పుల ద్వారా శరీరానికి కావలసిన ప్రోటీన్లు లభిస్తాయి. వర్షాకాలంలో పెరిగే బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి బెల్లం, పప్పుధాన్యాల కాంబినేషన్ శరీరానికి మంచి బలవర్ధకమైన ఆహారంగా పనిచేస్తుంది.

జిల్లేడు కాయలు , మోదకాలు..

విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మోదకాలను బియ్యపు పిండిలో బెల్లం, కొబ్బరి పూరకంతో చేస్తారు. కొబ్బరిలో ఉండే మంచి కొవ్వులు చర్మానికి, జుట్టుకు చాలా మంచివి. అంతేకాకుండా కొబ్బరి శరీరానికి అవసరమైన శక్తిని త్వరగా అందిస్తుంది. కొబ్బరి , బెల్లం కలిపి తినడం వల్ల శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు, వాత రోగాల నివారణకు  ఈ కాంబినేషన్ చక్కగా తోడ్పడుతుంది.

పాయసం , పరమాన్నం..

పాలు, బియ్యం, బెల్లం లేదా చక్కెరతో తయారుచేసే పాయసం నివేదనలో ముఖ్యమైనది. పాలల్లో లభించే కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది. ఇందులో వేసే యాలకులు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, కడుపులో ఉన్న ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. పాయసంలో వాడే నెయ్యి శరీరానికి కావలసిన విటమిన్లు ఎ, డి లభించేలా చేస్తుంది , కీళ్ళకు అవసరమైన నూనెను అందిస్తుంది.

పులిహోర..

ఏ పండుగైనా పులిహోర లేకపోతే నివేదన పూర్తికాదు. వినాయక చవితి నాడు నిమ్మకాయ లేదా చింతపండు పులిహోరను ప్రసాదంగా పెడతారు. చింతపండు, నిమ్మకాయలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో విటమిన్ సి లభించడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పుల వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. పులిహోర తాళింపులో వాడే పసుపు సహజమైన యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. పసుపులోని కుర్కుమిన్ అనే అంశం శరీరంలో మంటను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే ఇందులో వేసే అల్లం, మిరియాలు జీర్ణరసాలను ఉత్పత్తి చేసి ఆకలిని పెంచుతాయి.

చలిమిడి , వడపప్పు..

వినాయక చవితి పూజ ముగిసిన తర్వాత ఇచ్చే ముఖ్యమైన ప్రసాదం చలిమిడి ,   పచ్చి పెసరపప్పును నీటిలో నానబెట్టి వడపప్పుగా ఇస్తారు. నానబెట్టిన పెసరపప్పులో పీచు పదార్థం, ప్రోటీన్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. వేడి చేసిన బియ్యపు పిండి, బెల్లం కలిపి చేసే చలిమిడి శరీరానికి తక్షణ బలాన్ని ఇస్తుంది. వర్షాకాలంలో కలిగే అలసటను నివారించడంలో ఈ  కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది.

పండ్ల నివేదన , పత్రీ ప్రభావం..

స్వామివారికి ప్రసాదాలతో పాటు రకరకాల పండ్లను సమర్పిస్తారు. ముఖ్యంగా వెలగపండు, నేరేడు పళ్ళు, అరటిపళ్ళు నివేదిస్తారు. వెలగపండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, కడుపులోని క్రిములను సంహరిస్తుంది. నేరేడు పళ్ళు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. వీటితో పాటు పూజలో ఉపయోగించే ఏకవింశతి పత్రి కూడా ఒక రకమైన ఔషధ గని. పూజ చేసే సమయంలో ఆ పత్రి తాకిడి, వాటి సువాసనల వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది.

ఈ విధంగా వినాయక చవితి ప్రసాదాలు కేవలం నైవేద్యం మాత్రమే కాకుండా, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధాలుగా పనిచేస్తాయి. మన సంస్కృతిలో భాగమైన ఈ ప్రసాదాలను తిని, పండుగను భక్తితో పాటు ఆరోగ్యకరంగా జరుపుకోవడం ఆ వినాయకుడు ఇచ్చే అదృష్టం.. ! 

                        *రూపశ్రీ.
 

By
en-us Political News

  
కీళ్ల నొప్పులు, వాపు, ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ (Rheumatoid Arthritis)లో కనిపించవచ్చు.
ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాలుగా మారింది. బిజీ జీవనశైలి, వేళపాళ లేని తిండి,
కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలిసినప్పుడు చాలామందిలో భయం, ఆందోళన మొదలవుతాయి.
నేటి ఆధునిక జీవనశైలిలో వెన్నునొప్పి అనేది చాలామందిని వేధించే ప్రధాన సమస్యగా మారింది. గంటల తరబడి డెస్క్ ముందు కూర్చుని పనిచేసే ఐటీ ఉద్యోగులు
మహిళల శరీరంలో ఏ వయసులో ఎలాంటి మార్పులు వస్తాయో సరిగ్గా గమనిస్తే, ముప్పై ఏళ్లు అనేది ఒక ప్రధానమైన మలుపు అని చెప్పవచ్చు.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మందులపైనే ఆధారపడటం సరిపోతుందా? మనం తీసుకునే ఆహారం, పోషకాలు, జీవనశైలి కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా?
వాతావరణ మార్పులు, జలుబు, ఇన్ఫెక్షన్లు లేదా సైనస్ సమస్యల వల్ల శ్వాసనాళాల్లో చిక్కటి కఫం పేరుకుపోతుంటుంది.
రోజూ తినే ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా? గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా?
50 తర్వాత వృద్ధాప్యం ఎందుకు వేగంగా కనిపిస్తుంది? 30 నుంచి 50 ఏళ్ల మధ్య శరీరంలో, చర్మంలో జరిగే మార్పులకు అసలు కారణాలు ఏమిటి?
వెన్నునొప్పి తర్వాత మానవులలో అత్యంత సాధారణంగా కనిపించే సమస్య మోకాళ్ల నొప్పులు. వయస్సు పైబడటం వల్ల లేదా మోకాలిలోని కార్టిలేజ్ ,
బరువు తగ్గాలని అన్నం మానేశారు… అయినా బరువు తగ్గడం లేదా? రోజూ డైట్ చేసినా వెయిట్ పెరుగుతుందా? అయితే మీ బరువు పెరగడానికి కేవలం ఎక్కువగా తినడమే కారణమా? లేక థైరాయిడ్, PCOS, హార్మోన్ల మార్పులు, ఇన్ఫ్లమేషన్ వంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయా?
అల్లం అనేది మన ప్రాచీన వంటకాల్లోనూ, ఆయుర్వేదంలోనూ ఎంతో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్న ఒక సహజమైన ఔషధం.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.