ఈజీ డైట్ హ్యాక్స్.. ఈ ఆహార నియమాలతో సులభంగా బరువు తగ్గవచ్చు..

Publish Date:Sep 9, 2026

Advertisement

ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాలుగా మారింది. బిజీ జీవనశైలి, వేళపాళ లేని తిండి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామంది అనతికాలంలోనే అధిక బరువు బారిన పడుతున్నారు. అయితే, బరువు తగ్గడానికి గంటల తరబడి జిమ్‌లో కష్టపడాల్సిన పనిలేదు లేదా కఠినమైన ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు. మన రోజువారీ ఆహారపు అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా సులభంగా, ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు.  అధిక బరువును తగ్గించుకోవడానికి సహాయపడే కొన్ని సులభమైన ఆహార నియమాలు , చిట్కాల గురించి  వివరంగా తెలుసుకుంటే..

ప్రోటీన్ ఫుడ్..

ప్రోటీన్ లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. రోజూ తీసుకునే ఆహారంలో గుడ్లు, పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలు, పనీర్, లేదా చికెన్ వంటి వాటిని చేర్చుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. దీనివల్ల అనవసరంగా చిరుతిళ్లు తినే అలవాటు తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది శరీరంలో కండరాల నిర్మాణానికి , జీవక్రియ రేటును పెంచడానికి తోడ్పడుతుంది.

మంచినీరు మ్యాజిక్..

భోజనం చేసే సమయానికి కనీసం అర్ధగంట ముందు ఒక పెద్ద గ్లాసు మంచి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది , భోజనం చేసేటప్పుడు అతిగా తినకుండా నిరోధించవచ్చు. రోజూ సరిపడా నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి , మెటబాలిజం వేగవంతమవుతుంది. దాహం వేసినప్పుడు శీతల పానీయాలు లేదా ప్యాక్ చేసిన జ్యూస్‌లు తాగడానికి బదులుగా సాధారణ నీరు లేదా నిమ్మరసం, మజ్జిగ తీసుకోవడం చాలా బాగా హెల్ప్ అవుతుంది.

ఫైబర్..

రోజువారీ ఆహారంలో పీచు పదార్థం లేదా ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, హోల్ గ్రెయిన్స్ , ఓట్స్ వంటి వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను నెమ్మదింపజేసి, రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగకుండా ఫైబర్ నిరోధిస్తుంది. దీనివల్ల త్వరగా ఆకలి వేయదు. కనుక ప్రతిరోజూ  తినే భోజనంలో సగం భాగం కూరగాయలు లేదా సలాడ్లు ఉండేలా చూసుకోవడం మంచిది.

తినేటప్పుడు ఈ జాగ్రత్త తప్పనిసరి..

ఆహారం తినేటప్పుడు టీవీ, మొబైల్ ఫోన్లు చూడటం వంటి పనులు మానుకోవాలి. ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమలి తినడం చాలా ముఖ్యం. ఆహారాన్ని బాగా నమిలి తిన్నప్పుడు జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది , కడుపు నిండిందనే సంకేతం మెదడుకు త్వరగా అందుతుంది. తొందరపడి తింటే తెలియకుండానే ఎక్కువ ఆహారాన్ని తినేసే అవకాశం ఉంటుంది.

జంక్ ఫుడ్స్..

ప్యాక్ చేసిన ఆహారాలు, బేకరీ తిళ్లు, వేపుళ్లు, , ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వీటిలో కేలరీలు, ఉప్పు , ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి బరువు పెరగడానికి ప్రధాన కారణమవుతాయి. అలాగే పంచదార , తీపి పదార్థాలను పూర్తిగా తగ్గించడం వల్ల శరీరంలో కొవ్వు చేరకుండా చూసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు చక్కెర కలిపిన స్వీట్లకు బదులుగా ఖర్జూరాలు లేదా తాజా పండ్లను ఎంచుకోవచ్చు.

వ్యాయామం ముఖ్యమే..

ఆహార నియమాలతో పాటు రోజుకి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే శరీరంలో ఆకలిని పెంచే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. దీనివల్ల అనవసరమైన ఆకలి పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది. మానసిక ఒత్తిడి కూడా బరువు పెరగడానికి ఒక కారణం, కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటివి సాధన చేయాలి.

అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం..

బరువు తగ్గడం అనేది ఒక రాత్రిలో జరిగే అద్భుతం కాదు. దీనికి సహనం, నిలకడ చాలా అవసరం. కఠినమైన డైటింగ్స్ చేసి అనారోగ్యం పాలవడం కంటే, ఇటువంటి చిన్న చిన్న మార్పులను జీవనశైలిలో భాగం చేసుకుంటే సులభంగా , శాశ్వతంగా బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చు.

                       *రూపశ్రీ.

By
en-us Political News

  
కీళ్ల నొప్పులు, వాపు, ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ (Rheumatoid Arthritis)లో కనిపించవచ్చు.
వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది భక్తిశ్రద్ధలు, రంగురంగుల మండపాలు, అంతకుమించి స్వామివారికి నివేదించే రకరకాల నైవేద్యాలు.
కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలిసినప్పుడు చాలామందిలో భయం, ఆందోళన మొదలవుతాయి.
నేటి ఆధునిక జీవనశైలిలో వెన్నునొప్పి అనేది చాలామందిని వేధించే ప్రధాన సమస్యగా మారింది. గంటల తరబడి డెస్క్ ముందు కూర్చుని పనిచేసే ఐటీ ఉద్యోగులు
మహిళల శరీరంలో ఏ వయసులో ఎలాంటి మార్పులు వస్తాయో సరిగ్గా గమనిస్తే, ముప్పై ఏళ్లు అనేది ఒక ప్రధానమైన మలుపు అని చెప్పవచ్చు.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మందులపైనే ఆధారపడటం సరిపోతుందా? మనం తీసుకునే ఆహారం, పోషకాలు, జీవనశైలి కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా?
వాతావరణ మార్పులు, జలుబు, ఇన్ఫెక్షన్లు లేదా సైనస్ సమస్యల వల్ల శ్వాసనాళాల్లో చిక్కటి కఫం పేరుకుపోతుంటుంది.
రోజూ తినే ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా? గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా?
50 తర్వాత వృద్ధాప్యం ఎందుకు వేగంగా కనిపిస్తుంది? 30 నుంచి 50 ఏళ్ల మధ్య శరీరంలో, చర్మంలో జరిగే మార్పులకు అసలు కారణాలు ఏమిటి?
వెన్నునొప్పి తర్వాత మానవులలో అత్యంత సాధారణంగా కనిపించే సమస్య మోకాళ్ల నొప్పులు. వయస్సు పైబడటం వల్ల లేదా మోకాలిలోని కార్టిలేజ్ ,
బరువు తగ్గాలని అన్నం మానేశారు… అయినా బరువు తగ్గడం లేదా? రోజూ డైట్ చేసినా వెయిట్ పెరుగుతుందా? అయితే మీ బరువు పెరగడానికి కేవలం ఎక్కువగా తినడమే కారణమా? లేక థైరాయిడ్, PCOS, హార్మోన్ల మార్పులు, ఇన్ఫ్లమేషన్ వంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయా?
అల్లం అనేది మన ప్రాచీన వంటకాల్లోనూ, ఆయుర్వేదంలోనూ ఎంతో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్న ఒక సహజమైన ఔషధం.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.