30 ఏళ్ల తర్వాత మహిళల్లో బోన్ డెన్సిటీ.. దిమ్మతిరిగే నిజాలివి..!

Publish Date:Sep 9, 2026

Advertisement

మహిళల శరీరంలో ఏ వయసులో ఎలాంటి మార్పులు వస్తాయో సరిగ్గా గమనిస్తే, ముప్పై ఏళ్లు అనేది ఒక ప్రధానమైన మలుపు అని చెప్పవచ్చు. ఇరవైల వయసులో ఉండే ఎనర్జీ, వేగంగా కోలుకునే తత్వం ముప్పైకి వచ్చేసరికి కాస్త మందగిస్తాయి. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం విషయంలో చాలామందికి తెలియని, తెలిసినా నిర్లక్ష్యం చేసే అనేక విషయాలు ఉంటాయి. చాలామంది ఎముకల బలహీనత లేదా ఆస్టియోపోరోసిస్ అనేది కేవలం అరవై ఏళ్లు దాటిన ముసలివారికి మాత్రమే వచ్చే సమస్య అని భావిస్తారు. కానీ ఎముకలు గుల్లబారే ప్రక్రియ , వాటి నాణ్యత తగ్గడం అనేది నిశ్శబ్దంగా ముప్పై ఏళ్ల వయసు నుంచే ప్రారంభమవుతుంది. ఈ విషయం  అందరూ నమ్మే  అపోహలు, వాటి వెనుక ఉన్న సైన్స్ , ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన  ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే..

 ఎముకల మార్పు..

మన శరీరంలోని ఎముకలు ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండే నిర్జీవ నిర్మాణాలు కావు. అవి నిరంతరం మారుతూ ఉండే సజీవ కణజాలాలు. పాత ఎముక కణజాలం తొలగిపోవడం ,  దాని స్థానంలో కొత్త ఎముక కణజాలం ఏర్పడటం అనే ప్రక్రియ జీవితాంతం జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియను బోన్ రీమోడలింగ్ అంటారు. చిన్నతనం నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ల వయసు వరకు శరీరం పాత కణజాలాన్ని తొలగించే వేగం కంటే కొత్త కణజాలాన్ని నిర్మించే వేగమే ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాన్నే పీక్ బోన్ మాస్ అంటారు. అంటే జీవితంలో ఎముకలు చాలా సాంద్రతతో, బలంగా ఉండే స్థితి ఇదే.

30 ఏళ్ల తర్వాత..

ముప్పై ఏళ్లు దాటిన తర్వాత ఎముకల దశ పూర్తిగా మారిపోతుంది. శరీరం కొత్త ఎముకను నిర్మించే వేగం కంటే, పాత ఎముక కణజాలాన్ని కోల్పోయే వేగం పెరగడం మొదలవుతుంది. దీనిని సాధారణ భాషలో బోన్ లాస్ లేదా బోన్ డెన్సిటీ తగ్గడం అంటారు. ఈ మార్పు ముప్పైలలోనే మొదలైనప్పటికీ, ప్రారంభంలో ఎలాంటి నొప్పులు లేదా స్పష్టమైన లక్షణాలు ఉండవు. అందుకే దీనిని సైలెంట్ చేంజ్ అని పిలుస్తారు. ఈ వయసులో శ్రద్ధ తీసుకోకపోతే, నలభై,  యాభై ఏళ్లలో స్వల్పంగా కిందపడినా ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతుంది.

కాల్షియం సరిపోతుందా?

ఎముకల బలహీనత అనగానే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది కాల్షియం. చాలామంది వెంటనే కాల్షియం మాత్రలు వేసుకోవడం లేదా పాలు తాగడం మొదలుపెడతారు. కానీ నిజానికి కాల్షియం ఒక్కటే ఎముకలను కాపాడలేదు. మీరు ఎంత కాల్షియం తీసుకున్నా, దానిని శరీరం పీల్చుకోవడానికి విటమిన్ డి3 చాలా అవసరం. సూర్యరశ్మి సరిగ్గా తగలకపోవడం వల్ల నేటి కాలంలో ఎంతోమంది మహిళలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. దీనితో పాటు విటమిన్ కె2, మెగ్నీషియం, భాస్వరం వంటి ఇతర మూలకాలు కూడా సరిపడా లేకపోతే, తిన్న ఆహారంలోని కాల్షియం ఎముకలకు చేరకుండా రక్తంలోనే ఉండిపోతుంది లేదా మూత్రపిండాల్లో రాళ్లుగా మారే ప్రమాదం ఉంటుంది.

హార్మోన్ల పాత్ర..

30 ఏళ్ల తర్వాత  వయసులో హార్మోన్ల పాత్ర కూడా చాలా కీలకమైనది. మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ఎముకల సాంద్రతను కాపాడటంలో రక్షణ కవచంలా పనిచేస్తుంది. ముప్పై ఐదు దాటిన తర్వాత లేదా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు, థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు ఈస్ట్రోజెన్ స్థాయిలలో హెచ్చుతగ్గులు వస్తాయి. 

ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గిన ప్రతిసారీ ఎముకలు తమ సాంద్రతను వేగంగా కోల్పోతాయి. ముఖ్యంగా గర్భధారణ, పాలిచ్చే సమయాల్లో తల్లి శరీరం నుంచి అధిక మొత్తంలో కాల్షియం బిడ్డకు అందుతుంది. ఆ సమయంలో తగినంత పోషకాహారం తీసుకోకపోతే, ఆ లోపం వయసయ్యే కొద్ది స్పష్టంగా బయటపడుతుంది.

వ్యాయామం..

వ్యాయామం విషయంలో కూడా చాలామంది మహిళలు పొరబడుతుంటారు. ప్రతిరోజూ నడవడం లేదా ఇంటి పనులు చేయడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయని అనుకుంటారు. నడక గుండె ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, ఎముకల సాంద్రతను పెంచడానికి లేదా బలంగా ఉంచడానికి వేర్ బేరింగ్ వ్యాయామాలు , రెసిస్టెన్స్ ట్రెయినింగ్ అవసరం. అంటే కాస్త బరువులు ఎత్తడం, పుష్ అప్స్ చేయడం, సొంత శరీర బరువును ఉపయోగించి చేసే వ్యాయామాలు చేయడం వల్ల ఎముకలపై కొంత ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడికి స్పందనగానే శరీరం ఎముకల సాంద్రతను పెంచే కణాలను వేగంగా ఉత్పత్తి చేస్తుంది.

ఎముకలకు నష్టం కలిగించే అలవాట్లు..

ఆధునిక జీవనశైలిలోని కొన్ని అలవాట్లు ఎముకలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయి. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ లో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్ , ఉప్పు ఎముకల్లోని కాల్షియంను బయటకు లాగేస్తాయి. కాఫీలు, టీలు ఎక్కువగా తాగడం వల్ల కూడా కాల్షియం శోషణ మందగిస్తుంది. ఇక క్రాష్ డైటింగ్ లు చేస్తూ సడన్ గా బరువు తగ్గడం వల్ల కొవ్వుతో పాటు ఎముకల సాంద్రత కూడా దారుణంగా పడిపోతుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ముప్పై ఏళ్లు దాటిన మహిళలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్ద పెద్ద ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ ఉదయం కాసేపు ఎండలో గడపడం, ఆకుకూరలు, రాగులు, నువ్వులు, విత్తనాలు, పాలు వంటి సమతులాహారాన్ని భాగం చేసుకోవడం, వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయడం , క్రమం తప్పకుండా విటమిన్ డి, కాల్షియం స్థాయిలను చెక్  చేయించుకోవడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చు. నలభై ఏళ్ల తర్వాత ఎముకల సమస్యలతో బాధపడేకంటే, ముప్పైల నుంచే ఎముకల ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం ఎంతో శ్రేయస్కరం.

                  *రూపశ్రీ.

 

By
en-us Political News

  
కీళ్ల నొప్పులు, వాపు, ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ (Rheumatoid Arthritis)లో కనిపించవచ్చు.
వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది భక్తిశ్రద్ధలు, రంగురంగుల మండపాలు, అంతకుమించి స్వామివారికి నివేదించే రకరకాల నైవేద్యాలు.
ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాలుగా మారింది. బిజీ జీవనశైలి, వేళపాళ లేని తిండి,
కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలిసినప్పుడు చాలామందిలో భయం, ఆందోళన మొదలవుతాయి.
నేటి ఆధునిక జీవనశైలిలో వెన్నునొప్పి అనేది చాలామందిని వేధించే ప్రధాన సమస్యగా మారింది. గంటల తరబడి డెస్క్ ముందు కూర్చుని పనిచేసే ఐటీ ఉద్యోగులు
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మందులపైనే ఆధారపడటం సరిపోతుందా? మనం తీసుకునే ఆహారం, పోషకాలు, జీవనశైలి కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా?
వాతావరణ మార్పులు, జలుబు, ఇన్ఫెక్షన్లు లేదా సైనస్ సమస్యల వల్ల శ్వాసనాళాల్లో చిక్కటి కఫం పేరుకుపోతుంటుంది.
రోజూ తినే ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా? గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా?
50 తర్వాత వృద్ధాప్యం ఎందుకు వేగంగా కనిపిస్తుంది? 30 నుంచి 50 ఏళ్ల మధ్య శరీరంలో, చర్మంలో జరిగే మార్పులకు అసలు కారణాలు ఏమిటి?
వెన్నునొప్పి తర్వాత మానవులలో అత్యంత సాధారణంగా కనిపించే సమస్య మోకాళ్ల నొప్పులు. వయస్సు పైబడటం వల్ల లేదా మోకాలిలోని కార్టిలేజ్ ,
బరువు తగ్గాలని అన్నం మానేశారు… అయినా బరువు తగ్గడం లేదా? రోజూ డైట్ చేసినా వెయిట్ పెరుగుతుందా? అయితే మీ బరువు పెరగడానికి కేవలం ఎక్కువగా తినడమే కారణమా? లేక థైరాయిడ్, PCOS, హార్మోన్ల మార్పులు, ఇన్ఫ్లమేషన్ వంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయా?
అల్లం అనేది మన ప్రాచీన వంటకాల్లోనూ, ఆయుర్వేదంలోనూ ఎంతో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్న ఒక సహజమైన ఔషధం.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.