డెస్క్ జాబ్ లు బైక్ జర్నీలు..వీటి వల్ల కలిగే వెన్ను నొప్పికి ఇలా చెక్ పెట్టండి..!

Publish Date:Sep 9, 2026

Advertisement

నేటి ఆధునిక జీవనశైలిలో వెన్నునొప్పి అనేది చాలామందిని వేధించే ప్రధాన సమస్యగా మారింది. గంటల తరబడి డెస్క్ ముందు కూర్చుని పనిచేసే ఐటీ ఉద్యోగులు, ఆఫీస్ సిబ్బంది ఒకవైపు అయితే, ప్రతిరోజూ ట్రాఫిక్‌లో కిలోమీటర్ల కొద్దీ బైక్ ప్రయాణాలు చేసేవారు మరొకవైపు. ఈ రెండు రకాల పనుల వల్ల వెన్నెముకపై చాలా ఒత్తిడి పడి, చిన్న వయస్సులోనే తీవ్రమైన వెన్నునొప్పి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది భవిష్యత్తులో డిస్క్ సమస్యలు, నరాల బలహీనతకు దారితీసే అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. అవేంటో తెలుసుకుంటే..

కూర్చునే పద్ధతిపై దృష్టి పెట్టాలి..

కుర్చీలో కూర్చున్నప్పుడు వీపు కుర్చీకి సరిగ్గా ఆనుకుని ఉండేలా చూసుకోవాలి. నడుము వెనుక భాగంలో ఖాళీ లేకుండా చిన్న కుషన్ లేదా పిల్లో పెట్టుకోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. కంప్యూటర్ లేదా లాప్‌టాప్ స్క్రీన్  కళ్ళ ఎత్తులోనే ఉండాలి. స్క్రీన్ కిందకు ఉన్నప్పుడు మెడ, వెన్ను భాగం ముందుకు వంగి నొప్పికి కారణమవుతాయి. 

ప్రతి నలభై ఐదు నిమిషాలకు ఒకసారి సీటు నుంచి లేచి కనీసం రెండు నిమిషాలు అటు ఇటూ నడవడం లేదా శరీరాన్ని స్ట్రెచ్ చేయడం అలవాటు చేసుకోవాలి.

బైక్ జర్నీలు చేసేవారికి జాగ్రత్తలు..

రైడింగ్ చేసేటప్పుడు వీపును పక్కకు లేదా ముందుకు ఎక్కువగా వంచకుండా నిటారుగా కూర్చోవాలి. బైక్ షాక్ అబ్జార్బర్లను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం. రోడ్డుపై ఉండే గోతులు, స్పీడ్ బ్రేకర్ల వల్ల వచ్చే షాక్స్ నేరుగా వెన్నెముకపై పడతాయి. అందుకే ప్రయాణంలో హెల్మెట్‌తో పాటు నడుముకు సపోర్ట్ ఇచ్చే లుంబార్ బెల్ట్ వాడటం మంచిది. దూర ప్రాంతాలకు బైక్‌పై వెళ్లేవారు మధ్యమధ్యలో ఆగి కాసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల కండరాల ఒత్తిడి తగ్గుతుంది.

వెన్నునొప్పికి ప్రధాన కారణం నడుము , పొత్తికడుపు భాగంలోని కండరాలు బలహీనపడటమే. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కనీసం ఇరవై నిమిషాలు వ్యాయామం చేయడానికి కేటాయించాలి. భుజాలు, నడుము, మెడ భాగాలను సాగదీసే స్ట్రెచింగ్ వ్యాయామాలు, యోగాలోని భుజంగాసనం, మార్జాలాసనం వంటివి వెన్నెముకను బలంగా, దృఢంగా మారుస్తాయి. ఈ వ్యాయామాలు కండరాలకు రక్తప్రసరణను పెంచి నొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి.

నీరు..

శరీరంలో నీటి శాతం తగ్గితే వెన్నెముక డిస్కులు తమ శోషణ శక్తిని కోల్పోయి త్వరగా అరిగిపోతాయి. అందుకే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి. ఆహారంలో క్యాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి12 ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పాలు, ఆకుకూరలు, గుడ్లు, బాదం , నువ్వులు రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవాలి. శరీర బరువు పెరగకుండా చూసుకోవడం కూడా వెన్నునొప్పి నివారణలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

నిద్ర..

రాత్రి వేళల్లో సరైన నిద్ర లేకపోవడం లేదా సరిగ్గా లేని మెత్తటి పరుపులపై పడుకోవడం వల్ల కూడా వెన్నునొప్పి పెరుగుతుంది. మరీ మెత్తగా ఉన్న పరుపుల కంటే వెన్నెముకకు సరైన ఆధారాన్ని ఇచ్చే ఆర్థోపెడిక్ పరుపులను ఉపయోగించడం మంచిది.

చిన్న చిట్కా..

 పడుకునేటప్పుడు కాళ్ళ మధ్యలో చిన్న దిండు పెట్టుకోవడం వల్ల నడుముపై పడే భారం తగ్గుతుంది.
ఈ చిన్నపాటి మార్పులను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా డెస్క్ జాబ్‌లు, బైక్ ప్రయాణాల వల్ల వచ్చే వెన్నునొప్పికి సులభంగా చెక్ పెట్టవచ్చు. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉండి, కాళ్ళలోకి పాకుతున్నట్లు అనిపిస్తే ఆలస్యం చేయకుండా ఆర్థోపెడిక్ లేదా ఫిజియోథెరపీ వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం.


                    *రూపశ్రీ.

 

By
en-us Political News

  
కీళ్ల నొప్పులు, వాపు, ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ (Rheumatoid Arthritis)లో కనిపించవచ్చు.
వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది భక్తిశ్రద్ధలు, రంగురంగుల మండపాలు, అంతకుమించి స్వామివారికి నివేదించే రకరకాల నైవేద్యాలు.
ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాలుగా మారింది. బిజీ జీవనశైలి, వేళపాళ లేని తిండి,
కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలిసినప్పుడు చాలామందిలో భయం, ఆందోళన మొదలవుతాయి.
మహిళల శరీరంలో ఏ వయసులో ఎలాంటి మార్పులు వస్తాయో సరిగ్గా గమనిస్తే, ముప్పై ఏళ్లు అనేది ఒక ప్రధానమైన మలుపు అని చెప్పవచ్చు.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మందులపైనే ఆధారపడటం సరిపోతుందా? మనం తీసుకునే ఆహారం, పోషకాలు, జీవనశైలి కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా?
వాతావరణ మార్పులు, జలుబు, ఇన్ఫెక్షన్లు లేదా సైనస్ సమస్యల వల్ల శ్వాసనాళాల్లో చిక్కటి కఫం పేరుకుపోతుంటుంది.
రోజూ తినే ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా? గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా?
50 తర్వాత వృద్ధాప్యం ఎందుకు వేగంగా కనిపిస్తుంది? 30 నుంచి 50 ఏళ్ల మధ్య శరీరంలో, చర్మంలో జరిగే మార్పులకు అసలు కారణాలు ఏమిటి?
వెన్నునొప్పి తర్వాత మానవులలో అత్యంత సాధారణంగా కనిపించే సమస్య మోకాళ్ల నొప్పులు. వయస్సు పైబడటం వల్ల లేదా మోకాలిలోని కార్టిలేజ్ ,
బరువు తగ్గాలని అన్నం మానేశారు… అయినా బరువు తగ్గడం లేదా? రోజూ డైట్ చేసినా వెయిట్ పెరుగుతుందా? అయితే మీ బరువు పెరగడానికి కేవలం ఎక్కువగా తినడమే కారణమా? లేక థైరాయిడ్, PCOS, హార్మోన్ల మార్పులు, ఇన్ఫ్లమేషన్ వంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయా?
అల్లం అనేది మన ప్రాచీన వంటకాల్లోనూ, ఆయుర్వేదంలోనూ ఎంతో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్న ఒక సహజమైన ఔషధం.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.