విడదల రజనీ కాదు.. వసూళ్ల రాణి!

Publish Date:Mar 13, 2024

Advertisement

తమ పార్టీ నేతల అక్రమాలు, అవినీతి బాగోతాలపై విమర్శలు, ఆరోపణలు చేసే అవకాశం ప్రత్యర్థి పార్టీలకు ఇచ్చే ప్రశక్తే లేదంటున్నారు వైసీపీ నాయకులు. మా పార్టీ నేతల అవినీతి బాగోతం గురించి తామే చెబుతాముంటూ ముందుకు వస్తున్నారు.  వైసీపీలో విభేదాలు వేరే లెవల్ కు చేరుతున్నాయి. సరిగ్గా ఎన్నికల ముంగిట ఆ పార్టీలోని వర్గవిభేదాలు రచ్చకెక్కడం వెనుక పార్టీ అధినేత వైఎస్ జగన్  తీరే కారణమని పార్టీ వర్గాల్లోనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎవరినీ నమ్మలేకపోవడం, తనపై తప్ప మరెవరిపై విశ్వాసం లేకపోవడం, అన్నిటికీ మించి వైసీపీ అభ్యర్థిగా ఏ నియోజకవర్గంలో ఎవరిని నిలబెడితే విజయం సాధించగలరు అన్న అంచనాలలో జగన్ వైఫల్యం ఈ పరిస్థితికి కారణమని పార్టీ వర్గాలే విశ్లేషిస్తున్నాయి. అడ్డగోలుగా, హేతు రహితంగా సిట్టింగుల మార్పు అంటూ జగన్ మొదలు పెట్టిన ప్రయోగం మొదటికే మోసం తీసుకు వచ్చేలా ఉందని అంటున్నారు.

సిట్టింగుల మార్పు విషయంలో కూడా ఒక విధానం, రీతి, తీరు లేకుండా ఆయన చేస్తున్న విన్యాసాలు అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ విజయావకాశాలను మరింత దిగజార్చేస్తున్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. తాజాగా  చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ వైసీపీ సమన్వ యకర్తే పార్టీ కార్యకర్తలు, అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పరువును నిండా గంగలో ముంచేశారు. పార్టీ హైకమాండ్ కే అల్టిమేటమ్ జారీ చేశారు. పనిలో పనిగా మంత్రి విడదల రజనీపై ఆరోపణలు విమర్శలూ గుప్పించేస్తూ ప్రభుత్వ సలహాదారు సజ్జలనూ ముగ్గులోకి దించారు. మంత్రి రజనీ వసూళ్ల బాగోతం సజ్జలకు తెలుసునని బాంబు పేల్చారు. 

విషయానికి వస్తే చిలకలూరిపేట సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి విడదల రజనీని చిలకలూరి పేట నుంచి మార్చి ఆమను గుంటూరు వెస్ట్ నుంచి రంగంలోకి దింపాలని జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. చిలకలూరి పేట నుంచి మల్లెల రాజేష్ నాయుడిని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టే ఉద్దేశంతో ఆయనకు నియోజకవర్గ సమన్వయకర్త  బాధ్యతలను అప్పగించారు. తాజా సమాచారం ప్రకారం మల్లెల రాజేష్ నాయుడిని కూడా మార్చి మరో వ్యక్తిని అక్కడ నుంచి అభ్యర్థిగా నిలబెట్టాలని జగన్ భావిస్తున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మల్లేల రాజేష్ నాయుడు  తన నాయకత్వ మార్పు పై వచ్చే వార్తల పై పార్టీ కార్యకర్తలతో, తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి మంత్రి విడుదల రజని వసూళ్ల రాణి అంటూ విమర్శలు గుప్పించారు. తన వద్ద నుండి ఆరున్నర కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వ ముఖ్య సలహాదారు  సజ్జల దగ్గర పంచాయితీ కూడా జరిగిందనీ, ఆ తరువాత ఆమె  3 కోట్లు వెనక్కి  ఇచ్చారనీ, మిగిలిన మొత్తం కూడా ఇచ్చే తీరాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగకుండా చిలకలూరి పేట నుంచి పోటీ చేస్తే విడదల రజనీ గెలిచే అవకాశాలు ఇసుమంతైనా లేవు కనుకనే జగన్ ఆమెను గుంటూరుకు పంపేశారన్నారు.

దమ్ముంటే ఆమె చిలకలూరి పేటలో పోటీకి దిగాలని సవాల్ విసిరారు. ఇక పార్టీ హైకమాండ్ తనకు కాకుండా మరొకరికి పార్టీ టికెట్ ఇవ్వాలని నిర్ణయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక కూడా జారీ చేశారు. తనను కాదని మర్రి రాజశేఖర్ ను చిలకలూరిపేట అభ్యర్థిగా నిలబెడితే సహకరిస్తాననీ, అయితే తమ ఇద్దరినీ కాకుండా మరో వ్యక్తిని తీసుకువస్తామంటే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు.  పార్టీ అధినేత సిద్ధం అంటూ విపక్షాలపై విమర్శల వర్షం కురిపిస్తుంటే..  సొంత పార్టీ నేతలు మాత్రం అంతర్గత పోరాటానికే తాము సిద్ధంగా ఉన్నామనీ, అది తేలిన తరువాతే ఎన్నికల యుద్ధానికి రెడీ అవుతామని విస్ఫష్టంగా తేల్చేస్తున్నారు. ఈ పరిస్థితి ఒక్క చిలకలూరి పేటకు మాత్రమే పరిమితమై లేదనీ, జగన్ సిట్టింగుల మార్పు తంత్రంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ ఇదే పరిస్థితి ఉందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి రోజాపై సొంత పార్టీ నాయకులే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.  మాప్రభుత్వంలో అవినీతి లేదంటూ   ముఖ్యమంత్రి  చెబుతుంటే.. సొంత పార్టీ నేతలే వైసీపీ మంత్రుల అవినీతి బండారాన్ని బయటపెడుతున్నారు.  ఈ పరిస్థితుల్లో సొంత పార్టీలోని సమస్యలను పరిష్కరించకుండా సిద్ధం అంటూ చొక్కా చేతులు మడతపెట్టినంత మాత్రాని ఎన్నికల రణరంగానికి రెడీ అయిపోయినట్లు కాదని వైసీపీ శ్రేణులే అంటున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదిక పదకొండవ సంచికలో ఘాటైన చర్చ జరిగింది.
జగన్ హయాంలో అప్ప‌టి విప‌క్ష నాయ‌కుడు, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు కుటుంబంపై చేసిన దారుణ వ్యాఖ్య‌లు కారణమనడంలో సందేహం లేదు. అంతే కాకుండా జగన్ హయాం అంతా దౌర్జన్యాలు, దౌర్జ‌న్యాలు, గంట, అరగంట అంటూ మహిళలతో ఫోన్ లలో అసభ్య సంభాషణలు న్యూడ్ వీడియోలు,హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనలు, అటువంటి వారిని అక్కున చేర్చుకున్న జగన్ తీరు, ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులు, కేసులు.ఇలా జగన్ హయాంలో రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా, భద్రంగా లేని పరిస్థితే గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణం.
రాష్ట్రంలో కులచిచ్చు రేపేందుకు వైసీపీ చేస్తున్న దుష్టయత్నాలను మొగ్గలోనే తుంచేయాలని వీరిరువు అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, విపక్షం విసిరే కులపరమైన ట్రాప్‌లో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆ మేరకు క్యాడర్ కు కూడా తగు సూచనలు చేయాలని వీరిరువురూ నిర్ణయించినట్లు తెలిసింది.
ఆ పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. దీనిపై గతంలోనే స్పీకర్ కు ఫిర్యాదు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. కాగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం నిర్దుష్టగడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ ను ఆదేశించిన సంగతి విదితమే.
పవన్ కల్యాణ్ తెలంగాణ మునిసిపోల్స్ లో జనసేన బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. బీజేపీ అభ్యర్థుల తరఫున తాను స్వయంగా ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు.
జనసేన పార్టీ తెలంగాణ మునిసిపోల్స్ లో పోటీ చేయనున్నట్లు ప్రకటించడమే కాదు, అభ్యర్థులను కూడా ప్రకటించి ప్రచారానికి సైతం రెడీ అయ్యింది. సరిగ్గా ఇటువంటి తరుణంలో బీజేపీ నేత రామచంద్రరావు , కిషన్ రెడ్డిపవన్ కల్యాణ్‌తో భేటీ అవ్వడం, జనసేన మునిసిపోల్స్ లో బీజేపీకి మద్దతు ప్రకటించిందనీ, జనసేనాని స్వయంగా ప్రచారంలో కూడా పాల్గొంటారంటూ ప్రకటన ఇవ్వడం జనసేన వర్గాలలో అసంతృప్తికి కారణమైంది.
శాంతి భద్రతల పరిరక్షణలో ఏపీలోని చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం తమపై ఆధారపడి ఉందన్న అహంభావంతో. ఏం చేసినా చెల్లుతుందనే ధోరణితో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారని, దుర్భాషలాడారని కాకాణిపై తెలుగుదేశం నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు అందజేశారు.
గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అమర్‌నాథ్‌ను హెసీఏ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ను బ్లాక్‌మెయిల్‌ చేశారన్న ఆరోపణలు రావడం, సీఐడీ అరెస్టు నేపథ్యంలో జగన్మోహన్‌రావును ఇంతకుముందే హెచ్‌సీఏ సస్పెండ్‌ చేసింది.
కాపు సామాజికవర్గ నాయకులను వైసీపీ కేవలం ఓటు యంత్రాలుగా, అవసరానికి వాడుకునే సాధనాలుగా మాత్రమే చూస్తోందన్నారు. గతంలో కాపు రిజర్వేషన్లను జగన్ రద్దు చేస్తున్న సమయంలో అంబటి నోరెత్తకపోవడాన్ని ఆయన ఆఈ సందర్భంగా గుర్తు చేశారు.
సీట్ల పంపకంలో.. తన గొంతు కోశారని, కాంగ్రెస్ అధిష్ఠానం తన వర్గానికి న్యాయం చేయలేదని జీవన్ రెడ్డి తన అనుచరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులు ఉండగా.. 29 టికెట్లు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఎం.సంజయ్ కుమార్ వర్గానికి, 21 టికెట్లు జీవన్ రెడ్డి వర్గానికి పార్టీ అధిష్ఠానం కేటాయించినట్లు సమాచారం.
రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటూ.. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ప్రభుత్వ గళాన్ని వినిపించడంలో జనసేన నేతలు ఉదాశీనంగా వ్యవహరించడంపై మండి పడ్డారు. ఎవరి పేరూ ఎత్తకపోయినా, ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆయన తన సోదరుడు నాగబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని అర్ధమౌతోంని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే తాను ఆలయంలోకి వెళ్లి శుద్ధి కార్యక్రమం చేస్తానని ఆమె పట్టుబట్టడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దశలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ విడదల రజని, ఆమె అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.