Publish Date:Feb 17, 2026
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ నూజివీడు కోర్టులో హాజరయ్యారు. నకిలీ పట్టాల కేసులో వల్లభనేని వంశీ కోర్టుకు హజారయ్యారు. నకిలీ పట్టాల కేసులో పోలీసులు గతంలో వల్లభనేని వంశీ, మరో ఇద్దరు అతడి అనుచరులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని వారాల రిమాండ్ తరువాత ఈ ముగ్గురికీ కూడా బెయిలు లభించింది.
కాగా ఆ కేసు విచారణ సందర్భంగా వల్లభనేని వంశీ సోమవారం (ఫిబ్రవరి 16) నూజివీడు కోర్టులో హాజరయ్యారు. వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆయన అనుచరులు మోహనరంగారావు, సురేష్ లు కూడా కోర్టుకు హాజరయ్యారు. కాగా న్యాయమూర్తి కేసు విచారణను మార్చి 2కు వాయిదా వేశారు.నకిలీ పట్టాల కేసు మాత్రమే కాకుండా వల్లభనేని వంశీపై అక్రమ ఇసుక తవ్వకాలు, గన్నవరం తెలుగుదేశం కార్యాలపంపై దాడి సహా వివిధ పోలీసు స్టేషన్లలో పలు కేసులు ఉన్న సంగతి తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vallabhaneni-vamshi-attend-nuziveedu-court-36-214220.html
హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు సత్వర దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.
క్యారియర్ సంస్థ భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80 శాతం తిరుపతి జిల్లా శ్రీసిటీ నుంచి నుంచి సరఫరా చేయనుంది.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి రామానాయుడు మంగళవారం రాత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.