బడ్జెట్‌- బాదుడు లేదన్న మాటే కానీ...

Publish Date:Mar 1, 2016

Advertisement

 

ఆదాయపన్ను పరిమితులలో ఎలాంటి మార్పులూ లేవు! పైగా ఇంటి నిర్మాణం మీద తీసుకునే రుణాలకీ, అద్దె చెల్లింపులకీ కాస్తో కూస్తో మినహాయింపులు. కొత్తగా ప్రత్యక్ష పన్నులు ఏవీ లేవు. పైగా వస్తువుల ఖర్చును తగ్గించే విధంగా కార్పొరేట్‌ పన్నుని తగ్గించారు. చూడ్డానికి అంతా బాగానే ఉంది. కానీ ఎలాంటి ప్రత్యక్ష పన్నూ విధించకుండానే సెస్సు పేరుతో వీరబాదుడు బాదేశారు ఆర్థికమంత్రి. వ్యవసాయం, మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడులు, స్వచ్ఛమైన పర్యావరణం, స్వచ్ఛభారత్‌.... ఇలా రకరకాల పేర్లతో అయిదు సెస్సులను విధించారు ఆర్థికమంత్రి. వీటి ద్వారా ఒక్క ఏడాదిలోనే 50,000 కోట్ల రూపాయలకు పైగా పిండుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

 

ఒకపక్క వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నట్లు కనిపిస్తూనే ‘కృషి కల్యాణ్‌ సెస్‌’ పేరుతో సంబంధిత నిధులను మధ్యతరగతి భారతం నుంచి వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పన్నుల పరిధిలోకి వచ్చే అన్ని సేవల మీదా ఈ సెస్‌ను 0.5 శాతం మేర విధించనున్నారు. రెస్టారెంటులు, విమానప్రయాణాలు, మొబైల్‌ సేవలు.... ఇలా మధ్య, ఎగువ మధ్య తరగతి ప్రజల జీవితంలో భాగమైన సేవలు ఇక మీదట మరింత భారం కానున్నాయి. ఇక పర్యావరణ సెస్‌ కూడా పరోక్షంగా సాధారణ ప్రజల జేబుకి చిల్లు పెట్టే అవకాశం కనిపిస్తున్నాయి. స్వచ్ఛమైన పర్యావరణ పేరుతో బొగ్గు ఉత్పత్తి మీద టన్నుకు 200 రూపాయల వరకూ సెస్సుని మోగించారు.

 

దీంతో విద్యుత్‌ ఉత్పత్తి మరింత ప్రియం కానుంది. ఈ భారం ఎవరిమీద పడుతుందో చెప్పనవసరం లేదు కదా. ఇక మౌలిక రంగానికి అవసరమయ్యే పెట్టుబడుల కోసం అంటూ కార్ల మీద ఇన్‌ఫ్రా సెస్‌ను విధించారు. దీని వలన కార్ల ధరలు 0.25% నుంచి 4% వరకూ అమాంతం పెరిగిపోనున్నాయి. ఇంట్లో వివాహంలాంటి శుభకార్యాలను తలపెట్టినప్పుడు నగలు, బ్రాండెడ్‌ దుస్తులను ఖరీదు చేయక తప్పని పరిస్థితి. ఇప్పడు ఈ రెండింటి మీద కూడా కస్టమ్స్‌ సుంకాన్ని పెంచారు. ఇంత చూసిన తరువాత బడ్జెట్లో బాదుడు లేదని ఎలా అనుకోగలం!

By
en-us Political News

  
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.