Publish Date:Mar 13, 2026
మిడిల్ఈస్ట్ లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు తమతమ భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసే దిశగా కొత్త కొత్త వ్యూహాలను రూపొందిస్తున్నాయి. అమలు చేస్తున్నాయి. ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్ దాడుల ముప్పును ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ అభివృద్ధి చేసిన బుల్లెట్ డ్రోన్లు లేదా ఇంటర్‌సెప్టర్ డ్రోన్లపై దృష్టి సారించాయి.
ఇటీవలి కాలంలో డ్రోన్ యుద్ధం ప్రపంచ భద్రతా వ్యవస్థల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ తక్కువ ఖర్చుతో అదే సమయంలో అత్యంత వేగంగా స్పందించే డ్రోన్ వ్యవస్థలను అభివృద్ధి చేసి విస్తృతంగా వినియోగించింది. శత్రు డ్రోన్లను గాల్లోనే గుర్తించి అడ్డుకునే ఈ ఇంటర్‌సెప్టర్ డ్రోన్లు యుద్ధభూమిలో సమర్థవంతంగా పని చేశాయి కూడా.
ఇప్పుడు గల్ఫ్ దేశాలు తమ రక్షణ వ్యవస్థల్లో వీటిని ఉపయోగించేందుకు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్ దాడులను ముందుగానే గుర్తించి, గాల్లోనే వాటిని నిర్వీర్యం చేసే టెక్నాలజీపై దృష్టి పెట్టాయి. ఈ బుల్లెట్ డ్రోన్లు శత్రు డ్రోన్లను లక్ష్యంగా చేసుకుని వేగంగా దూసుకెళ్లి వాటిని ధ్వంసం చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న కొన్ని మిలిటెంట్ గ్రూపులు కూడా డ్రోన్లతో ముందుకు వచ్చే అవకాశాలున్నాయని గల్ఫ్ దేశాలు అంచనా వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఆధునిక డ్రోన్ నిరోధక వ్యవస్థలవైపు దృష్టి సారించాయి. డ్రోన్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సంప్రదాయ రక్షణ వ్యవస్థలతో పాటు ఇలాంటి ఇంటర్‌సెప్టర్ డ్రోన్లు భవిష్యత్ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాల భద్రతలో ఈ సాంకేతికత కీలకంగా మారే అవకాశం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ukraine-bullets-deter-irans-attacks-36-215417.html
బండి భగీరథ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. జ్యోతినగర్‌కు చెందిన ఒక యువతితో అతనికి స్నేహం ఏర్పడింది. కొంతకాలానికి ఆ యువతి అతనిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయితే.. భగీరథ్ పెళ్లికి నిరాకరించడంతో పరిస్థితి మలుపు తిరిగింది. ఆ యువతి, ఆమె తల్లిదండ్రులు కలిసి అతనిపై క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారు.
పసిఫిక్ మహాసముద్రంలోని తూర్పు, మధ్య ప్రాంత ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయనీ, దీనివల్ల దేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గి.. కరువు పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉందని తెలిపింది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందనీ, అందువల్ల సాగునీటి కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
మన దేశానికి చెందిన ఆరు విభిన్నమైన వంటకాలు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించుకోవడం గమనార్హం. కేవలం రుచితోనే కాకుండా, భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పే ఈ వంటకాలు ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపును దక్కించుకున్నాయి.
గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు. అలాగే గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.
సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన యూనిట్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు.
ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి సుమారు రూ.కోట్లు తీసుకున్నారంటూ.. బాధితుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ కేసు సినీ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది.
హైకోర్టులో ఒక పిటిషన్ విచారణ సందర్భంగా జూనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఆ సమయంలో జడ్జి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కొంత అసహనానికి గురయ్యారు. ఆ క్రమంలో న్యాయవాది తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిస్తూ.. అక్కడే ఉన్న పోలీసులను పిలిచి ఆ జూనియర్ అడ్వకేట్ ను 24 గంటల పాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించారు.