Publish Date:Mar 13, 2026
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం మొత్తం ప్రపంచంపై పడుతోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు మార్కెట్‌పై తీవ్రాతితీవ్రమైన ప్రభావం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా చమురు ధరలు అంతర్జాతీయ విఫణిలో భగ్గుమంటున్నాయి. ఇరాన్ చర్యల కారణంగా ప్రపంచానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గం అయిన హోర్ముజ్ జలసంధి వద్ద రవాణాకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ధరలు పెరగడం మాత్రమే కాకుండా అసలు సరఫరాయే నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది.
హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్న సంగతి తెలిసిందే. గల్ఫ్ ప్రాంతంలోని సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి దేశాల నుంచి ప్రపంచ మార్కెట్లకు వెళ్లే చమురు, సహజవాయువు ప్రధానంగా ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ప్రపంచంలో వినియోగించే మొత్తం చమురులో దాదాపు 20శాతం సరఫరా ఈ మార్గం ద్వారా జరుగుతుంది.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మార్గం దాదాపు మూసుకుపోయింది. ఇరాన్ తమ దేశంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ప్రకటించిన యుద్ధానికి ప్రతీకారంగా
హోర్ముజ్ జలసంధి మార్గంలో తన నావికాదళ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయిల్ ట్యాంకర్లు ఈ మార్గంలో ప్రయాణించేందుకు అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో షిప్పింగ్ కంపెనీలు తమ నౌకలను తాత్కాలికంగా నిలిపివేశాయి.
ఈ కారణంగా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశానికి అంటాయి. ఈ సరఫరా అంతరాయం ఇలాగే కొనసాగితే చమురు ధరలు మరింత పెరగడం అనివార్యం. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం.
హోర్ముజ్ జలసంధి వద్ద భద్రతను బలోపేతం చేయడానికి అమెరికా, యూరోపియన్ దేశాలు చర్యలు చేపడుతున్నాయి. సముద్ర మార్గం సురక్షితంగా ఉండేలా అంతర్జాతీయ స్థాయిలో చర్చలు సైతం సాగుతున్నాయి. అలాగే చమురు సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు గల్ఫ్ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా దృష్టి సారిస్తున్నాయి. అయినప్పటికీ హోర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు కుదుటపడకపోతే మాత్రం పరిస్థితి అత్యంత భయానకంగా, దయనీయంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు సరఫరాలో అంతరాయం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలనూ ఆర్థిక సంక్షోభంలో కూరుకునేలా చేయడం తథ్యమని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/iran-strike-causes-oil-shortage-36-215418.html
గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు. అలాగే గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.
సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన యూనిట్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు.
ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి సుమారు రూ.కోట్లు తీసుకున్నారంటూ.. బాధితుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ కేసు సినీ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది.
హైకోర్టులో ఒక పిటిషన్ విచారణ సందర్భంగా జూనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఆ సమయంలో జడ్జి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కొంత అసహనానికి గురయ్యారు. ఆ క్రమంలో న్యాయవాది తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిస్తూ.. అక్కడే ఉన్న పోలీసులను పిలిచి ఆ జూనియర్ అడ్వకేట్ ను 24 గంటల పాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించారు.
ఏపీలో పెట్టుబడుల వాతావరణం పండుగలా సాగుతోందన్న ఆయన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తమ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, తద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను లభించే అవకాశాలు దండిగా ఉంటాయన్నారు.
తనపై నమోదైన మోసం కేసులో దర్యాప్తును నిలిపివేయాలని, స్టే మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికీ, కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించడానికీ తిరస్కరించింది.
అమెరికాకు చెందిన యుఎస్ఎస్ బాక్సర్ అనే యుద్ధనౌక హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుండగా.. ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్ ప్రమాదకర రీతిలో నౌకకు అత్యంత సమీపంలోకి వచ్చింది. సుమారు వెయ్యి గజాల దూరంలోకి వచ్చిన ఆ డ్రోన్.. నౌకలోని సిబ్బందికి, నౌక భద్రతకు ముప్పుగా మారుతుందని గుర్తించిన అమెరికా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.