ఉత్సాహం నింపే ఉగాది

Publish Date:Mar 20, 2015

Advertisement



ముందుగా అందరికీ శ్రీ మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ మన్మథ నామ సంవత్సరానికి సంవత్సరానికి స్వాగతం పలికే ఈ రోజున అందరి జీవితాలలో సుఖ సంతోషాలు నిండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

‘కొత్త’ ఎప్పుడూ ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అందుకే అనంతమైన కాలానికి అక్కడక్కడ ఇలా కొత్తదనాన్ని ఆపాదిస్తూ మనల్ని మనం ఉత్సాహపరచుకుంటూ వుంటాం. నిన్నటిదాకా లేనిదేదో ఈరోజు సరికొత్తగా రూపుదిద్దుకుంటోందని భావిస్తాం. ఈ ఉత్సాహం, ఈ ఆశే ఈరోజంతా పండుగ వాతావరణం నెలకొనటానికి కారణం. ఈ చిన్న విషయాన్ని గ్రహించగలిగితే ప్రతిరోజునూ పండుగలా వేడుకగా మార్చుకోగలం. ఉగాది పండుగను మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా అనేక ప్రాంతాల్లో చేసుకుంటారు. ఆ వివరాలు...

ఉగాదిని మహారాష్ట్రలో గుడిపడ్వాగా, సింధీలు చేతిచంద్‌గా, పంజాబీలు బైశాఖీగా, తమిళనాడులో పుతండుగా, మణిపురిలో సాజి బుచె రోబా (saji bchei rao ba)గా, కర్ణాటకలో యుగాదిగా పిలిచే ఈ రోజు మనందరితోపాటు వీరందరికీ కొత్త సంవత్సర ఆరంభమే. వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలువబడుతూ, వివిధ ఆచారాలు పాటించినా అందరూ కోరుకునేది ఒక్కటే... ‘కాలం’ కరుణ చూపించాలని. జీవితాలలో ఆనందాన్ని నింపాలని.

ఉగాది ఓ కొత్త ఆశకి చిగురు తొడిగే రోజని మనమందరం భావిస్తాం. అయితే ఇక్కడే ఓ చిన్న విషయాన్ని గ్రహించాలంటారు మన పెద్దలు. మనం నాటే ఓ విత్తనం మొలకెత్తి, చిగురించి మొక్కగా మారడానికి కొంత సమయం పడుతుందని మనందరికీ తెలిసిందే. అలాగే మన ఆశల విత్తనాలు చిగురించి ఓ వృక్షంగా మారి మధుర ఫలాల్ని అందించడానికి కూడా కొంచెం సమయం పడుతుంది. మన ఆశల విత్తు మొలకెత్తేందుకు దృఢ సంకల్పమనే నీరు చాలు. అది వటవృక్షమై మన లక్ష్యాల ఫలాలని మనకందించడానికి. అందుకే ఈ ఉగాది రోజున మన మనసులలో ఓ చిన్న విత్తుని నాటుదాం. దాని ఫలాల కోసం వచ్చే ఉగాది వరకూ ఎదురుచూద్దాం.

నాకు బాగా గుర్తు... మా తాతగారు ఉగాది రోజున ఉగాది పచ్చడి పెట్టి, అక్షింతలు వేసి ఆశీర్వదించాక ఇంట్లో అందర్నీ ఒకచోట కూర్చోబెట్టి ఒక్కొక్కరిని ఇలా అడిగేవారు. ‘‘ఈ సంవత్సరమంతా ఎలా గడవాలని కోరుకుంటున్నావ్?’’ అని. ఎవరికి వాళ్ళం మా మా ఆశలు, కలల గురించి చెప్పేవాళ్ళం. అంతా విన్నాక ఒక్కసారి కళ్ళు మూసుకుని మీరు కోరుకున్నవన్నీ జరుగుతున్నట్టు ఊహించుకోండి. ఆ సమయంలో మీ మనసులో నిండే ఆనందాన్ని ఇప్పుడే పొందండి అనేవారు. మేం అలాగే చేసేవాళ్ళం. ఆశ్చర్యంగా మా ఆశలు, కోరికలు తీరతాయనే గట్టి నమ్మకం ఏర్పడేది. దీన్నే క్రియేటివ్ విజువలైజేషన్ అంటారని ఆ తర్వాత తెలిసింది నాకు. ఇప్పటికీ మేం అందరం ఈ సంవత్సరం మా జీవితాలలో ఏయే మార్పులు తెస్తోంది అన్నది కళ్ళముందు నింపుకుంటాం. ఆ ఉత్సాహాన్ని గుండెల్లో నింపుకుని రేపటి కోసం ఎదురుచూస్తాం.

ఈ శ్రీ మన్మథ నామ సంవత్సరాది రోజున మనందరం ఈ సంవత్సరమంతా మనం కోరుకునేవన్నీ మనకి దక్కాలని ఆశపడతాం. అయితే అవన్నీ మనకి దక్కుతాయో లేదోనని ఓ చిన్న భయం కూడా మనల్ని వెంటాడుతుంది. ఆ భయాన్ని వదిలేసి మనం కోరుకున్నది మనకి దక్కినట్టు అప్పటి ఆ ఆనందం రుచిని ఇప్పుడే పొందగలిగితే అది మనలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ ఉగాదికి మనకి మనం ఇచ్చుకోవలసిన కానుక అదే.

సరే మరి.. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, కొత్త బట్టలు, కొత్త ఆశలు, మావి చిగురులు... ఇవన్నీ మనలో నింపే ఉత్సాహం ఈ సంవత్సమంతా మన వెన్నంటి వుండాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి శ్రీ మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

-రమ ఇరగవరపు

 

By
en-us Political News

  
శీతాకాలంలో జిమ్‌కు వెళ్లకుండానే బరువు తగ్గాలనుకుంటున్నారా? చలికాలంలో హైడ్రేషన్, ఆరోగ్యకరమైన పానీయాలు, డైట్ చిట్కాలతో ఫిట్‌గా ఉండే అద్భుతమైన మార్గాలను ఇక్కడ తెలుసుకోండి.
కాంతివంతమైన, మచ్చలేని మరియు సహజమైన చర్మం కోసం పచ్చి పాలను ఏ విధంగా ఉపయోగించాలో ఈ వెబ్ స్టోరీ ద్వారా తెలుసుకోండి. ఇంట్లోనే సులభంగా చర్మాన్ని మెరిపించే చిట్కాలు.
వైరల్ ఫీవర్ మరియు కోవిడ్ 19 తర్వాత గుండె ఆరోగ్యంపై పడే ప్రభావం గురించి తెలుసుకోండి. మయోకార్డిటిస్, పెరికార్డిటిస్ సమస్యలను సూచించే 5 ముఖ్యమైన హెచ్చరిక లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి వివరాలు.
ఉల్లి, వెల్లుల్లి లేకుండా అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో ఎంతో రుచికరంగా తయారయ్యే సాంప్రదాయ ఆంధ్ర స్టైల్ అల్లం వంకాయ కూర తయారీ విధానం మరియు పూర్తి పదార్థాల కొలతలతో స్టెప్ బై స్టెప్ గైడ్.
పసుపులోని కర్కుమిన్ గుణాలు మొటిమలను తగ్గించి, చర్మానికి సహజ కాంతిని ఎలా ఇస్తాయో తెలుసుకోండి. జీవక్రియలను మెరుగుపరిచే ఉత్తమ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
ఆముదం ఆకులతో మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, గౌట్ సమస్య మరియు గాయాలను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి. పూర్వకాలం నాటి ఈ అద్భుతమైన ఆయుర్వేద సహజ చిట్కాల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ముఖంపై రోజ్ వాటర్ వాడటం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు, చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి రోజ్ వాటర్ ఎలా ఉపయోగపతుందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.
బెండకాయలు తింటే పిల్లలకు లెక్కలు బాగా వస్తాయనే నమ్మకంలో ఎంత నిజం ఉంది? సైన్స్ మరియు నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారు? బెండకాయ వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
జీవితంలో మనం ఎంచుకునే మార్గం, ఎదుర్కొనే సవాళ్లు మన భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి. ప్రతి రోజూ ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం.
జీవితంలో ఒక్కసారిగా చేతికి డబ్బు రాగానే మనుషుల ప్రవర్తన మారిపోతుంటుంది. రాత్రికి రాత్రే సంపాదించడం మొదలుపెట్టిన చాలామంది కొన్నేళ్లలోనే మళ్లీ మొదటికి వస్తుంటారు.
చైనాలో బరువు తగ్గడం కోసం తొలిసారిగా ఓరల్ జీఎల్పీ 1 మాత్ర ఓర్ఫోగ్లిప్రాన్ ఆమోదం పొందింది. ఎలి లిల్లీ సంస్థకు దక్కిన ఈ చారిత్రాత్మక మైలురాయి, క్లినికల్ ట్రయల్స్ విశేషాలు మరియు భవిష్యత్తు అంచనాల పూర్తి సమాచారం.
వ్యాయామం లేదా శారీరక శ్రమ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఎందుకు పెరుగుతాయి? కాలేయం పాత్ర, హార్మోన్ల ప్రభావం మరియు మధుమేహం ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి సమాచారం.
చలికాలంలో పచ్చి బఠానీలు తినడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు, ప్రోటీన్, ఫైబర్ లాభాలు మరియు రోగనిరోధక శక్తిని పెంచే రహస్యాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.