మర్రితాండాలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు

Publish Date:May 16, 2026

Advertisement

వరంగల్ జిల్లా  మర్రితండాలో శుక్రవారం (మే 15) రాత్రి జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఒకే గ్రామానికి చెందిన ఇరువర్గాల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న భూ వివాదాలు  ప్రబలి పరస్పర దాడులకు కారణమయ్యాయి.  ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు  దాడులు చేసుకునే స్థాయికి చేరింది.  

గ్రామానికి చెందిన రమావత్ గ్యాస్య, రమావత్ రేఖ్య అనే ఇద్దరి  మధ్య గత కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది.  ఈ భూమిపై హక్కుల విషయంలో ఇరువర్గాలు పట్టుదలకు పోవడంతో గ్రామంలో   చిన్నపాటి ఘర్షణలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే శుక్రవారం (మే 15) రాత్రి ఇరువర్గాల మధ్యా మాటా మాటా పెరిగి, ఘర్షణకు దారి తీసింది.  ఇరువర్గాలు కర్రలు, కత్తులతో పరస్పరం దాడులకు దిగారు.  ఈ ఘర్షణలో ఇరువర్గాలకూ చెందిన పలువురు తీవ్రంగా గాయడ్డారు.  

సమాచారం అందుకున్న  రాయపర్తి పోలీసులు   ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపు చేశారు.   క్షతగాత్రులను  సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో  పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా  గ్రామంలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున  మోహరించారు.  ప్రస్తుతం మర్రితండాలో  పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ ఉద్రిక్త వాతావరణం నెలకొని.  

By
en-us Political News

  
హైదరాబాద్‌లో ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనుల దృష్ట్యా ఉప్పల్ రింగ్ రోడ్ చౌరస్తాను 3 నెలల పాటు తాత్కాలికంగా మూసివేశారు
తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథకు మేడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్య పరీక్షలు పూర్తి చేశారు.
బండి సంజయ్ తన కుటుంబంపై వచ్చిన వివాదాల మధ్య సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలోని జవహర్‌నగర్‌లో ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు.
తన కుమారుడు బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై గౌరవంతో పోలీసుల విచారణకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
దేశ ప్రగతిలో పిల్లలే అసలైన సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
పోక్సో కేసులో నిందితుడైన బండి సాయి భగీరథ్ పరారీపై బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ యూజీ క్వశ్చన్ పేపర్ లీకేజీ మరియు పరీక్ష రద్దు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సిఫార్సు మేరకు మంత్రులకు శాఖలను కేటాయిస్తూ లోక్ భవన్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
హెల్మెట్ ధరించి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌పై కూర్చున్న సీఎం చంద్రబాబు
దక్షిణాది రాజకీయాల్లో మరియు సినీ రంగంలో ఎప్పుడు ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో ఊహించడం కష్టం.
జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.