చట్టంపై గౌరవంతో భగీరథ్‌ను పోలీసులకు అప్పగించా : బండి సంజయ్

Publish Date:May 16, 2026

Advertisement

 

తన కుమారుడు బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై గౌరవంతో పోలీసుల విచారణకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, “చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే” అని స్పష్టం చేశారు.భగీరథ్ ఎలాంటి తప్పు చేయలేదని తన కుమారుడు పదేపదే చెబుతున్నాడని పేర్కొన్న బండి సంజయ్, ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని భావించినట్లు తెలిపారు. 

అయితే ముందుగా న్యాయవాదులను సంప్రదించి తమ వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచినట్లు చెప్పారు. ఆ ఆధారాలను పరిశీలించిన న్యాయవాదులు కేసు కొట్టివేయబడే అవకాశముందని, బెయిల్ కూడా తప్పకుండా వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. 

ఆ కారణంగానే కొంత జాప్యం జరిగిందని పేర్కొన్నారు.ఇప్పటికీ బెయిల్ వచ్చే అవకాశముందని న్యాయవాదులు చెబుతున్నప్పటికీ, ఇక ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో భగీరథ్‌ను స్వయంగా తీసుకువచ్చి అడ్వోకేట్ల సమక్షంలో పోలీసులకు విచారణ కోసం అప్పగించినట్లు తెలిపారు. న్యాయ వ్యవస్థపై సంపూర్ణ నమ్మకం ఉందని బండి సంజయ్ అన్నారు. సోమవారం కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ, న్యాయ వ్యవస్థపై గౌరవంతో విచారణకు సహకరించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

 భగీరథ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు బండి భగీరథ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయినట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి వెల్లడించారు.పోలీసుల ప్రకారం, బండి భగీరథను నార్సింగి పోలీస్ అకాడమీ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం అతడిని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు కమిషనర్ తెలిపారు.

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలోని జవహర్‌నగర్‌లో ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు.
దేశ ప్రగతిలో పిల్లలే అసలైన సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
పోక్సో కేసులో నిందితుడైన బండి సాయి భగీరథ్ పరారీపై బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ యూజీ క్వశ్చన్ పేపర్ లీకేజీ మరియు పరీక్ష రద్దు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సిఫార్సు మేరకు మంత్రులకు శాఖలను కేటాయిస్తూ లోక్ భవన్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
హెల్మెట్ ధరించి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌పై కూర్చున్న సీఎం చంద్రబాబు
దక్షిణాది రాజకీయాల్లో మరియు సినీ రంగంలో ఎప్పుడు ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో ఊహించడం కష్టం.
జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి.
ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్ మరియు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.
సమాజం తలదించుకునే అత్యంత హేయమైన, అమానవీయ ఘటన గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో వెలుగుచూసింది.
మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అత్యంత కలకలం రేపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
హర్యానా ల్యాండ్ డీల్ వివాదంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఊరట లభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.