బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
Publish Date:May 17, 2026
Advertisement
తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథకు మేడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. వైద్యులు సమగ్రంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించారు. అనంతరం బండి భగీరథ ఫిట్‌గా ఉన్నట్లు పేర్కొంటూ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను పోలీసులకు అధికారికంగా అందజేశారు. వైద్య పరీక్షలు పూర్తయ్యిన వెంటనే పోలీసులు బండి భగీరథను మెజిస్ట్రేట్ నివాసానికి తీసుకెళ్లారు. కేసుకు సంబంధించిన వివరాలను, అరెస్ట్ ప్రక్రియను, వైద్య నివేదికలను మెజిస్ట్రేట్ ముందు సమర్పించారు. అనంతరం పోలీసులు బండి భగీరథను మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. పోలీసుల వాదనలు, కేసు ప్రాథమిక వివరాలు పరిశీలించిన మెజిస్ట్రేట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగించేందుకు సమయం అవసరమని భావించిన కోర్టు, బండి భగీరథకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.ఈ నెల 29వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ అమల్లో ఉండనుంది. కోర్టు ఆదేశాల ప్రకారం బండి భగీరథను పోలీసులు కఠిన భద్రత మధ్య చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ పరిణామాలతో కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానున్నట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తు తదుపరి దశలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
http://www.teluguone.com/news/content/court-remands-bandi-bhagirath-for-14-days-36-220042.html





