ట్రంప్ విధానాలు.. ప్రవాస భారతీయులలో ఆందోళన

Publish Date:Apr 24, 2026

Advertisement

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రవేశపెడుతున్న కఠినమైన వలస విధానాలు అక్కడి భారతీయ సమాజంలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా  అమెరికా అమెరికన్లకే  అనే నినాదం  ఇప్పుడు అధికారిక విధానంగా మారుతుండటంతో, దశాబ్దాలుగా అక్కడ స్థిరపడిన వారు సైతం తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ మూలాలున్న లక్షలాది మంది వలసదారుల జీవితాలు ఇప్పుడు డోలాయమానంలో పడ్డాయి.

తాజాగా వెలువడిన కార్నెగీ ఎండౌమెంట్ సర్వే నివేదికలు విస్తుపోయే నిజాలను వెల్లడించాయి. అమెరికాలో నివసిస్తున్న భారతీయ సంతతి ప్రజలలో సుమారు 40 శాతం మంది ఆ దేశాన్ని శాశ్వతంగా వీడి వెళ్లాలని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఇది కేవలం ఒక సర్వే ఫలితం మాత్రమే కాకుండా.. అమెరికాలో మారుతున్న రాజకీయ సామాజిక వాతావరణానికి దర్పణం పట్టేదిగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రవాస భారతీయులలో ఈ స్థాయిలో నిరాశ పెరగడం గమనార్హం.

ఈ  ఆలోచనకు ప్రధాన కారణం అక్కడి రాజకీయ అస్థిరత అని విశ్లేషకులు చెబుతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 58 శాతం మంది ప్రస్తుత రాజకీయ పరిణామాలే తమ అసంతృప్తికి కారణమని స్పష్టం చేశారు. ట్రంప్ పాలనలో వినిపిస్తున్న వలస వ్యతిరేక వ్యాఖ్యలు, జాతి, మతపరమైన విభజనలు పెరగడం వల్ల అమెరికా ఇకపై ఎంత మాత్రం సురక్షితం కాదనే భావన బలపడుతోంది. దాదాపు 71 శాతం మంది భారతీయ అమెరికన్లు ట్రంప్ రెండో పర్యాయం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ముఖ్యంగా చట్టబద్ధంగా అమెరికాకు వచ్చే వారిపై  ఆంక్షలు పెరగడం పెద్ద చర్చకు దారితీస్తోంది. కాటో ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం, అక్రమ వలసల కంటే చట్టబద్ధంగా వచ్చే వారి సంఖ్యలోనే భారీగా పతనం నమోదైంది. నిబంధనల ప్రకారం వచ్చే వృత్తి నిపుణులకు కూడా అడ్డంకులు సృష్టించడం వల్ల, అమెరికా తన తలుపులు మూసేస్తోందనే సంకేతాలు అందుతున్నాయి. ఇది నేరుగా భారతీయ ఐటీ రంగ నిపుణులపై ప్రభావం చూపుతోంది.

టెక్ రంగానికి ప్రాణాధారమైన హెచ్-1బీ  వీసాల విషయంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత ఏడాదిలో వీసాల జారీ 25 శాతం తగ్గడమే కాకుండా..  పిటిషన్లపై లక్ష డాలర్ల భారీ ఫీజు విధించడం వల్ల కంపెనీల దరఖాస్తులు ఏకంగా 87 శాతం పడిపోయాయి. దీనివల్ల ప్రతిభామంతులైన భారతీయ యువతకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు దక్కడం గగనంగా మారుతోంది. కేవలం ఉద్యోగులే కాకుండా, ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థుల వీసాల జారీలో కూడా 40 శాతం తగ్గుదల కనిపించింది. సోషల్ మీడియా వెట్టింగ్, కఠినమైన భద్రతా తనిఖీలే ఇందుకు కారణమని తెలుస్తోంది.

అమెరికా జనాభాలో కేవలం 1.5 శాతమే ఉన్నప్పటికీ, 5.4 మిలియన్ల భారతీయ సంతతి ప్రజలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. టెక్నాలజీ, మెడిసిన్, ఫైనాన్స్ వంటి రంగాల్లో భారతీయుల కృషి వెలకట్టలేనిది. అయితే ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న గౌరవం, భద్రత,  స్థిరత్వం వంసమస్యలు అమెరికా అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకప్పుడు  అవకాశాల గనిగా వెలిగిన అమెరికా..  ఇప్పుడు వలసదారుల దృష్టిలో ఒక సందేహాస్పద ప్రాంతంగా మారుతోంది.

ప్రస్తుత తరుణంలో ప్రతీ భారతీయ కుటుంబంలోనూ  అమెరికాలో ఉండాలా లేక తిరిగి రావాలా?  అనే చర్చ మొదలైంది. ట్రంప్ అనుసరిస్తున్న సంరక్షణాత్మక విధానాలు అమెరికా జాతీయ భద్రతకు అవసరమని కొందరు వాదిస్తున్నప్పటికీ,  గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షించే సామర్థ్యాన్ని అమెరికా కోల్పోతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.  

-సీతారాం కంఠంనేని

By
en-us Political News

  
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.