సికిందరాబాద్ విధ్వంసం స్క్రీన్ ప్లే డైరెక్షన్ పీకే.. యాక్షన్ టీఆర్ఎస్!

Publish Date:Jun 18, 2022

Advertisement

రాష్ట్రంలో వేగంగా పడిపోతున్న పలుకుబడిని, తగ్గుతున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ లో ఆందోళన మొదలైందా? తిరిగి పరపతి పెంచుకోవడానికి, బలోపేతం అవుతున్న బీజేపీ ప్రజాదరణను తగ్గించేందుకు ఎం చేయడానికైనా సిద్ధ పడ్డారా? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే సూచనలను తు.చ. తప్పకుండా అమలు చేస్తూ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు పార్టీ శ్రేణులను ప్రోత్సహిస్తున్నారా? అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానం వస్తున్నది.

సికిందరాబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం జరిగిన విధ్వంస కాండ వెనుక ఉన్నది అధికార పార్టీ టీఆర్ఎస్ అని వారు చెబుతున్నారు. ఇందుకు   కారణాలను సైతం వివరిస్తున్నారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో సికిందరాబాద్ లో ఆర్మీ రిక్రూటీ ఆశావహులు శుక్రవారం చేపట్టిన ఆందోళనను టీఆర్ఎస్ అంది వచ్చిన అవకాశంగా తీసుకుని విధ్వంసకాండకు తెగబడిందని అంటున్నారు. 

ఆర్మీ రిక్రూట్ మెంట్ లో ‘అగ్నిపథ్’ పథకాన్ని అమలు చేయాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం సికిందరాబాద్ లో జరిగిన విధ్వంస కాండ వెనుక అధికార పార్టీ టీఆర్ఎస్ హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆందోళన కారులు పరిమిత సంఖ్యలోనే సికిందరాబాద్ స్టేషన్ కు వచ్చారనీ, నినాదాలు చేసి రైళ్లను కొద్ది సేపు నిలువరించడమే లక్ష్యంగా వారు అక్కడికి వచ్చినా, టీఆర్ఎస్ శ్రేణుల వల్లే ఆ ఆందోళన హింసాత్మక రూపం దాల్చిందనీ ఆరోపణలు వినవస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మీడియా సమావేశంలో ఇవే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ‘అగ్నిపథ్’ ఆందోళనలను టీఆర్ఎస్ రాష్ట్రంలో కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందకు వినియోగించుకునే ఎత్తుగడతోనే ఈ అల్లర్లకు పాల్పడింది. ఇందుకు టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే సలహాయే కారణమని తెలుస్తోంది. 
ఆర్మీ నియామకాల్లో అగ్నిపథ్ పథకం అమలుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా, రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అవరోధం ఏర్పడేలా హింసాత్మక రూపు దాల్చాలన్నది పీకే సలహాను అనుసరించి టీఆర్ఎస్ అమలు చేసిన వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు. తొలుత ఆర్మీ రిక్రూటీ ఆశావహులు ఓ 300 మంది వరకూ సికిందరాబాద్ స్టేషన్ కు చేరుకున్నారనీ, వారి వద్ద ప్లకార్డులు వినా మరెటువంటి సామగ్రి లేదనీ చెబుతున్నారు. అయితే క్షణాల్లోనే ఆందోళన కారుల సంఖ్య వేలలోకి పెరిగిపోవడం.. ఆ వచ్చిన వారి చేతుల్లో పెట్రోల్ టిన్నులు, కర్రలు, రాడ్లు వంటి ఆయుధాలు ఉండటాన్ని ఈ సందర్భంగా వారు ఎత్తి చూపుతున్నారు.  ఇక్కడే పరిశీలకలు ఇంత జరుగుతుంటే పెట్రోల్, కర్రలు, రాడ్లు వంటి ఆయుధాలతో జనం పెద్ద సంఖ్యలో సకిందరాబాద్ స్టేషన్ కు వస్తుంటే పోలీసులు, నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు.  ఇంత జరిగినా, రైల్వే ఆస్తుల విధ్వంసం జరిగినా హైదరాబాద్ లో శాంతి భద్రతల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా.. సీఎం కేసీఆర్ కానీ, మంత్రులు కానీ వీటిని సీరియస్ గా తీసుకోవడం లేదు. కేవలం బీజేపీపైనా, మోడీ ప్రభుత్వంపైనా విమర్శలకే పరిమితమయ్యారు. పైగా ఈ విధ్వంస కాండను సమర్ధించే విధంగా దేశంలో యువత ఆగ్రహానికి ఈ విధ్వంస కాండ ప్రతీక అంటూ అభివర్ణిస్తున్నారు. వీటన్నిటినీ గమనిస్తే పరిశీలకులు చెబుతున్నట్లుగా ఈ అల్లర్ల వెనుక, హింసాకాండ వెనుక టీఆర్ఎస్ ఉన్నదా అన్న అనుమానాలు  సామాన్యులలో కూడా కలుగుతున్నాయి.  అందుకే ఈ సంఘటన అనంతరం  రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందనీ, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ బాధ్యతను విస్మరించి రాజకీయ విమర్శలతో పబ్బం గడుపుకుంటోదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా సికిందరాబాద్ హింసాకాండ వెనుక అధికార పార్టీ హస్తం ఉందన్న నివేదిక కేంద్రానికి అందిందనీ, ఈ విషయాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుందనీ చెబుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయంపై స్వయంగా ఆరా తీస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. 
 

By
en-us Political News

  
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.