LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  అమరావతి చేరుకున్నారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం (మే 13) ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.  బుధవారం (మే13) ఉదయం  హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పవన్ కు జనసేన నాయకులు, పార్టీ కార్యకర్తలు  ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా పవన్ కల్యాణ్ అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఉపముఖ్యమంత్రిగా తన పనులు మొదలెట్టేశారు.  కాగా శస్త్ర చికిత్స అనంతరం పూర్తిగా కోలుకుని అమరావతి చేరుకున్న పవన్ కల్యాణ్ కు పార్టీ నేతలు, కూటమి పార్టీల నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు. 
 తమిళనాడు  అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వం బలపరీక్షలో గెలిచింది. బుధవారం బుధవారం  అసెంబ్లీలో జరిగిన  విశ్వాస పరీక్షలో  ద‌ళపతి విజయ్ నేతృత్వంలోని  టీవీకే ప్రభుత్వం సునాయాసంగా గట్టెక్కింది. ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.  ఇటీవలి ఎన్నికల్లో   విజయం సాధించి అధికార పీఠం దక్కించుకున్న విజయ్.. ఈ విశ్వాస పరీక్షలో గెలిచి  నిలబె ట్టుకున్నారు. అయితే, ఈ ఓటింగ్‌కు ముందు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే తన 59 మంది ఎమ్మెల్యేలతో సభ నుంచి వాకౌట్ చేసింది. ఇక..  మూడో అతిపెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే  ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించినప్పటికీ,   ఆ పార్టీకి చెందిన పాతిక మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో  దీంతో  తమిళ  రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన అన్నాడీఎంకే పార్టీ నిట్ట నిలువుగా చీలిపోయినట్లైంది. అన్నా డీఎంకేలో  పళనిస్వామి వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ తిరుగుబాటుతో పళనిస్వామికి రాజకీయంగా గట్టి రాజకీయ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇక పోతే విశ్వాస పరీక్ష తరువాత మీడియాతో మాట్లాడిన సీఎం విజయ్... విజిల్ చరిత్రను మార్చిందన్నారు.  తమది మైనారిటీ ప్రభుత్వం అని చెబుతూనే..   మైనార్టీల హక్కులను కాపాడే ప్రభుత్వమన్నారు.   
ఏళ్ల తరబడి  అమరావతి ఒక క్రియాశీలక రాజధాని ప్రాజెక్టుగా కంటే  ఎక్కువగా  రాజకీయ చర్చగానే మిగిలిపోయింది.  అమరావతి చుట్టూ జరిగిన   ప్రతి చర్చ చివరికి విధానం, ప్రాంతం, రాజకీయాలు లేదా కోర్టు పోరాటాలుగానే సాగింది. ఈ నేపథ్యంలోనే 2019 - 2024 మధ్య కాలంలో  క్షేత్రస్థాయిలో నిర్మాణాల వేగం మందగించింది. అమరావతి పురోగతిపై అనిశ్చిత పెరిగింది.   అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి. అయితే ఆ అనిశ్చితిని, అనుమానాలనూ పటాపంచలు చేస్తూ.. 12 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస టవర్ల నిర్మాణం పూర్తి చేసింది తెలుగుదేశం కూటమి సర్కార్. ఇదే ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ టవర్లు ఆధునిక సౌకర్యాలతో పూర్తిగా సిద్ధమయ్యాయనీ, త్వరలో జీఏడీకి అప్పగిస్తామనీ  మంత్రి  ప్రకటించారు.   మాములుగా చూస్తే.. ఇవి సాధారణ మౌలిక సదుపాయాల నవీకరణలుగా కనిపిస్తాయి కానీ,  రాజకీయంగా  ప్రభుత్వం వేసిన అడుగు..  అమరావతిపై అనిశ్చితిని పటాపంచలు చేసింది. నిర్దిష్ట కాల వ్యవధిలో అమరావతి నిర్మాణం పూర్తి అవుతుందన్న విశ్వాసాన్ని ప్రజలకు ఇచ్చింది.  కంటికి కనిపించే నిర్మాణాలు, పనిచేసే కార్యాలయాలు ఇక ఎక్కువ జాప్యం లేకుండానే అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు భరోసా ఇచ్చాయి.  
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.  బండి కుమారుడిపై పోక్సో కేసు నమోదైందని తెలియగానే.. బీజేపీ ఆయనను పక్కన పెట్టేసింది. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పటికీ  ప్రధాని ఇటీవలి హైదరాబాద్ పర్యటనలో ఆయన పేరును కనీసం ఆహ్వాన పత్రికలో కూడా ముద్రించలేదు. బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది.  ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది. ఎలాంటి జాప్యం లేకుండా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. బీఆర్ఎస్ కూడా బండి సంజయ్ విషయంలో పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని డిమాండ్ చేసింది.  బండి సైంజయ్ కుమారుడికి ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతుగా నిలవడానికి సిద్ధంగా లేదు. అయితే వైసీపీ మాత్రం అందుకు మినహాయింపుగా కనిపిస్తోంది.  తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ బండి బగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.   భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం (మే14)   వెకేషన్ బెంచ్ లో విచారణ జరగనుంది. ఈ కేసులో బండి బగీరథ్ తరఫున  వైసీపీ ఎంపీ, సీనియిర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించనున్నారు. 
తమిళ సినీ రంగంలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందిన దళపతి విజయ్..  ఇప్పుడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు.  'తమిళగ వెట్రి కళగం' (టీవీకే ) పార్టీని స్థాపించిన నాటి నుండి వినూత్న నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న విజయ్..    తమిళనాడు ముఖ్యమంత్రిగా  సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కారు డ్రైవర్ కుమారుడు, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన శబరినాథన్‌ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమించారు. ఆశ్చర్యపరిచారు. ఈ అనూహ్య నియామకం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్  తన   కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్  టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా సీఎం విజయ్ తన ప్రభుత్వం సామాన్యులకు, విధేయతకు పెద్దపీట వేస్తుందనే స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు.  ఈ నియామకంపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుడికి ఉన్నత పదవి దక్కడం అభినందనీయమని కొందరు ప్రశంసిస్తుండగా, ఎలాంటి అనుభవం లేని వ్యక్తికి  ప్రభుత్వ చీఫ్ విప్ వంటి  కీలకమైన పదవి కట్టబెట్టడం సరికాదనీ అంటున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
    తగ్గేదేలే అనే రీతిలో పలు ఆసక్తికర తెలుగు సినిమా వార్తలు తెలుగు సినిమా ప్రేమికులు, పాఠకుల కోసం అందుబాటులో ఉన్నాయి.  1 . నాగార్జున విషయంలో హైకోర్ట్ కీలక తీర్పు.. అనుమతి పత్రాలు చూపండి అని ఆదేశాలు  నా పేరుతో టీ షర్ట్స్ ని ఒక సంస్థ విక్రయిస్తుందని కొన్ని రోజుల క్రితం నాగార్జున ఢిల్లీ హై కోర్ట్ ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు స్పందిస్తు నాగార్జునతో  నేరుగా ఒప్పందం లేనప్పుడు  ఆయన పేరు, ఫోటోలని వాడుకుంటూ టీ షర్టులు ఎలా అమ్ముతారు.  మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా హక్కులు పొందామని చెప్తే సరిపోతుందా!  ప్లెయింటిఫ్ తో మీకు పరిచయం కూడా లేనప్పుడు  ఆ వస్తువులని  అమ్మే చట్టబద్ధత మీకు ఎక్కడి నుంచి వచ్చింది. అనుమతి పాత్రలు ఉన్నాయా అని  ఢిల్లీ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది.   2. విజయ్ ఇక సెకండ్ ప్లేస్ లోనే  భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, రాజకీయాల్లో  తనకంటు ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకున్న దళపతి  విజయ్ మరో అరుదైన ఘనతని  సొంతం చేసుకున్నారు. ప్రముఖ సినిమా వెబ్ సైట్ ఐఎండీబీ తాజాగా విడుదల చేసిన 'పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్' జాబితాలో విజయ్  రెండో స్థానాన్ని  కైవసం చేసుకున్నాడు. అంతకు ముందు వారంలో 21 వ స్థానంలో ఉన్న విజయ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ కి రావడం విశేషం. 3 . భోపాల్‌లో ‘పెద్ది’ సౌండ్.. థర్డ్ సాంగ్ లాంచ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో పెద్ది నుంచి తాజాగా  మ్యూజికల్ ప్రమోషన్స్‌ కి సంబంధించిన శుభవార్త బయటకు వచ్చింది. 'సౌండ్ ఆఫ్ పెద్ది'  పేరుతో మే 23వ తేదీన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో స్పెషల్ సాంగ్‌ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్‌లో  రెహమాన్ స్వయంగా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. ఆయన స్వరపరిచిన బాణీలకి స్టేజ్ పై లైవ్ మ్యూజిక్ తోడైతే, ఆ వైబ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ ఒక రేంజ్ లో సక్సెస్ అయిన విషయం తెలిసిందే. 4 . బాలకృష్ణ, ఎన్టీఆర్ మల్టీస్టారర్! గాడ్ ఆఫ్ మాసెస్  బాలకృష్ణ, మాన్ ఆఫ్ మాసెస్  ఎన్టీఆర్ మల్టిస్టారర్ చెయ్యాలి అనే డిమాండ్ ఎప్పట్నుంచో ఫ్యాన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా  సోషల్ మీడియా వేదికగా మళ్ళీ తమ కోరికని వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళ కోరికని బాలయ్య, ఎన్టీఆర్ తీరుస్తారేమో చూడాలి. బాలయ్య ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చిత్రంతో బిజీగా ఉండగా, ప్రశాంత్ నీల్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు.   5 . IBOMMA మళ్లీ వచ్చేసింది! కొంతకాలంగా నిలిచిపోయినట్లు కనిపించిన IBOMMA వెబ్‌సైట్ తాజాగా మళ్లీ ఆన్‌లైన్‌లో కనిపించడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. సైట్‌ ని ఆపరేట్ చేస్తున్నాడనే ఆరోపణలతో రవిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేయగా.. సైట్ కూడా క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు మళ్లీ కొత్త సినిమాలతో సైట్ యాక్టివ్ కావడం ఇండస్ట్రీకి పెద్ద షాక్‌గా మారింది. ఈ పరిణామంపై పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.  రవి ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న  విషయం తెలిసిందే. 6 . మెగాస్టార్ చిరంజీవి జెన్ జీ  లుక్ వైరల్  మెగాస్టార్ చిరంజీవి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎంతో స్లిమ్‌గా, స్టైలిష్‌గా జెన్ జీ లుక్ లో  యువ హీరోలకి సైతం పోటీ ఇచ్చేలా ఉన్నారు. దీంతో సదరు స్టిల్స్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు.  గత కొంతకాలంగా చిరు కఠినమైన డైట్ క్రమశిక్షణతో కూడిన వర్కవుట్స్ చేస్తున్నారు.  అందుకే అంత ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారని సినీ వర్గాల టాక్. 7 .  క్షమాపణలు చెప్తున్న అలీ హిందువులని అవమానించే రీతిలో ఉన్న సోప్ యాడ్ చేసి ప్రముఖ నటుడు అలీ అపఖ్యాతికి గురైన విషయం తెలిసిందే. హిందువులు సోషల్ మీడియా వేదికగా అలీపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.  గతంలో తాను నటించిన 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలోని ఒక పాపులర్ కామెడీ సీన్‌ని  స్ఫూర్తిగా తీసుకుని ముంబైకి చెందిన కంపెనీ ఈ యాడ్ రూపొందించింది  దాంతో  కేవలం వినోదం కోసమే ఆ యాడ్ చేశాను. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదు. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరాడు. 8 .  పూజాహెగ్డే కి అండగా అల్లు అర్జున్! పూజాహెగ్డే ఇటీవల కెరీర్ పరంగా కొంచం డల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంలో తనకి అవకాశం ఇవ్వబోతున్నాడనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. అట్లీ మూవీతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. పూజా, అల్లు అర్జున్ కాంబోలో ఇప్పటికే డి జె జగన్నాధం, అల వైకుంఠ పురం వచ్చి మంచి విజయాలు అందుకున్నాయి. 9 . వారణాసిలో వారణాసి’ షూటింగ్? మహేశ్‌బాబు  రాజమౌళి  ల ‘వారణాసి’షూటింగ్ ఇప్పుడు అసలు లెవల్‌కి  వెళ్లబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. భారీ అండర్‌వాటర్ యాక్షన్ సీన్‌ని వారణాసిలో చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. మొదట ఈ సన్నివేశాన్ని హైదరాబాద్‌లో షూట్ చేయాలని అనుకున్నారు. కానీ 150 ట్యాంకర్ల నీటి సరఫరాకి జలమండలి అనుమతి ఇవ్వకపోవడంతో వారణాసికి షిఫ్ట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి . 10 . నట్టి కుమార్ రాజీనామా ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్  జాయింట్ సెక్రటరీ పదవికి రాజీనామా చేయడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు తాను పంపిన రాజీనామా లేఖలో 'ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో పారదర్శకత లోపించింది. కొందరు సభ్యుల ఏకపక్ష నిర్ణయాల వల్ల చిన్న నిర్మాతలకి  అన్యాయం జరుగుతుంది. థియేటర్ల కేటాయింపు, వర్చువల్ ప్రింట్ ఫీజు వంటి విషయాల్లో కౌన్సిల్ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైంది. కేవలం కొందరి ప్రయోజనాల కోసమే  కౌన్సిల్ కార్యకలాపాలు సాగుతున్నాయి. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు  తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.  
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్‌తో, వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi). ఎన్టీఆర్-వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన 'ఆది' సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన, పరిశ్రమలో 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను, తన వ్యక్తిగత విషయాలను తెలుగువన్(TeluguOne) ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో రఘు మాట్లాడుతూ తన తొలి రోజులను గుర్తు చేసుకున్నారు. 'ఆది' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన తమాషా సంఘటనలను వివరిస్తూ, ఎన్టీఆర్‌(NTR)తో ఉన్న అనుబంధం అప్పటి నుంచే బలపడిందని చెప్పారు. హీరో అనే ఫీలింగ్ లేకుండా నా లాంటి వాడిని దగ్గరకు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. అదుర్స్ సినిమా తన కెరీర్ ను టర్న్ చేసిందని, ఆ తర్వాత సినిమాలు క్యూ కట్టాయని తెలిపారు. అదుర్స్ సినిమా తర్వాతనే సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేశానని పేర్కొన్నారు. ఆ సినిమా విడుదలైన మరుసటి రోజే ఏకంగా 20 సినిమాల్లో అవకాశాలు వచ్చాయంటే తన పాత్ర ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయాల గురించి స్పందిస్తూ రఘు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) గారు తన క్లాస్‌మేట్ అని, తాము ఒకే బెంచ్ మీద కూర్చునే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు. తన జాతకం ప్రకారం భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్కులు చెప్పిన విషయాన్ని కూడా బయటపెట్టారు. తనకు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టమని, సమయం వచ్చినప్పుడు పార్టీ కోసం ప్రచారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తన మనసులోని మాటను వెల్లడించారు. తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడంపై స్పందిస్తూ.. ఇక్కడ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకోవడంలో తప్పులేదని, కానీ తనకంటూ ఒక టైం రావాలని అన్నారు. ఎన్టీఆర్ గారి మనసులో ఏముందో తెలియదని, కానీ ఆయన సీఎం కావాలని అందరిలా తాను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటానని చెప్పారు. అలాగే ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాలో తాను నటించే అవకాశం ఉందని, ఇప్పటికే ఆడిషన్స్ కూడా పూర్తయ్యాయని ఒక గుడ్ న్యూస్ చెప్పారు. తన 25 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని, ఇకపై రొటీన్ క్యారెక్టర్లు కాకుండా ఎమోషనల్, సెంటిమెంటల్ పాత్రలు చేయాలని ఉందని రఘు తన కోరికను వ్యక్తపరిచారు. విలన్ పాత్రలు చేయడానికి కూడా తాను సిద్ధమేనని, తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నానని అన్నారు. ఈ ఇంటర్వ్యూలో రఘు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూల కోసం తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.  
The ongoing standoff between Telangana exhibitors and producers is rapidly evolving from a business dispute into a high-stakes camp war. While the surface issue remains the "percentage vs. rental" system, the timing of this protest—arriving just as Mythri Movie Makers prepares for the release of Peddi—has sparked intense debate. Mega fans and industry insiders are openly accusing Shirish Reddy and the exhibitor lobby of "arm-twisting" Mythri’s distribution wing right before a big release. The situation turned personal when producer Bunny Vas, a core member of the Geetha Arts camp, weighed in. His comments about shrinking revenues and the need for heroes to work faster are being read as a direct counter-offensive. The Mega family is reportedly still fuming over earlier comments made by Dil Raju and Shirish regarding Game Changer. The duo’s public admission that the film's outcome nearly "brought them on the roads" was seen as a major lack of discretion and a slight against the hero's stardom. Mega fans have now taken this battle to social media, pushing a heavy narrative against Dil Raju and the exhibitors. They are portraying the protest as a targeted strike against the Mega camp, rallying support for their stars while digging up past grievances to paint the exhibitors as the aggressors. This digital surge has turned a trade issue into a full-blown fan war, further polarizing the industry. In a swift counter-move, Mythri Movie Makers is not backing down. They are currently organizing a counter-active Guild producers' meeting to consolidate support against the exhibitors' demands. This will be followed by a high-stakes press meet today, where the producers are expected to address the standoff directly. What began as a distribution tiff has officially morphed into a "Mega vs. Dil Raju" showdown that could permanently shift the power balance in Tollywood.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, రాజకీయాల్లో  తనకంటు ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకున్న దళపతి  విజయ్(Vijay)మరో అరుదైన ఘనతని  సొంతం చేసుకున్నారు. దీంతో అభిమానులతో పాటు తన పార్టీ వర్గాల్లో జోష్ వచ్చినట్లయింది.     ప్రముఖ సినిమా వెబ్ సైట్ ఐఎండీబీ (IMDb)తాజాగా విడుదల చేసిన 'పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్' జాబితాలో విజయ్  రెండో స్థానాన్ని  కైవసం చేసుకున్నారు.. అంతకు ముందు వారంలో 21 వ స్థానంలో ఉన్న విజయ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ కి రావడం విశేషం.ప్రతి వారం ఐఎండీబీ తన సైట్‌లోని పేజీ వ్యూస్ ఆధారంగా ఈ జాబితాని  రూపొందిస్తుంది. మే 2026 నాటికి ఉన్న క్రేజ్ ప్రకారం విజయ్ ఈ ఘనత సాధించారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ మరియు ఇతర పాన్ ఇండియా హీరోలను వెనక్కి నెట్టి విజయ్ ఈ స్థానంలో నిలవడం విశేషం. Also read: Peddi: భోపాల్‌లో పెద్ది సౌండ్:  ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్‌తో స్పెషల్ సాంగ్ లాంచ్ సినిమాల నుంచి తప్పుకుని పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్తున్నానని ప్రకటించినప్పటి నుండి ఆయనపై సోషల్ మీడియాలో మరియు ఇంటర్నెట్‌లో సెర్చ్ విపరీతంగా పెరిగింది.  
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం థియేటర్ల మనుగడ, ఎగ్జిబిటర్ల సమస్యలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా థియేటర్ల అద్దెలు, పర్సెంటేజీ విధానంపై ఎగ్జిబిటర్లు కొన్నాళ్లుగా గళమెత్తుతున్నారు. తాజాగా తెలంగాణ ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్‌లో ప్రముఖ నిర్మాత శిరీష్ (Shirish) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. సినిమా రంగం ఇప్పుడు కేవలం ప్రాంతీయ స్థాయికి పరిమితం కాలేదని, అన్నీ పాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయని శిరీష్ గుర్తు చేశారు. "హై బడ్జెట్ సినిమా అంటే అది తెలుగు సినిమా కాదు, పాన్ ఇండియా సినిమా. మరి అలాంటప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో పర్సెంటేజీ విధానం అమలవుతున్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదు?" అని ఆయన ప్రశ్నించారు. మన హీరోలు, మన డైరెక్టర్లు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తున్నా, మన సొంత గడ్డపై థియేటర్ల వ్యవస్థ మాత్రం సంక్షోభంలో కూరుకుపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు బెంగళూరులో ఎన్నో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండేవని, ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయాయని శిరీష్ హెచ్చరించారు. హైదరాబాద్ పరిస్థితి కూడా అదే దిశగా వెళ్తోందని, 'ఆర్ఆర్ఆర్' విడుదలైన సమయం నుండి ఇప్పటివరకు సుమారు 100 థియేటర్లు మూతపడటం దారుణమని అన్నారు. పాలిచ్చే వాడే పాలేరు అయినట్టుగా.. అసలు రెవెన్యూ జనరేట్ చేసే థియేటర్లను చిన్నచూపు చూస్తూ, ఓటీటీలకు ప్రాధాన్యత ఇవ్వడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పుష్ప వంటి పెద్ద సినిమాల వల్ల దేశవ్యాప్తంగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారని, కానీ ఆ సినిమాల వల్ల ఇక్కడి థియేటర్ల యాజమాన్యాలకు ఆశించిన స్థాయిలో లాభాలు అందడం లేదని శిరీష్ పేర్కొన్నారు. రాబోయే 'పెద్ది' వంటి పెద్ద సినిమాల విషయంలో కూడా ఇదే పద్ధతి కొనసాగితే కష్టమని, పర్సెంటేజీ విధానంపై ఎగ్జిబిటర్లు అందరూ ఐక్యంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. నిర్మాతలు కూడా సానుకూలంగా స్పందించి ఈ పర్సెంటేజీ సిస్టమ్‌కు మొగ్గు చూపితేనే ఇండస్ట్రీ భవిష్యత్తు బాగుంటుందని ఆయన సూచించారు. మొత్తానికి, థియేటర్లలో సినిమా చూసే అనుభూతిని కాపాడుకోవాలంటే వ్యవస్థలో మార్పు రావాలని శిరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ సమస్యపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.  
  మరింత సందడిని పెంచిన పెద్ది  మూడో సాంగ్ కోసం అందరు వెయిటింగ్  ఈ నేపథ్యంలో అధికార ప్రకటన మెగా జాతర మొదలైనట్టే  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో పెద్ది(Peddi). చరణ్ కెరీర్ లోనే  అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. తాజాగా  మ్యూజికల్ ప్రమోషన్స్‌ కి  సంబంధించిన శుభవార్త బయటకు వచ్చింది. 'సౌండ్ ఆఫ్ పెద్ది'  పేరుతో నిర్వహించబోయే ఒక భారీ ఈవెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్  ఏఆర్ రెహమాన్(A.R Rehman)సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. మే 23వ తేదీన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో స్పెషల్ సాంగ్‌ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్‌లో  రెహమాన్ స్వయంగా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. ఆయన స్వరపరిచిన బాణీలకు స్టేజ్ మీద లైవ్ మ్యూజిక్ తోడైతే, ఆ వైబ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ ఒక రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో థర్డ్ సాంగ్ పై ఫ్యాన్స్ తో పాటు మ్యూజిక్ లవర్స్ లో ఆసక్తి నెలకొని ఉంది. ఈ సాంగ్ చరణ్, శృతి హాసన్ , జాన్వీ కపూర్ పై చిత్రీకరించారు. Also read: Pooja Hegde: పూజాహెగ్డే అందాల అస్త్రం.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్   ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు బాలీవుడ్ మరియు టాలీవుడ్ ప్రముఖులు సందడి చేయనున్నారు. 'పెద్ది' చిత్రం జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.  మరి చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ఈ పవర్ ఫుల్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.  
టాలీవుడ్‌ను దశాబ్ద కాలంగా పీడిస్తున్న పైరసీ భూతం 'ఐబొమ్మ' (iBomma) మళ్ళీ పడగ విప్పింది. ఈ వెబ్‌సైట్ ప్రధాన నిర్వాహకుడు 'ఇమ్మడి రవి' అరెస్టుతో పైరసీకి అడ్డుకట్ట పడిందని భావించిన టాలీవుడ్ నిర్మాతలకు ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. రవి బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే 'ఐబొమ్మ వెబ్‌సైట్' సరికొత్త డొమైన్లతో మళ్ళీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవ్వడం పరిశ్రమలో కలకలం రేపుతోంది. ఐబొమ్మ రిటర్న్స్.. గత ఏడాది నవంబర్‌లో ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు, ఐబొమ్మ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పైరసీ అధ్యాయం ముగిసిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ హైకోర్టు ఆయనకు కొన్ని కఠినమైన షరతులతో బెయిల్ మంజూరు చేసింది. రవి బెయిల్ పొంది బయటకు వచ్చిన కొద్ది కాలానికే, ఇప్పుడు మళ్ళీ వెబ్‌సైట్ పునరుద్ధరించబడటమే కాకుండా, ప్రస్తుతం థియేటర్లలో ఉన్న కొత్త సినిమాలు కూడా అందులో హై-క్వాలిటీలో దర్శనమిస్తున్నాయి. పోలీసులకు డబుల్ ఛాలెంజ్ ఐబొమ్మ నిర్వాహకులు సాంకేతికతను వాడుకోవడంలో ఆరితేరిపోయారు. ఒక డొమైన్‌ను బ్లాక్ చేస్తే, వెంటనే మరో పేరుతో సైట్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. సర్వర్లు విదేశాల నుంచి ఆపరేట్ అవుతుండటం వల్ల వీటిని శాశ్వతంగా అరికట్టడం సవాలుగా మారింది. రవి బెయిల్‌పై వచ్చిన తర్వాతే ఈ సైట్ మళ్ళీ యాక్టివ్ అవ్వడం వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పరిశ్రమ మనుగడకే ముప్పు ఓ వైపు నిర్మాతలు థియేటర్ల ఆదాయం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఐబొమ్మ వంటి సైట్లు సినిమాలను ఉచితంగా అందించడం వల్ల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోతున్నారు. ఈ పైరసీ ముప్పు టాలీవుడ్ పునాదులను కదిలిస్తోంది. పోలీసులు, ప్రభుత్వం, సినీ పెద్దలు ఈ డిజిటల్ మాఫియాపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఐబొమ్మ వంటి అక్రమ సైట్లను ప్రేక్షకులు ప్రోత్సహించకూడదని ఫిల్మ్ ఇండస్ట్రీ కోరుతోంది. పైరసీ సైట్లను ప్రోత్సహించడం వల్ల వేల సంఖ్యలో ఉన్న సినీ కార్మికుల పొట్ట కొట్టినట్లవుతుందనే విషయాన్ని గుర్తించాలని వారు కోరుతున్నారు. 
The buzz for Ram Charan’s upcoming sports drama, Peddi, is intensifying as it heads toward its global release. Even before the promotional campaign moves into high gear, the film is showing its strength at the US box office, with premiere pre-sales already crossing the $225K mark. This early momentum suggests a massive response for director Buchi Babu Sana’s vision of a rustic sporting spectacle produced by Venkata Satish Kilaru.  The official campaign is set to kick off with a massive trailer launch in Mumbai on May 18th. This event will offer the first look at the gritty, adrenaline-fueled world the team has crafted. It serves as a major starting point for the film’s journey to the big screen, focusing on the fierce avatar Ram Charan is expected to portray in this high-stakes drama. Following the Mumbai event, the team will head to Bhopal on May 23rd for a monumental song launch. The highlight of the evening will be a live performance by maestro AR Rahman, who has already delivered hits like "Chikiri Chikiri" and "Raa Rei Raa Rei." This live concert is designed to bring the raw, earthy energy of the film’s music to a global audience in a grand setting. With post-production nearing completion athe film is geared for a June 4th worldwide release. The cast, featuring Janhvi Kapoor, Shiva Rajkumar, Jagapathi Babu, and Divyenndu Sharma, adds significant weight to the project. These upcoming events in Mumbai and Bhopal are expected to set the stage for one of the biggest cinematic arrivals of the year.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని సూపర్ స్టార్‌గా, కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న రజనీకాంత్.. తన వ్యక్తిత్వంలో ఉండే నిరాడంబరతకు పెట్టింది పేరు. వెండితెరపై స్టైల్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే రజనీ, నిజ జీవితంలో మాత్రం చాలా సామాన్యంగా ఉంటారు. తాజాగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తలైవా, తన జీవితంలోని ఒక అపురూపమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆధ్యాత్మికతకు అధిక ప్రాధాన్యత ఇచ్చే రజనీకాంత్, గతంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమానికి వెళ్ళినప్పటి ఒక ఆసక్తికర సంఘటనను వివరించారు. అక్కడ తన స్టార్‌డమ్ ఏమాత్రం పని చేయలేదని, అసలు తనను ఎవరూ గుర్తుపట్టలేదని ఆయన నవ్వుతూ చెప్పారు. కేవలం రెండు రోజులు గడపాలని వెళ్ళిన రజనీ, అక్కడి ప్రశాంతతకు ముగ్ధుడై ఏకంగా 15 రోజులు అక్కడే ఉండిపోయారట. ఆశ్రమంలోని ప్రకృతి, జంతువుల మధ్య గడపడం తనకెంతో నచ్చిందని ఆయన పేర్కొన్నారు. అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఒకరోజు గురుదేవ్‌తో కలిసి ఆశ్రమంలో నడుస్తున్నప్పుడు, అక్కడ ఉన్న వందలాది మందిలో ఒక్కరు కూడా రజనీ వైపు కన్నెత్తి చూడలేదట. వారిలో చాలా మంది తమిళనాడు వాసులే ఉన్నప్పటికీ, రజనీకాంత్ అనే సూపర్ స్టార్ అక్కడ ఉన్నారన్న స్పృహ కూడా ఎవరిలోనూ కనిపించలేదట. ఆ సమయంలో తన అహం ఒక్కసారిగా అణచివేయబడిందని, ఆధ్యాత్మిక శక్తి ముందు ఈ కీర్తి ప్రతిష్టలు ఎంత చిన్నవో తనకు అర్థమైందని రజనీ ఎంతో వినమ్రంగా చెప్పారు. సినిమా రంగంలో స్టార్‌డమ్ అనేది తాత్కాలికమని, కానీ ఆధ్యాత్మికంగా సంపాదించుకునే గౌరవం శాశ్వతమని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. మరణం తర్వాత కూడా పెరిగేది కేవలం ఆధ్యాత్మిక స్టార్‌డమ్ మాత్రమేనని ఆయన నొక్కి చెప్పారు. రజనీకాంత్ తరచుగా హిమాలయాలకు వెళ్తుంటారన్న విషయం తెలిసిందే. తన ప్రతి సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఆయన ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలు చేసి రీఛార్జ్ అవుతుంటారు.
టాలీవుడ్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు మెగాస్టార్ చిరంజీవి. కేవలం నటనతోనే కాకుండా, తన ఆహార్యం, నడక, మరియు స్టైల్‌తో దశాబ్దాలుగా కుర్రకారును ఉర్రూతలూగిస్తున్న బాస్, మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు చూస్తుంటే, వయసు అన్నది కేవలం అంకె మాత్రమేనని ఆయన నిరూపిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఎంతో స్లిమ్‌గా, మరింత ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ధరించిన జెన్-జీ (Gen-Z) తరహా మోడరన్ ఫ్యాషన్ దుస్తులు అభిమానులను ఫిదా చేస్తున్నాయి. ఆధునిక కాలానికి తగ్గట్టుగా తనను తాను మలుచుకోవడంలో బాస్ ఎప్పుడూ ముందుంటారని ఈ లేటెస్ట్ మేకోవర్ చూస్తే స్పష్టమవుతోంది. గత కొంతకాలంగా కఠినమైన డైట్, క్రమశిక్షణతో కూడిన వర్కవుట్స్ చేయడం వల్లే మెగాస్టార్ ఇంత ఫిట్‌గా తయారయ్యారని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తన సినిమాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో, వ్యక్తిగత ఫిట్‌నెస్ విషయంలోనూ ఆయన అంతే శ్రద్ధ చూపిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ స్టైలిష్ లుక్ సినిమా కోసమేనా అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమయ్యాయి. కానీ, ఇది కేవలం చిరంజీవి వ్యక్తిగత స్టైల్ మాత్రమేనని, రాబోయే సినిమాలో ఆయన లుక్ మరింత విభిన్నంగా ఉండబోతోందని సమాచారం. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్ కోసం మెగాస్టార్ సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఫోటోలు వైరల్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చిరంజీవి గత చిత్రం 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మాస్ లుక్‌లో అలరించిన ఆయన, ఇప్పుడు సోషల్ మీడియాలో క్లాస్ అండ్ ట్రెండీ లుక్‌తో రచ్చ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఈ ఫోటోలను చూసి "బాస్ ఈజ్ బ్యాక్ ఇన్ స్టైల్" అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. త్వరలోనే కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ గ్యాప్‌లోనే చిరంజీవి తన లుక్‌పై ఫోకస్ పెట్టి, యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. మరి ఈ కొత్త సినిమాలో మెగాస్టార్ ఇంకెన్ని మ్యాజిక్స్ చేస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త.. ఆయన 2వేల సంవత్సరాల కిందట చెప్పిన మాటలు నేటికీ అనుసరణీయంగా ఉన్నాయి. ఆయన గొప్ప తత్వవేత్త, జీవితం గురించి ఎన్నో సత్యాలు చెప్పాడు. ముఖ్యంగా మనిషి వ్యక్తిత్వం గురించి, మనిషి ఎలా  ఉండాలనే విషయాల గురించి ఆయన చెప్పిన విధానాలు ఎన్ని తరాలు మారినా ప్రతి ఒక్కరూ అనుసరించేలా ఉన్నాయి. ఎవరైనా సరే.. సక్సెస్ ఫుల్ లైఫ్ ను గడపాలని అనుకున్నా,  జీవితంలో గొప్పగా ఎదగాలన్నా చాణక్యుడు చెప్పిన సూత్రాలు పాటిస్తే చాలు.. వారు విజేతలు కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అలాగే వ్యక్తి జీవితంలో శాంతి లేకపోవడానికి కొన్ని కారణాలను కూడా పంచుకున్నాడు చాణక్యుడు. వ్యక్తి చేసే కొన్ని తప్పులే వారి జీవితంలో శాంతి కోల్పోయేలా చేస్తాయట.  వాటి గురించి తెలుసుకుంటే.. ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం.. ఇంట్లో పూజలు చేయకపోవడం, దేవుని నామాన్ని స్మరించకపోవడం జరిగే ఇళ్లలో ప్రజలు ఎప్పుడూ ఇబ్బందుల్లో ఉంటారట. అలాంటి ఇళ్లలో నివసించే ప్రజలు  సంతోషంగా ఉండరట.  పైగా  ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారట.ఇలాంటి ఇళ్లలో నివసించే వారి జీవితాలు రోజు రోజుకూ దిగజారి పోతుంటాయట. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే లేదా అగౌరవపరిచే వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా జీవించలేడట. అలా చేసిన ప్రతిసారీ జీవితంలో ఎదుగుదలకు ఆటంకం కలుగుతుందట. మహిళలను గౌరవించని కుటుంబాలు ఎప్పటికీ అభివృద్ధి చెందవని చాణక్యుడు స్పష్టంగా  చెప్పాడు. ఎందుకంటే లక్ష్మీ దేవి అలాంటి ఇళ్లలో ఎప్పుడూ నివసించదని కూడా స్పష్టంగా చెప్పాడు. పెద్దలు,  పిల్లలతో దుర్భాషలాడే ఇళ్లలో ఎల్లప్పుడూ అశాంతి నెలకొనే ఉంటుంది. అలాంటి ఇళ్లలో ధనం నిలవదు,  తరచుగా ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతూ ఉంటాయట. పైగా ఇలాంటి ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందట. ఇతరుల సంపదపై  దృష్టి పెట్టేవారి జీవితంలో ఎప్పటికీ శాంతి ఉండదట.  ఇతరుల సంపదను ముట్టుకోవడం అనేది పాముతో సమానం. అందుకే పరుల సొమ్ము పాము వంటిది అన్నారు అని చాణక్యుడు చెబుతాడు. పైన చెప్పుకున్నవన్నీ వ్యక్తి జీవితంలో శాంతి లేకపోవడానికి కారణం అవుతుంది.  అందుకే శాంతి కోరుకునే వారు వాటికి దూరంగా ఉండటం మంచిది.                                *రూపశ్రీ.  
  నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో "పంచదారకు బదులుగా బెల్లం వాడటం మంచిదా?" అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనిపై ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మరియు హెల్త్ కోచ్ ఈ వీడియోలో వివరించారు. పంచదార vs బెల్లం: ఏది బెటర్? చాలా మంది పంచదార కంటే బెల్లం ఆరోగ్యకరమని భావిస్తారు. అయితే, వాస్తవానికి పంచదార మరియు బెల్లం రెండింటికీ దాదాపు ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. గ్లైసీమిక్ ఇండెక్స్: పంచదార నేరుగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. జీర్ణం కావడం: బెల్లంలో మొలాసిస్ (Molasses) ఉండటం వల్ల, ఇది పంచదార కంటే కొంచెం నెమ్మదిగా జీర్ణమవుతుంది. కానీ, శరీరానికి అందే క్యాలరీలు మరియు ప్రభావం విషయంలో రెండూ దాదాపు సమానమే. సలహా: మీరు ఆరోగ్యంగా ఉండి, గ్లూకోజ్ లెవల్స్ సాధారణంగా ఉంటే పరిమితంగా ఏదైనా తీసుకోవచ్చు. కానీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు రెండింటికీ దూరంగా ఉండటమే మంచిది. స్వీట్నెస్ మరియు ఆరోగ్యం ప్రకృతిలో లభించే పండ్లు మొదలైనవి మనకు అలవాటైన స్వీట్లంత తీపిగా ఉండవు. బ్రాండ్లు మరియు కంపెనీలు మనకు ఈ అధిక తీపిని అలవాటు చేశాయి. పిసిఒఎస్ (PCOS), హార్మోన్ల అసమతుల్యత, ఇన్ఫెర్టిలిటీ వంటి అనేక సమస్యలకు చక్కెర ప్రధాన కారణం. డయాబెటిస్ మరియు హైపోగ్లైసీమియా వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే చక్కెరను డైట్ నుండి వీలైనంత వరకు తొలగించాలి. ప్రత్యామ్నాయాలు ఏవి? చక్కెరకు బదులుగా సహజసిద్ధమైన స్వీట్నర్లను వాడవచ్చు: మొంక్ ఫ్రూట్ (Monk Fruit): ఇది తక్కువ క్యాలరీలను ఇస్తుంది మరియు ఇన్సులిన్ స్థాయిలను వేగంగా పెంచదు. స్టీవియా (Stevia): దీనిపై కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ, మితంగా వాడితే ఇది సురక్షితమేనని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే బాడీ సెన్సిటివిటీని బట్టి దీనిని ఎంచుకోవాలి. బయటికి సన్నగా ఉన్నా లోపల ప్రమాదమేనా? కొందరు ఎంత తిన్నా లావు అవ్వరు (Metabolism వల్ల). కానీ వారు జంక్ ఫుడ్ లేదా అధిక చక్కెర తీసుకుంటే, అది బయటికి కనిపించకపోయినా లోపల లివర్ ఇన్ఫ్లమేషన్ (Liver Inflammation) కు దారితీస్తుంది. శరీరంలో కొవ్వును కరిగించే లేదా పెంచే ఎంజైమ్స్ లోపం వల్ల కొందరు లావు అవ్వకపోవచ్చు, కానీ వారి రక్త నాళాల్లో అడ్డంకులు (clogging) ఏర్పడే ప్రమాదం ఉంది. ఒకరి శరీరం స్పందించే తీరు మరొకరికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇతరులను చూసి బ్లైండ్‌గా ఫాలో అవ్వకూడదు. ముగింపు: ఫిట్‌నెస్ అంటే కేవలం బరువు తగ్గడం లేదా పెరగడం మాత్రమే కాదు, లోపల అవయవాలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయనేది ముఖ్యం. సరైన పోషకాహారం మరియు మితమైన తీపి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాల కోసం మా యూట్యూబ్  "TeluguOne Health" ఛానెల్ ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మీ జుట్టు - మీ ఆత్మవిశ్వాసం జుట్టు రాలడం లేదా చిట్లిపోవడం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. మనలో చాలా మంది జుట్టు పొడవుగా పెరగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, జుట్టు పెరుగుదల అనేది ప్రధానంగా మన జెనెటిక్స్ (Genetics) మీద ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉన్న జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. మనం జుట్టు పట్ల ఎందుకు జాగ్రత్త వహించాలి? (Why Should We?) సహజ సౌందర్యం: మీ జుట్టు కర్లీగా ఉన్నా లేదా స్ట్రెయిట్‌గా ఉన్నా, అది మీ ప్రత్యేకత. దాన్ని ప్రేమించడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. శాశ్వత నష్టాన్ని నివారించడానికి: జుట్టు ఒకసారి తీవ్రంగా దెబ్బతింటే (పర్మనెంట్ డామేజ్), అది మళ్ళీ పూర్వస్థితికి రావడం కష్టం. ఆరోగ్యకరమైన పెరుగుదల: క్రమం తప్పకుండా ట్రిమ్ చేయడం వల్ల జుట్టు చిట్లిపోకుండా (Split ends) చూడవచ్చు, దీనివల్ల జుట్టు చూడటానికి స్మూత్‌గా మరియు ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇవి అస్సలు చేయకండి! (What Not To Do) అధిక వేడి (High Heat): హెయిర్ స్టైలింగ్ కోసం 180°C కంటే ఎక్కువ వేడిని ఎప్పుడూ వాడకండి. ఇది మీ జుట్టును శాశ్వతంగా దెబ్బతీస్తుంది. బిగుతైన కేశాలంకరణ (Tight Hairstyles): జుట్టును చాలా గట్టిగా వెనక్కి లాగి ముడి వేయడం లేదా పోనీటైల్ వేయడం వల్ల ట్రాక్షన్ అలోపేషియా (Traction Alopecia) అనే సమస్య వస్తుంది. దీనివల్ల జుట్టు ఊడిన చోట మళ్ళీ మొలవదు. అతిగా కెమికల్ ట్రీట్‌మెంట్స్: కెరాటిన్, స్మూతనింగ్ లేదా పర్మింగ్ వంటివి తరచుగా చేయించుకోవడం వల్ల జుట్టు బలహీనపడి విరిగిపోతుంది. నిరంతరం షాంపూలు మార్చడం: షాంపూ అనేది కేవలం జుట్టును శుభ్రం చేసే సోప్ వంటిది మాత్రమే. ఇది జుట్టు పెరుగుదలను ఆపలేదు లేదా పెంచదు. కేవలం అలర్జీలు ఉంటే తప్ప, పదే పదే షాంపూలు మార్చడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. జుట్టు సంరక్షణ కోసం చిట్కాలు (How To Take Care) సహజమైన మాస్క్‌లు: ఇంట్లోనే లభించే అవిసె గింజల జెల్ (Flaxseed gel), కలబంద (Aloe vera), మెంతులు మరియు మందార ఆకులను వాడండి. ఇవి జుట్టుకు మంచి స్మూతనింగ్ ఏజెంట్స్‌గా పనిచేస్తాయి. సరైన వేడి వద్ద స్టైలింగ్: మీరు తప్పనిసరిగా స్టైలింగ్ చేయాలనుకుంటే, వేడిని 140°C నుండి 160°C మధ్య మాత్రమే ఉంచండి. రెగ్యులర్ ట్రిమ్మింగ్: జుట్టు చివర్లు చిట్లకుండా ఉండటానికి ప్రతి 6 వారాలకు లేదా కనీసం రెండు నెలలకు ఒకసారి కొద్దిగా ట్రిమ్ చేయించుకోండి. లూజ్ హెయిర్ స్టైల్స్: జుట్టును వదులుగా ఉండేలా చూసుకోండి. స్లీక్ స్టైల్స్ (Sleek styles) కంటే సహజమైన జుట్టును ప్రదర్శించడం ఎంతో మంచిది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: చివర్లు కట్ చేస్తే జుట్టు వేగంగా పెరుగుతుందా?  జ: లేదు. జుట్టు చివర్లు కట్ చేయడం వల్ల జుట్టు చూడటానికి స్మూత్‌గా ఉంటుంది కానీ, పెరుగుదల అనేది రూట్ (స్కాల్ప్) నుండి జరుగుతుంది. ప్ర: హెయిర్ బోటాక్స్ (Hair Botox) సురక్షితమేనా?  జ: ఇది ఒక మార్కెటింగ్ జిమిక్ మాత్రమే. ఇది పర్మనెంట్ కాదు, కేవలం మూడు నెలల వరకు మాత్రమే ఉంటుంది. దీనికంటే సహజ పద్ధతులు పాటించడం ఉత్తమం. ప్ర: షాంపూ మార్చడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా?  జ: షాంపూ మార్చడం వల్ల నేరుగా హెయిర్ ఫాల్ అవ్వదు. కొన్నిసార్లు అందులోని కొత్త కాంపోనెంట్స్ పడకపోతే అలర్జీ రావచ్చు, కానీ హెయిర్ ఫాల్ అనేది ఇతర కారణాల వల్ల (జెనెటిక్స్ లేదా ఒత్తిడి) జరగవచ్చు. జుట్టు ఆరోగ్యం అనేది మీరు దాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రసాయనాలకు దూరంగా ఉంటూ, సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా మీ జుట్టును మెరిసేలా ఉంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన అలవాట్లే మీ జుట్టుకు నిజమైన బలం. మరిన్ని హెల్త్ టిప్స్ మరియు హెయిర్ కేర్ రహస్యాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు, కొలీగ్స్..  ఇట్లా  ఎవరితో అయినా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తూనే ఉంటుంది.  చాలా వరకు ఆఫీసు పనులు, వ్యక్తిగత పనుల మీద ఒంటరిగానే ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నిజానికి ప్రయాణాలు అంటే అదొక స్పెషల్ మూమెంట్ అనిపిస్తుంది.  కానీ చాలా మంది మాత్రం ప్రయాణంలో చెప్పుకోలేని అసౌకర్యం అనుభవిస్తుంటారు.  అదే మలబద్దకం. ప్రయాణం కోసం అలా ఇంటి నుండి బయటపడగానే.. ఇటు మలబద్ధకం, ఉబ్బరం, తిమ్మిర్లు,  అసౌకర్యం మొత్తం ప్రయాణాన్ని నాశనం చేస్తాయి. మరీ ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు  ఈ సమస్య నరకాన్ని పరిచయం చేస్తుంది. అసలు ప్రయాణాలలో మలబద్దకం ఎందుకు వస్తుంది.  ఈ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలేంటి తెలుసుకుంటే.. ప్రయాణాల సమయంలో మలబద్దకం ఎందుకు వస్తుంది? ప్రయాణాలు చేసేటప్పుడు దినచర్య మారడం,  ఆహారపు అలవాట్లలో మార్పులు,  నీరు తక్కువ తీసుకోవడం,  ఎక్కువ సేపు కూర్చోవడం,  నిద్రలేకపోవడం,  టాయిలెట్ కు వెళ్లడానికి తగిన వెసులుబాటు లేకపోవడం మొదలైనవి మలబద్దకం రావడానికి కారణం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే ప్రయాణాల సమయంలో మలబద్దకం,  ఉబ్బరం,   గ్యాస్ వంటి సమస్యలను చాలా మంది ఎదుర్కుంటారు. ముఖ్యంగా వృద్దులు, స్త్రీలు,  పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఏదైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు ప్రయాణ సమయంలో మలబద్దకం సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలలో మలబద్దకానికి చెక్ పెట్టే చిట్కాలు.. ప్రయాణాలలో మలబద్దకానికి చెక్ పెట్టాలంటే ప్రయాణాలలో ఫైబర్ మెరుగ్గా ఉన్న ఆహారం తీసుకోవాలి.  మరీ ముఖ్యంగా ప్రయాణాలలో హోటల్ ఆహారాన్ని నిషేధించాలి. ప్రయాణాలలో ఆహారం వల్ల ఏదైనా ఇబ్బంది అనిపిస్తే పండ్లను తినడం మంచిది. పండ్లలో ఫైబర్ ఉంటుంది, నీటి శాతం కూడా ఉంటుంది.  ఇది జీర్ణాశయానికి సహాయపడుతుంది. ప్రయాణాలలో ఆకలి వేయకపోయినా స్నాక్స్ తినే అలవాటు కొందరికి ఉంటుంది.  బిస్కెట్లు,  సమోసాలు వంటివి తినడం వల్ల మలబద్దకం వస్తుంది.  అందుకే వీటిని నివారించాలి.  ఆకలిగా అనిపిస్తే బాదం, కాజు వంటి శక్తిని ఇచ్చే నట్స్ తీసుకోవాలి. ప్రయాణాలలో చాలామంది నీరు తక్కువగా తాగుతారు. కానీ ప్రయాణాలలో తప్పనిసరిగా 8గ్లాసుల నీరు తాగేలా చూసుకోవాలి. దూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువసేపు అలాగే కూర్చోకుండా అటు ఇటు తిరగడం,  ఏవైనా స్టాప్ లు వచ్చినప్పుడు కిందకు దిగి మళ్లీ ఎక్కడం వంటివి చేయవచ్చు. ప్రయాణాలలో తప్పనిసరిగా బయటి ఆహారం తినాల్సి వస్తే ప్రోబయోటిక్స్ మెరుగ్గా ఉన్న ఆహారం తీసుకోవాలి.  దోశ, ఇడ్లీ,  మజ్జిగ, పెరుగన్నం వంటివి మలబద్దకం రాకుండా చేస్తాయి. అలాగే ప్రయాణంలో పాలు పోక ఊరికే కాఫీలు,  టీలు తాగడం మానేయాలి. ప్రయాణాలలో మలబద్దకం సమస్యను ఎదుర్కునేవారు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మరీ ముఖ్యంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఇలా సమస్య ఎదుర్కునేవారు వైద్యుడిని సంప్రదించి వారి సలహా మేరకు మందులు వాడటం మంచిది.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతి రోజూ ఆహారంలో పండ్లు తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. అయితే కొన్నిరకాల పండ్ల రసాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.  ముఖ్యంగా దానిమ్మ రసం చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. రోజూ ఒక కప్పు దానిమ్మ (pomegranate) రసం తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరతాయి. ఇది శరీరాన్ని శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచే సహజ ఆయుర్వేద ఔషధంలా పనిచేస్తుంది. దానిమ్మ రసం తాగడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే.. గుండె ఆరోగ్యానికి మంచిది.. రక్తనాళాలను శుభ్రపరిచి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చెడ్డ కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. గుండెపోటు, హై బీపీ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్.. దానిమ్మలో పునికాలగిన్స్ (punicalagins) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, క్యాన్సర్, వృద్ధాప్యం రాకుండా రక్షిస్తాయి. శరీరానికి నష్టం కలిగించే హానికరమైన కణాలతో పోరాడతాయి. రక్తహీనత (అనీమియా) నివారణ.. దానిమ్మలో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి దానిమ్మ జ్యూస్ లో కూడాఐరన్ అధికంగా ఉంటుంది.  ఈ కారణం వల్ల హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదం చేస్తుంది. రక్తహీనత సమస్య తో ఇబ్బంది పడేవారు,  ముఖ్యంగా మహిళలు దానిమ్మ రసం రోజూ తీసుకుంటే మంచిది.  ఇంకా దానిమ్మ జ్యూస్  రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చర్మవర్ణం మెరుగుపరుస్తుంది.  రోగనిరోధక శక్తి.. దానిమ్మలో విటమిన్ C, విటమిన్ K, పొటాషియం అధికంగా ఉంటాయి.  ఇవి   ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. చర్మ ఆరోగ్యం,  అందం.. దానిమ్మ జ్యూస్ రోజూ తాగుతూ ఉంటే చర్మం గ్లోగా, యంగ్‌గా కనిపించేందుకు సహాయపడుతుంది.  అలాగే చర్మం మీద మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహకరిస్తుంది. మూత్రపిండాలకు & కాలేయానికి శుభ్రత.. టాక్సిన్లను బయటకు పంపి లివర్‌ను డిటాక్స్ చేయడంలో దానిమ్మ బాగా పనిచేస్తుంది. అంతేకాదు  మూత్రపిండాల్లో రాళ్ల ఏర్పడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించడం & బరువు తగ్గడం.. దానిమ్మలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఈ కారణంగా దానిమ్మ పండు లేదా జ్యూస్ తీసుకుంటే   త్వరగా ఆకలి కాదు.   మితంగా తీసుకుంటే బరువు తగ్గే వారికీ సహాయకరంగా ఉంటుంది. దానిమ్మ జ్యూస్ తాగే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఫ్రెష్‌గా గ్రైండ్ చేసిన  రసం తీసుకోవడం మంచిది.  ప్యాకెట్ జ్యూస్‌లో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు కంటే హాని ఎక్కువ చేస్తుంది.  డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి. రోజూ 1 కప్పు (150–200 మిల్లీలీటర్లు) సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  ఖచ్చితంగా, లైపోసెక్షన్ మరియు టమ్మీ టక్ గురించి మీ వెబ్‌సైట్ కోసం పాఠకులను ఆకట్టుకునేలా మరియు భావోద్వేగాలను స్పృశించేలా రూపొందించిన సమాచారం ఇక్కడ ఉంది: మీ కలల రూపం మీ సొంతం: లైపోసెక్షన్ మరియు బాడీ కాంటౌరింగ్ గురించి పూర్తి అవగాహన మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. పదిమందిలోకి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన దుస్తులు వేసుకోలేక, బాడీ షేప్ సరిగ్గా లేదని ఇబ్బంది పడే పరిస్థితులు ఎందరికో ఎదురవుతుంటాయి. మీ ఈ ఆవేదనను అర్థం చేసుకుని, మీకు సరైన ఆకృతిని ఇచ్చే అద్భుతమైన ప్రక్రియే 'లైపోసెక్షన్'. మనం ఈ చికిత్స ఎందుకు చేయించుకోవాలి? (Why Should We?) లైపోసెక్షన్ అనేది కేవలం కొవ్వును తీసేయడం మాత్రమే కాదు, అది మీ శరీరానికి ఒక కొత్త రూపాన్ని, మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మొండి కొవ్వు నుండి విముక్తి: వ్యాయామంతో తగ్గని లవ్ హ్యాండిల్స్, డబల్ చిన్, మరియు చేతుల దగ్గరి కొవ్వును ఇది సులభంగా తొలగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుదల: ముఖ్యంగా యువతలో గైనకోమాస్టియా (పురుషులలో ఛాతి పెరగడం) వంటి సమస్యల వల్ల కలిగే మానసిక ఇబ్బందులను ఇది దూరం చేస్తుంది. సరైన శారీరక ఆకృతి: హై డెఫినిషన్ లైపోసెక్షన్ ద్వారా జిమ్‌కు వెళ్లినప్పుడు వచ్చే సహజమైన బాడీ లైన్స్‌ను కూడా పొందవచ్చు. ఆరోగ్యపరమైన ప్రయోజనాలు: పొట్ట భాగం కిందకు సాగిపోవడం వల్ల వచ్చే అలర్జీలు, రాషెస్ మరియు అల్సర్ల నుండి ఉపశమనం లభిస్తుంది. లైపోసెక్షన్ ఎలా చేస్తారు? (How it works?) ఇది చాలా సరళమైన మరియు సురక్షితమైన ప్రక్రియ. చిన్న గాటు: కేవలం 1.5 నుండి 2 mm వరకు ఉండే అతి చిన్న రంధ్రం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఫ్యాట్ సక్షన్: ఒక చిన్న ట్యూబ్ సహాయంతో శరీరంలోని అదనపు కొవ్వును బయటకు సక్ (Suck) చేస్తారు. త్వరిత కోలుకోవడం: సర్జరీ జరిగిన రోజే లేదా మరుసటి రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు. రెండు రోజుల తర్వాత మీ సాధారణ పనులు కూడా చేసుకోవచ్చు. టమ్మీ టక్ (Tummy Tuck): పొట్ట భాగం మరీ ఎక్కువగా సాగిపోయిన వారికి ఆ అదనపు చర్మాన్ని తీసేసి, బొడ్డును కూడా సరిచేసి మంచి షేప్ ఇస్తారు. ఏం చేయకూడదు? (What Not to Do?) లైపోసెక్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ క్రింది విషయాలలో జాగ్రత్తగా ఉండాలి: బరువు తగ్గడానికి కాదు: లైపోసెక్షన్ అనేది బరువు తగ్గడానికి చేసే చికిత్స అని నమ్మవద్దు; ఇది కేవలం శరీర ఆకృతిని (Body Shaping) మార్చడానికి మాత్రమే. ధూమపానం వద్దు: సర్జరీకి 2-3 వారాల ముందు మరియు తర్వాత ఖచ్చితంగా స్మోకింగ్ మానేయాలి. అన్-సర్టిఫైడ్ డాక్టర్లు వద్దు: అనుభవం లేని వారితో కాకుండా, కేవలం బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ ద్వారానే ఈ చికిత్స చేయించుకోవాలి. నియమాలను అతిక్రమించవద్దు: డాక్టర్ సూచించిన లిమిట్స్ కంటే ఎక్కువ ఫ్యాట్ తీయమని ఒత్తిడి చేయకూడదు, అది ప్రమాదకరం కావచ్చు. సాధారణ సందేహాలు - సమాధానాలు (Q&A) ప్ర: లైపోసెక్షన్ సురక్షితమేనా?  జ: అవును, అర్హత కలిగిన ప్లాస్టిక్ సర్జన్ ద్వారా నియమిత పరిమితుల్లో చేయించుకుంటే ఇది 100% సురక్షితం. ప్ర: సర్జరీ తర్వాత మచ్చలు కనిపిస్తాయా?  జ: లైపోసెక్షన్ రంధ్రాలు చాలా చిన్నవి కాబట్టి మచ్చలు తెలియవు. టమ్మీ టక్ చేసినా ఆ గీత మీ ఇన్నర్ వేర్ లైన్ లోపలికే ఉంటుంది కాబట్టి బయటకు కనిపించదు. ప్ర: సర్జరీ తర్వాత మళ్ళీ కొవ్వు చేరుతుందా?  జ: సర్జరీ తర్వాత హెల్దీ డైట్ పాటించడం మరియు డాక్టర్ సూచించిన విధంగా 4-6 వారాల పాటు కంప్రెషన్ గార్మెంట్స్ ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అందంగా కనిపించాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది. ఆధునిక వైద్య శాస్త్రం అందించిన ఈ అద్భుత చికిత్సలతో మీ కలల రూపాన్ని పొందడం ఇప్పుడు సులభం. భయపడాల్సిన అవసరం లేదు, సరైన నిపుణులను సంప్రదించి మీ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మరిన్ని వివరాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానల్ చూడండి. ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.