బాధితులకు బాబు భరోసా.. జగనన్న మరో బాదుడు.. కొండపల్లి రచ్చ.. టాప్ న్యూస్@1PM

Publish Date:Nov 23, 2021

Advertisement

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్నారు. బాధితులతో మాట్లాడి వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. పులపుత్తూరు, మందపల్లి, గుండ్లూరులో ఆయన తిరుగుతున్నారు.  చంద్రబాబుతో పాటు జిల్లాకు చెందిన టీడీపీ మఖ్య నేతలు ఉన్నారు. అంతకుముందు కడపకు వచ్చిన చంద్రబాబుకు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది.ఎయిర్‌పోర్టు దగ్గర టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
-----
వ్యవస్థల విధ్వంసానికి జగన్‌రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ విమర్శించారు. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఖండిస్తున్నానన్నారు. పంచాయతీల సొమ్మును స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి  విద్యుత్ బకాయిలంటూ రూ.345 కోట్లు కట్ చేశారని లోకేష్‌ అన్నారు. 15వ ఆర్థిక సంఘం కేటాయించిన రూ.965 కోట్లను ప్రభుత్వం పక్కదారి పట్టించడం గ్రామీణ ప్రజలకు తీరని అన్యాయం చెయ్యడమే అని మండిపడ్డారు.
--------
ఏపీ అసెంబ్లీలో ఆరోగ్యశ్రీపై ఆసక్తికర చర్చ జరిగింది. కందుకూరులో ఆరోగ్యశ్రీ పథకాన్ని డాక్టర్లు లేకుండానే క్లైమ్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మహిధర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై స్పందించిన వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళనాని మాట్లాడుతూ అలా అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రులు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
---
ప్రజలపై మరో భారం మోపేందుకు సిద్ధమైంది జగన్ రెడ్డి. మోటారు వాహ‌నాల ప‌న్ను చ‌ట్టం 1963లో స‌వ‌ర‌ణ‌లకు అసెంబ్లీలో బిల్ ప్రవేశ పెట్టారు. కొత్త చట్టం ద్వారా నూత‌న వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో... ఇక‌పై 13, 14, 17, 18 శాతం చొప్పున లైఫ్ టాక్స్ విధించబోతోంది. ట్యాక్సుల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై 410 కోట్ల అద‌న‌పు భారాన్ని ప్రభుత్వం మోపనుంది. 2019-21లో ర‌వాణా శాఖ‌కు రూ. 3,181 కోట్ల ఆదాయం లభించింది. టాక్స్‌ల పెంపుతో ల‌క్ష‌ల‌ మందిపై వంద‌ల కోట్ల భారం మోపనుంది.
-----
కొండపల్లిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. కొండపల్లి ఇబ్రహీంపట్నంలో మంత్రి కొడాలి నాని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే జోగి రమేష్ మకాం వేశారు. టీడీపీ శ్రేణుల మీద దాడులు చేసేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకులు ఇబ్రహీంపట్నంలో వాహనాల్లో కర్రలు వేసుకుని వైసీపీ నేతలు హల్ చల్ చేస్తున్నారు.
----
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన నిర్ణయమే తమ నిర్ణయం.. పార్టీ నిర్ణయమని అన్నారు. దక్షిణ భారతదేశంలోనే విశాఖపట్టణానికి పర్యాటక రంగంగా ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. చాలా కారణాల వల్ల అనుకున్న స్థాయిలో ఇక్కడ పర్యాటక అభివృద్ధి చెందడం లేదన్నారు.
-----
జీహెచ్ఎంసీ ఆఫీస్‌లో బీజేపీ మెరుపు ధర్నాకు దిగింది. మేయర్ కార్యాలయంలోకి బీజేపీ కార్పొరేటర్లు దూసుకెళ్లారు. జీహెచ్‌ఎంసీ ఆఫీసుకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. బల్దియాకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు. మేయర్ హఠావో అంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. మేయర్‌ చాంబర్‌లో ఫర్నీచర్‌ను బీజేపీ నేతలు  ధ్వంసం చేశారు. ఆందోళన చేస్తున్న బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
-----
 సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి రాజీనామీ వివాదంపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. వెంకట్ రామిరెడ్డి రాజీనామా ఆమోదించడాన్ని సవాలు చేస్తూ సూబెంధర్ సింగ్, జే.శంకర్ హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు. కాగా... ఇప్పటికే ఎమ్మెల్సీగా నామినేషన్ ప్రక్రియ పూర్తి అయినందున తాము వేసిన పిటిషన్‌లో ఫలితం లేదని పిటీషర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ నామినేషన్‌ను రద్దు చేయాలన్న పిల్‌ను పిటిషనర్ వెనక్కి తీసుకున్నారు
----
మెట్రోరైలు నడుస్తున్న సమయంలో ఆయా స్టేషన్ల మూల మలుపుల వద్ద వస్తున్న శబ్దాలతో ప్రయాణికులు కంగారుపడుతున్నారు. అప్పటివరకు సాఫీగా నడుస్తున్న రైలు కింది భాగంలో సౌండ్‌ వస్తుండడంతో ఏదైనా సాంకేతిక లోపం ఏర్పడిందోననే భయంతో వణికిపోతున్నారు. బేరింగ్‌లు అరిగిపోయిన శబ్దాలు వినిపిస్తుండడంతో ప్రయాణికులు, రోడ్లపై వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా నాంపల్లి, అసెంబ్లీ, బేగంపేట్‌, రసూల్‌పురా, ప్రకాష్‌నగర్‌, ఎంజీఆర్‌ఐ, తదితర ప్రాంతాల్లో ఇలాంటి శబ్దాలు ఎక్కువగా వస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. 
---
గత పది వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలోని రోడ్లపై వరదనీరు పారుతుండటంతో కార్లు తేలియాడుతున్నాయి. యలహంక చెరువు వరదనీటితో పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొగిలు క్రాస్, నాగవర, విద్యారణ్యపుర, యెలహంక ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. వరద ప్రాంతాల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సహాయ పనులు చేపట్టారు.

By
en-us Political News

  
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.