జగనన్న ఉత్తుత్తి ఉప సంహరణ ఎందుకంటే.. 

Publish Date:Nov 23, 2021

Advertisement

మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ, ఇది ఉపసంహరణ కాదు.ఇదొక ఎత్తుగడ. న్యాయస్థానాల కళ్ళు కప్పి మొట్టికాయల నుంచి తప్పించుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయోగించిన కుట్ర పురిట ఎత్తుగడ. చట్టాల మీద కోర్టులో దాఖలైన కేసుల విచారణ ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో,ఇలాంటి నిర్ణయం కుట్రపూరిత నేరంగా భావించినా తప్పు లేదని న్యాయవ్యవస్థలో భాగమైన న్యాయవాదులు కొందరు అభిప్రాయ పడుతున్నారు. చట్టాలు పూర్తిగా ఉపసంహరించుకుంటే అదో రకం, కానీ, ఉపసహరించుకున్న చట్టాల స్థానంలో సమగ్ర వివరాలతో మళ్ళీ బిల్లు తెస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసన సభలో ప్రకటించారు. అంటే, వైసీపీ సర్కార్ మనసు మారలేదు. వ్యూహం మారింది. ఇలా న్యాయవ్యవస్థతో దాగుడుముట్లు ఆడడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న కూడా వినవస్తోంది. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ ‘చక్కటి’ సలహా ఎవరిచ్చారో, ఏమో కానీ, ఈ ‘ఉత్తుత్తి’ ఉపసంహరణతో ఏపీ నిర్దిష్ట రాజధాని లేని అనాధ రాష్ట్రంగా మిగిలి పోతుందనేది మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నేళ్ళు అనేది సప్ష్టంగా చెప్పలేక్ పోయినా, ఇప్పట్లో ఏపీ రాజధాని సమస్య పరిష్కారం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. 

నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ‘అశ్వధామ హతః ... కుంజరః’ అన్నట్లుగా మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల ఉపసహరణ క్రతువును, చాలా గోప్యంగా కానిచ్చింది. సుమారు నాలుగు గంటలు ఉత్ఖంట భరితంగా నడిపించి చివరకు వైసీపే ప్రభుత్వం మార్కు డొల్ల తనాన్ని ముఖ్యమంత్రి బయట పెట్టరు.చివరకు, ముఖ్యమంత్రి కరిమింగిన వెలగ పండును బయటకు తీశారు. రాజధాని మిధ్య, ఉపసంహరణ మిధ్య అని తేల్చి చెప్పారు. 

అయితే, ఇక్కడితో కథ కంచికి చేరినట్లు కాదు. నిజమే, మంత్రి ఒకరు అన్నట్లుగా, ఇది విరామమే .. శుభం కార్డు’ పడినట్లు కాదు. ఇల్లు అలకగానే పండగ రాదు... ప్రభుత్వం చట్టాలను ఉపసంహరించు కానీ, న్యాయస్థానం ఇంకా ఉపసంహరణకు ఒకే చెప్పలేదు.ఈ కేసుకు సంబదించిన పిటీషనర్ల తరపు న్యాయవాదుల అభ్యర్ధన మేరకు ప్రభుత్వం మెమో’తో మమ అనిపిస్తే కుదరదని,చట్టాల రద్దు ప్రేరేపించిన అంశాలు, రద్దు ఉద్దేశాలు (దురుద్దేశాలు అనాలేమో, కానీ కోర్టు ఆ మాట అనలేదు) , తాజా బిల్లు ఎందుకు మ ఏ ఉద్దేశాల (దురుద్దేశాల)తో తెస్తున్నారో సవివరంగా వివరిస్తూ, అఫిడవిట్ దాఖలు చేయాలని, న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, అఫిడవిట్’తో పాటుగా, మెమో, బిల్లును కూడా శుక్రవారం (నవంబర్ 26)లోగా కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. సో ... చాట్ల ములుకు మాత్రమే కాదు, రద్దుకు కూడా ఇది ఇంటర్వెల్ మాత్రమే..రద్దు బిల్లును  శాసన సభ ఆమోదించినా ... న్యాయస్థానాల్లో ఉన్న ఉన్న కేసులు కొనసాగీ అవకాశాలను పూర్తిగా కొట్టివేయలేమని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. 

అయితే, న్యాయస్థానంలో చట్టాలను  ఉపసంహరించుకుంటే, ఆ చట్టాలను సవాలు చేస్తూ విచ్రన్లో ఉన్నకేసులు అన్నీ కూడా, ఇన్ఫ్రుక్ట్యస్ (infructious) నిర్వీర్యం, నిష్ఫలం అయిపోతాయని, నుడ్కోసమే జగన్ రెడ్డి ప్రభుత్వం  వ్యూహాత్మకంగా చట్టాలను ఉపసంహరించుకుందని న్యాయనిపుణులు అంటున్నారు. అయితే, చట్టాల ఉపసంహరించుకున్నా, అందుకు సంబంధించి విచారణ దశలో ఉన్న పిటీషన్ల విషయంలో నిర్ణయం తీసుకునే విచాక్షనాదికారం న్యాయస్థానాలకు ఉంటుందని, అంటున్నరు. అయితే ఏది ఏమైనా రాజధాని సమస్య మాత్రం ఇప్పట్లో పరిష్కారం కాదని, ఫలితంగా రాజధాని లేని రాష్ట్రంగా అవమానాలు ఎదుర్కొనవలసి రావడమే కాకుండా, అది రాష్ట్ర అభివృద్ధికి కూడా ప్రతిబంధకం అవుతుందని అంటున్నారు.

By
en-us Political News

  
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.