హైదరాబాద్ నగరంలోని టోలిచౌకి ప్రాంతంలో నిర్మాణ పనుల సమయంలో జరిగిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకేసారి మూడు ఇండ్లలో విషాదఛా యలు అలుముకున్నాయి టోలిచౌకిలోని అల్లాస్నాథ్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనంలో గోవా కట్టెలు (సపోర్ట్ నిర్మాణం) ఒక్కసారిగా కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం మేరకు, అల్లాస్నాథ్ కాలనీలో నిర్మాణంలో ఉన్న కొత్త ఐదు అంతస్తుల భవనానికి ప్లాస్టింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల కోసం సుమారు పది మంది తాపీ మేస్త్రిలు గోవా కట్టెలపై నిలబడి పనిచేస్తు న్నారు.
ఇదే సమయంలో భవనానికి సపోర్ట్‌గా ఏర్పాటు చేసిన గోవా కట్టెలు ఒక్కసారిగా కూలి పోవడంతో అక్కడ పనిచే స్తున్న కార్మికులు కిందపడి పోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు మరియు రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, భవన నిర్మాణంలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు అవసరమైన రక్షణ చర్యలు లేకుండానే పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిర్మాణ యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/three-workers-die-after-falling-from-building-in-hyderabad-36-215073.html
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్‌గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.