సునీల్ నాయక్.. ముందస్తు బెయిలు కోసం వచ్చి అడ్డంగా బుక్కయ్యారు!
Publish Date:Mar 5, 2026
Advertisement
బిహార్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ కోసం వచ్చి అడ్డంగా బుక్కయ్యారు. ఔను ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై జగన్ హయాంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ7గా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్.. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువు తీరిన తరువాత ఇక్కడ నుంచి రిలీవ్ అయ్యారు. తన సొంత రాష్ట్రమైన బీహార్ కు వెళ్లిపోయారు. జగన్ హయాంలో పదోన్నతిపై ఏపీకి డెప్యుటేషన్ పై వచ్చి సీఐడీ డీజీగా పనిచేసిన సునీల్ నాయక్, ప్రభుత్వం మారగానే తన సొంత క్యాడర్ బిహార్‌కు తిరిగి వెళ్ళిపోయారు. ఇక ఏపీ పోలీసులు తనని ఏమీ చేయలేరని భావించారు. తననుఏపీ పోలీసులు స్వరాష్ట్రంలో అరెస్టు చేయకుండా అక్కడి పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పించుకున్నారు కూడా. అయితే ఎల్లకాలం అలా తప్పించుకోవడం సాధ్యం కాదని గ్రహించి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో యాంటిసిపేటరీ పిటిషన్ దాఖలు చేశారు. అలా ఆయన ఏపీకి వచ్చి అడ్డంగా బుక్ అయిపోయారు. ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ను విచారించిన హైకోర్టు.. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూనే గుంటూరు సీసిఎస్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరవ్వాలని విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. గురువారం (మార్చి 5) నుంచి సోమవారం (మార్చి 9) వరకూ ప్రతిరోజూ పోలీసుల విచారణకు హాజరు కావాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. దీంతో అనివార్యంగా ఆయన విచారణకు హాజరు కావాల్సివచ్చింది. కాదని కోర్టు ఆదేశాలను ధిక్కరించి బీహార్ చెక్కేస్తే.. హైకోర్టు ఇక బెయిలు ఇవ్వదు సరికదా.. నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసే అవకాశాలున్నాయి. ఈ విషయం తెలుసుకనుకనే హైకోర్టు ఆదేశం మేరకుసునీల్ నాయక్ గుంటూరు పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు విచారిస్తున్న విజయనగరం ఎస్పీ దామోదర్ ఎదుట హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ హాజరౌతూ ఉండక తప్పదు. విచారణ ఎలా ఉంటుందన్న సంగతి స్వయంగా ఐపీఎస్ అయిన సునీల్ నాయక్ కు తెలియంది కాదు. దీంతో ఈ విచారణలో సునీల్ నాయక్ వాంగ్మూలం కేసు పురోగతిలో అత్యంత కీలకం కానుంది. ఇదే ఇప్పుడు వైసీపీయులను టెన్షన్ పెడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ips-sunil-naik-attene-police-inquiry-invetible-36-215074.html





