మూడో ప్రపంచ యుద్ధం ముప్పు.. ఎంతదూరంలో అంటే?
Publish Date:Mar 4, 2026
Advertisement
మూడో ప్రపంచ యుద్ధం ఎలాంటి ఆయుధాలతో జరుగుతుందో లేదో తెలీదు కానీ, నాలుగో ప్రపంచ యుద్ధం మాత్రం కర్రలు, కటార్లతో జరుగుతుందని అన్నారు గతంలోనే ఐన్ స్టీన్. దీని అర్ధమేంటంటే.. ఈ ప్రపంచం మొత్తం సర్వ నాశనమై పోయి.. తిరిగి కొత్త జనరేషన్ మొదలవుతుందని. మళ్లీ మనం పాత కాలపు రాతి యుగానికి వెళ్లినా ఆశ్చర్యం లేదని అర్ధం. ఆ మూడో ప్రపంచ యుద్ధం ఈ ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ద్వారానే జరుగుతుందా? అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్న వేళ.. ఇది మూడో ప్రపంచ ముప్పుగానూ భావిస్తున్న వారు లేక పోలేదు. ఇది రెండు దేశాల మధ్య యుద్ధం కానే కాదు.. ఇది రెండు ప్రపంచ దేశాల సమూహాల మధ్య యుద్ధంగా రూపాంతరం చెందుతూ వస్తోంది. ఇరాన్ కి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్ధతు ఇస్తున్నదేశాలు మొత్తం మూడు రకాలుగా ఉన్నాయి. వాటిలో ప్రధాన మిత్ర దేశాలు ఏవని చూస్తే.. రష్యా, చైనా. ఉక్రెయిన్ వార్ లో ఇరాన్ డ్రోన్లు రష్యాకు ఎంతగానో ఉపయోగ పడ్డాయి. దీంతో రష్యా ఇరాన్ కి ఆధునిక రాడార్ వ్యవస్థగాపేరున్న.. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ 400 ని అందిస్తోంది. చైనా కూడా ఆర్ధికంగా, దౌత్యపరంగా ఇరాన్ కి అండగా నిలుస్తోంది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ లోపల ఉన్న అణుకేంద్రాలు, చమురు నిల్వలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు చేస్తోంది. ఇది ప్రస్తుతం షేడ్ వార్ కాదు.. డైరెక్ట్ స్కై వార్ గా రూపాంతరం చెందింది. ఇరాన్ ఆ చుట్టు పక్కల దేశాల్లో ఎటు నుంచి ఏ క్షిపణి వచ్చి.. ఎవరి మీద పడుతుందో తెలియని దుస్థితి రాజ్యమేలుతోంది. అందుకే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ అంటే కేవలం ఆ ఒక్క దేశం మాత్రమే కాదు.. దాని వెనుక ప్రపంచ అగ్రదేశాలైన అమెరికా, బ్రిటన్లతో పాటు ఎన్నో ఐరోపా దేశాలు ఉన్నాయి. ఇక ఇరాన్ వెనక.. రష్యా, చైనా, ఉత్తర కొరియా దేశాలున్నాయి. ఒక వేళ ఇరాన్ అణుబాంబు వాడితే.. అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగితే.. ఇది ప్రపంచ యుద్ధంగా మారడానికి ఎక్కువ సమయం తీసుకోదు. ఇజ్రాయెల్ ని టచ్ చేయడం అంటే, అది ఇంచు మించు అమెరికాని టచ్ చేయడంతో సమానమే. దీంతో అమెరికా ఒక్కసారిగా యాక్టివ్ అయిపోతుంది. ఈ కారణంగా.. అణు యుద్ధం షురూ అవుతుంది. అటు వైపు జరుగుతున్న వార్ ఇటు వైపునకు మళ్లుతుంది. ఇప్పటికే కిమ్ తన క్షిపణి సాంకేతిక వ్యవస్థను ఇరాన్ కి అమ్మే పనిలో ఉన్నారని సమాచారం. అదే జరిగితే.. ఇటు ఇజ్రాయెల్ ఎలా తుడిచి పెట్టుకుపోతుందో.. అటు ఉత్తర కొరియా పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే మారిపోతుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ సంయమనం పాటించాలని కోరుతున్నాయి. ఖమేనీ తర్వాత ఐఆర్జీసీకి నేతృత్వం వహిస్తున్న వాహిదీ- దీన్ని ప్రపంచ యుద్ధం వరకూ తీసుకెళ్లకుండా ఉండాలంటే.. కిమ్ లా రెచ్చగొట్టకుండా దౌత్య పరమైన ప్రతిపాదనలు చేసి ఇక్కడితో శాంతింప చేయాలి. లేకుంటే ప్రపంచ చిత్రపటం రూపు షేపు మారిపోవడం మాత్రమే కాదు.. మానవాళికి కూడా అతి పెద్ద ముప్పు ముంచుకొచ్చే ప్రమాదం జస్ట్ క్లిక్ అంత దూరంలో పొంచి ఉంది.
యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ప్రాక్సీలు. లెబనాన్ హిజ్బుల్లా, యెమన్ హౌతీలు, సిరాయా ఇరాక్ లోని కొన్ని షియా మిలీషియా గ్రూపులు ఇరాన్ కోసం క్షేత్ర స్థాయిలో భీకర పోరాటం చేస్తున్నాయి. ఇక ఇరాన్ కు తటస్థ, పరోక్ష మద్ధతు పలుకుతున్నాయి ఉత్తర కొరియా, ఖతార్, మరికొన్ని మధ్య ఆసియా దేశాలు. ప్రస్తుత యుద్ధం డైరెక్ట్ కన్ ఫ్రంటేషన్ దశలో ఉంది. ఇరాన్ కేవలం తన ప్రాక్సీలు అంటే హిజ్బుల్లా వంటి వాటి ద్వారానే ఇజ్రాయెల్ పై దాడి చేసేది. కానీ ఇప్పుడు నేరుగా ఇరాన్ తన సొంత భూభాగం నుంచి వందలాది క్షిపణులు, డ్రోన్ల ద్వారా ఇజ్రాయెల్ పై నేరుగా దాడులు చేస్తోంది.
హార్ముజ్ జలసంధిని ఇరాన్ గానీ మూసేస్తే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇది ఇతర దేశాలను అనివార్యంగా యుద్ధంలోకి లాగుతుంది. ఈ యుద్ధం సందర్భంగా అప్పుడే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఒతమ దగ్గరున్న ఒక్క మిస్సైల్ చాలు.. ఇజ్రాయెల్ ప్రపంచ పటంలో లేకుండా పోవడానికని అని హెచ్చరించారు. ఉత్తర కొరియా దగ్గర మోస్ట్ పవర్ ఫుల్ హాసాంగ్-17, 18 క్షిపణులున్నాయి. ఇవి అణు బాంబులను సైతం మోసుకెళ్లగలవు. ఇజ్రాయెల్ వంటి అతి చిన్న దేశాన్ని సర్వ నాశనం చేయడానికి ఈ ఒక్క శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు చాలని అంటారు కిమ్.
http://www.teluguone.com/news/content/third-world-war-fear-36-214963.html





