ఇరాన్‌పై యుద్ధానికి ముగ్గురు అధ్యక్షులు ‘నో’... ట్రంప్ మాత్రం ‘ఓకే’

Publish Date:Apr 23, 2026

Advertisement

 

ఇరాన్‌పై యుద్దంపై జాన్ కెర్రీ సంచలన విషయాలు

యుద్దానికి ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాది

యూఎస్ విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సంచలన విషయాలు

ఇరాన్‌పై అగ్రదేశం అమెరికాతో కలిసి దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెనత్యాహూ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారంట. అయితే ఆయన ప్రతిపాదనను గతంలో ముగ్గురు అమెరికా అధ్యక్షుడు తిరస్కరిస్తే.. ట్రంప్ మాత్రం ఓకే చెప్పి ప్రస్తుత యుద్దానికి కారణమయ్యారని అగ్రరాజ్య విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జాన్ కెర్రీ వెల్లడించారు. 

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం దశాబ్దాలుగా ఉంది. ఇరాన్‌పై యుద్ధం చేయాలనే ప్రతిపాదనను నెతన్యాహు ఇంతకు ముందు కూడా అమెరికా అధ్యక్షుల ముందు పలుసార్లు పెట్టారని జాన్ కెర్రీ వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదనను అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా, బుష్, బైడెన్ తిరస్కరించారని తెలిపారు. జాన్ కెర్రీ ఒక టెలివిజన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఒబామా వద్దన్నారు. బుష్ వద్దన్నారు. అధ్యక్షుడు బైడెన్ వద్దన్నారు. తాను కూడా ఆ చర్చల్లో ఉన్నానని చెప్పారు. నెతన్యాహు చాలా కాలంగా ఇరాన్‌పై దాడి చేయాలని అమెరికాను ఒత్తిడి చేస్తున్నారని కెర్రీ చెప్పారు. 

కానీ గత అధ్యక్షులు దౌత్యపరమైన పరిష్కారాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారని తెలిపారు. ట్రంప్ మాత్రం నెతన్యాహు మాటలు విని యుద్ధానికి దిగారని అన్నారు. వియత్నాం, ఇరాక్ యుద్ధాలు రెండూ ఒకే పాఠాన్ని నేర్పుతున్నాయని, వియత్నాం యుద్ధ వీరుడిగా తనకు ఆ పాఠం తెలుసని కెర్రీ పేర్కొన్నారు. 'వియత్నాం యుద్ధంలో పాల్గొన్న ఒక అనుభవజ్ఞుడిగా చెబుతున్నాను. దేని గురించి ఆ యుద్ధం చేయాలో మాకు చెప్పలేదు. పూర్తిగా అబద్ధాలు చెప్పారు. ముందు అమెరికా ప్రజలకు అబద్ధాలు చెప్పి.. ఆ తర్వాత వారి కొడుకులను, కూతుళ్లను యుద్ధానికి పంపమని అడగవద్దు' అని కెర్రీ పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడి చేసేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నెతన్యాహు ఎలా ఒప్పించారో న్యూయార్క్ టైమ్స్ వివరించింది . 'ఫిబ్రవరి 11న సిట్యుయేషన్ రూమ్‌లో, నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్‌లో పాలన మార్పునకు సమయం ఆసన్నమైందని అన్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌కు అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త మిషన్ ముగింపు పలకగలదని నెతన్యాహు గట్టిగా వాదించారు' అని ఆ నివేదిక పేర్కొంది. 'ఇది మంచి ఆలోచనగానే అనిపిస్తోంది' అంటూ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్‌కు ట్రంప్ పచ్చజెండా ఊపారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

By
en-us Political News

  
విమాన టికెట్ బుక్ చేసుకుని విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడన్న సమాచారం అందడంతో వెంటనే రంగం లోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు అతని ప్రయా ణాన్ని అడ్డుకున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నం దున దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు.
పులివెందుల నియోజకవర్గంలో గురువారం రాత్రి వీచిన పెనుగాలి, అకాల వర్షం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానండా అరటి పంట తీవ్రంగా దెబ్బతింది. వేల ఎకరాల్లో పంట నేలమట్ట మైంది. ప్రాథమిక అంచనాల ప్రకారం వెయ్యి ఎకరాల్లో అరటి పంట ధ్వంసమై.. రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
స్టార్ట‌ప్ ఇండియా, అట‌ల్ ఇన్నోవేష‌న్ మిష‌న్ వంటి ప‌థ‌కాలు యువ పారిశ్రామిక వేత్త‌ల‌కు గొప్ప అవ‌కాశాల‌కు రాచ‌బాట ప‌రుస్తున్నాయి. నేడు భార‌త్ లో 1. 25 ల‌క్ష‌ల‌కు పైగా గుర్తింపు పొందిన స్టార్ట‌ప్స్ ఉన్నాయి. ఇందులో స‌గానికి పైగా టూ టైర్ 2, 3 ప‌ట్ట‌ణాల నుంచి మొద‌లైన‌వి కావ‌డం విశేషం.
ఈ ట్రయల్ లో భాగంగా  ప్రజల ఫోన్లకు శనివారం  అత్యవసర హెచ్చరికలా కనిపించే సందేశం గట్టిగా శబ్దం, వైబ్రేషన్‌తో రావచ్చని తెలిపింది.
దీనిద్వారా మొదటి దశలో 500 పడకలు అందుబాటులోకి వస్తాయి. బసవతారకం హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, క్యాన్సర్ పేషంట్ లకు వైద్యసేవలు మరింత చేరువ కానున్నాయి.
రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. లంక ఆటగాడు పాతుమ్ నిస్సంక ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న నిస్సంక పవర్‌ప్లేలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో పర్యటించారు
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్ చేయొద్దన్న కోర్టు ఆదేశాల అమలుపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు కీలక అధికారులకు నోటీసులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది.
అమెరికా అధ్యక్షుడి మానసిక స్థితి సరిగ్గానే ఉందా.. అన్న అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.