మంచి జీవితానికి ఈ మూడు విషయాలు అవసరం!

Publish Date:Jun 4, 2025

Advertisement

ఆశనిరాశల్ని..... విజయవైఫల్యాల్ని మైలురాళ్ళుగా మిగిల్చి మరో సంవత్సరం మన కళ్ళముందు నుంచి కనుమరుగయింది. సరికొత్త సవాళ్ళతో మనం ఎంత సాహసి కులమో తేల్చేందుకు కొత్త సంవత్సరం స్వాగతించింది. నిజానికి కాలానికి తరతమ భేదాలుండవు. అందరికీ మంచినే పంచాలనుకుంటుంది. కాని ఎవరి ప్రయత్నాన్ని బట్టి వారికి ఆ యా ఫలితాల్ని ప్రసాదిస్తుంది. అందుకే ఆశావహులకు బృందావనమైతే... నిరాశావాదులకు అదే కాలం కాటేసే కాలనాగవుతుంది.  గతాన్ని గతంలోనే పూడ్చిపెట్టి... సరికొత్త ఆశలతో ముందుకు సాగిపోవాలి. అందుకోసం అందరూ పాటించాల్సిన కొన్ని విషయాలివి.

అస్పష్టం... అనాలోచితం

ప్రస్తుతం చాలా సందర్భాల్లో విఫలమవడానికి కారణం మన పరిధిని, మన సామర్ధ్యాన్ని మనం సరిగ్గా అంచనా వేసుకోకపోవడం. ఫలితంగా చాలా మంది జీవితాలు అస్పష్టంగా, అనాలోచితంగా సాగిపోతున్నాయి. ఆంగ్ల విద్యావేత్త బ్రెండన్ 'once we accept our limits, we go beyond them' అంటారు. ముందు మన పరిమితుల్ని, వనరుల్ని తెలుసుకోగలగాలి. కాని దురదృష్టవశాత్తూ మనలో చాలామంది వయసు మించిపోతున్నా వారి వారి సామర్ధ్యాల్ని గుర్తించి మసలుకోలేకపోతున్నారు. పరుగులయితే పెడుతున్నాం... కానీ ఎక్కడికో చెప్పలేకపోతున్నాం. అలసిపోతున్నాం.  కాని అసలు ఎందుకో తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ముందు ఈ కొత్త ఏడాది లోనైనా మన గమ్యం పట్ల పూర్తి స్పష్టతను ఏర్పరచుకుంటే మంచిది. దానికి అనుగుణంగా మన గమనాన్ని నిర్దేశించుకావాలి. 

ఆధునిక బలహీనతలు.. అష్టకష్టాలు..

సహజంగా మనలో ఉండే బలహీనతలకు తోడు నేడు ఆధునికమైనవి కూడా వచ్చి తోడయ్యాయి. అసలే కోతి, ఆపై పిచ్చి, కల్లు తాగి, నిప్పులు తొక్కి.... అన్నట్లుగా మారిపోయింది ప్రస్తుతం మన మనఃస్థితి. యుక్తవయసులో అసలే కుదురుగా ఉండని మనస్సును సెల్ఫోన్లు, ఇంటర్నెట్లు మరింత ఇరకాటంలో పడేశాయి. ఆధునిక మానవుడికి సెల్ఫోన్ రూపంలో మరో శరీరభాగం వచ్చి చేరినట్లయింది. విలాసాల్ని అవసరాలుగా భ్రమించడం వల్లనే ఈ ప్రమాదమంతా.   ఇవి మానసికంగా, శారీరకంగా ఎంత బలహీనుల్ని చేస్తున్నాయో యువతీయువకులు గమనించడం లేదు. ముఖ్యంగా జీవితానికి పటిష్టమైన మార్గాన్ని నిర్మించుకోవలసిన విలువైన ప్రాయంలో ఇవి  ఏకాగ్రతను ఛిన్నాభిన్నం చేస్తాయి. 'simple living high thinking'  ను  జీవనశైలికి మలచుకోవాలి. అలా చేస్తే ఈ ఆధునిక బలహీనతల నుండి బయటపడవచ్చు.

ఆహారాలు... ఆహార్యాలు...

భగవద్గీతను చదవడం కన్నా ముందు ఫుట్బాల్ ఆడి శరీరాన్ని దృఢం చేసుకోండి.  మానసికంగా, శారీరకంగా బలహీనపరిచే దేనినయినా విషంలా తిరస్కరించండి అనే వారు స్వామి వివేకానంద. బాణం గురి చేరాలంటే ముందు ధనుస్సు బలంగా ఉండాలి. ధనుస్సే బలహీనంగా ఉంటే, ఇక బాణం గురించి చెప్పేదేముంటుంది. ఆధునికత పేరుతో అస్తవ్యస్తమైన ఆహార, ఆహార్యాల వెంట పరుగులు తీస్తున్నాం. అందుకే మనలో చాలామంది ముఖాల్లో కృత్రిమ కాంతులు.... అద్దకపు అందాలు. వీటన్నింటికీ కారణం మన జీవనంలో సహజత్వం లోపించడం. పసిబిడ్డ ఉగ్గుపాల నుంచి పండ్లరసాల వరకు అన్నింటినీ మార్కెట్లలో కొనుగోలు చేస్తున్నాం. భారతీయ జీవనవిధానానికి సరిపోలని సంస్కృతుల్ని దిగుమతి చేసుకొని మనకు మనమే కృతకంగా బ్రతుకులీడుస్తున్నాం. ఆహార, ఆహార్యాలనేవి వారి వారి భౌగోళిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వారసత్వంగా సంక్రమిస్తూ ఉంటాయి. ఒకరు ఇంకొకరి ఆహార, ఆహార్య, ఆచారాలను గుడ్డిగా అనుకరించడం వలన పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా మారిపోతుంది. అందుకే భౌతికంగా, బౌద్ధికంగా మనల్ని ధీరోదాత్తులను చేసే జీవనశైలిని అలవరచుకుంటే కొత్త ఏడాదిలో జీవితం విజయానికి చేరువ అవుతుంది.


                                             *నిశ్శబ్ద.

By
en-us Political News

  
ఒంటికి చలువ చేసి తక్షణ శక్తిని అందించే సగ్గుబియ్యం జావను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. అనారోగ్యం, నీరసం తగ్గించే ఈ హెల్దీ డ్రింక్ రెసిపీ మరియు ఆరోగ్య లాభాల పూర్తి వివరాలు.
30 రోజుల పాటు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సులభమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో ఎలాంటి అద్భుత మార్పులు జరుగుతాయి? గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, బీపీ నియంత్రణ మరియు తక్షణ శక్తి వంటి ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
శరీరంలో విటమిన్ డి లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ప్రధాన లక్షణాలు మరియు దీనిని అధిగమించడానికి తీసుకోవాల్సిన ఉత్తమ ఆహార పదార్థాల గురించి పూర్తి సమాచారం.
తీవ్రమైన మానసిక ఆందోళన మరియు ఒత్తిడితో బాధపడుతున్న యూజర్లలో దాదాపు 47 శాతం మంది భావోద్వేగ మద్దతు కోసం ఏఐ చాట్‌బాట్లను ఆశ్రయిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
వృద్ధులలో విపరీతమైన మందుల వాడకం (పాలీఫార్మసీ) మరియు సంక్లిష్టమైన రెజిమెన్స్ వల్ల వైద్యులపై పడుతున్న భారం గురించి తాజా అధ్యయన విశేషాలను తెలుసుకోండి.
అల్గారిథమ్‌ల గందరగోళం మరియు ఆటోప్లే పాటలతో విసిగిపోయిన మ్యూజిక్ ప్రియులు మళ్లీ సీడీల (CDs) వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? సీడీల పునరాగమనం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలపై ప్రత్యేక కథనం.
ఆంధ్ర స్టైల్ శెనగపప్పు మటన్ కూరను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. రుచికరమైన మరియు ప్రోటీన్ నిండిన ఈ ట్రెడిషనల్ రెసిపీ తయారీ విధానం పూర్తి వివరాలతో.
ఏ ఇంటికైనా ఆ ఇంట్లోని పిల్లల ప్రవర్తనే వారి పరువు ప్రతిష్టలను నిర్ణయిస్తుంది. ముఖ్యంగా కొడుకు మంచివాడైతే ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు.
ప్రస్తుత డిజిటల్ కాలంలో చిన్నారులను స్మార్ట్‌ఫోన్‌లు, టీవి,  వీడియో గేమ్స్ నుండి దూరం చేయడం  తల్లిదండ్రులకూ ఒక పెద్ద ఛాలెంజ్ గా  మారింది.
మన సమాజంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో మొహమాటం ఒకటి. ఎదుటివారు ఏది అడిగినా,
తక్కువ నీటితో లేదా నీరు లేకుండా మాత్రలు మింగుతున్నారా? దీనివల్ల ఆహార నాళంలో పుండ్లు, మంట వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాత్రలు వేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకోండి.
క్యాన్సర్‌కు సర్జరీ మాత్రమే కాకుండా రేడియేషన్ థెరపీ, రేడియోసర్జరీ ద్వారా ఎలాంటి కోతలు లేకుండా ఎలా చికిత్స అందించవచ్చో తెలుసుకోండి. IMRT, IGRT మరియు అడాప్టివ్ రేడియోథెరపీ ప్రత్యేకతల పూర్తి సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.