కష్టసమయంలో కూడా నవ్వుతూ ఉండాలంటే ఇలా చేయండి!

Publish Date:Jan 9, 2024

Advertisement

మనిషి జీవితానికి, కాలానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే   రోజులో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రిలాగా.. మనిషి జీవితంలో కూడా  సంతోషం, పోరాటం, కష్టం, దుఃఖం అన్నీ ఉంటాయి. వీటి నుండి విజయం, అపజయం అనే చీకటి, వెలుగులు దోబూచులాడతాయి. అయితే చాలా మందికి రెండింటిని ఒక్కటిగా తీసుకోవడం రాదు.  కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు భయపడిపోవడం, అపజయం ఎదురైనప్పుడు కుంగిపోవడం చేస్తారు.  విజయం సాధించినప్పుడు, అనుకున్నవి జరిగినప్పుడు సంతోషపడతారు. అయితే కష్టం  వచ్చినా, సమస్యలు ఎదురైనా నవ్వుతూ ఉండాలంటే మాత్రం ఈ కింద చెప్పుకున్న పనులు పాటించాలి.

చాలామంది సంతోషాన్ని బయటి నుండి వెతుకుతారు. అయితే సంతోషం అనేది అంతర్గతమైనది.  ఆనందం అనేది కేవలం పరిస్థితులు లేదా వ్యక్తి ద్వారా సృష్టించబడదని అర్థం చేసుకోవడం ముఖ్యం. అయితే దీన్ని కొన్ని పనులు చేయడం ద్వారా అనుభూతి చెందవచ్చు.

శారీరక శ్రమ..

శారీరక శ్రమ సహజంగానే మనిషి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అందుకే కనీసం 10 నిమిషాల వ్యాయామం చేయాలి. ఇందులో  ఫాస్ట్ వాకింగ్, జంపింగ్ జాక్స్, స్ట్రెచింగ్ వంటివి  చేర్చవచ్చు. అంతేకాకుండా మానసిక ఆరోగ్యానికి నాణ్యమైన నిద్ర కూడా చాలా ముఖ్యం. అందువల్ల ప్రతిరోజూ ఏడు గంటలు నిద్రపోవాలి. ముఖ్యంగా  చాలా ఆందోళనగా ఉన్నప్పుడు సరైన నిద్ర చాలా అవసరం.

ప్రకృతికి దగ్గరగా..

గందరగోళంగా ఉన్న మనస్సును శాంతపరచడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం పచ్చని వాతావరణంలో నడవడం. దీని కోసం  అడవులకు  వెళ్లవలసిన అవసరం లేదు. పార్క్ లు, తోటలలో  నడవడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకుపచ్చ రంగు  మనసుకు విశ్రాంతినిస్తుంది. ఇది సంతోషాన్ని పెంచుతుంది.  ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.

మిమ్మల్ని మీరు చూసుకుని నవ్వాలి..

ఎంత  కష్టమైన సమయాలు ఉన్నా అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుని  నవ్వడానికి ప్రయత్నించాలి.   ఇది చాలా అద్భుతమైన ట్రిక్.  దీన్ని అలవాటు చేసుకుంటే ఎంత క్లిష్టం పరిస్థితులలో ఉన్నా కూడా ఒత్తిడి, ఆందోళనకు గురి చేయనివ్వదు.

ఆలోచన..

కష్టకాలంలో ఉన్నప్పుడు దాన్ని గుర్తుచేసుకుని  నిరంతరం ఆలోచించే బదులు దాని పరిష్కారం లేదా దాని ప్రభావం తగ్గించడం దిశగా  ఆలోచించాలి. ఇలా చేయడం వల్ల మొదట మీరు డిప్రెషన్ నుండి  మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు.   రెండవది పరిస్థితిని మెరుగైన మార్గంలో ఎదుర్కోవడానికి మీ మనస్సు సిద్ధమవుతుంది.

                                *నిశ్శబ్ద.

   
 

By
en-us Political News

  
ఒంటికి చలువ చేసి తక్షణ శక్తిని అందించే సగ్గుబియ్యం జావను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. అనారోగ్యం, నీరసం తగ్గించే ఈ హెల్దీ డ్రింక్ రెసిపీ మరియు ఆరోగ్య లాభాల పూర్తి వివరాలు.
30 రోజుల పాటు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సులభమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో ఎలాంటి అద్భుత మార్పులు జరుగుతాయి? గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, బీపీ నియంత్రణ మరియు తక్షణ శక్తి వంటి ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
శరీరంలో విటమిన్ డి లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ప్రధాన లక్షణాలు మరియు దీనిని అధిగమించడానికి తీసుకోవాల్సిన ఉత్తమ ఆహార పదార్థాల గురించి పూర్తి సమాచారం.
తీవ్రమైన మానసిక ఆందోళన మరియు ఒత్తిడితో బాధపడుతున్న యూజర్లలో దాదాపు 47 శాతం మంది భావోద్వేగ మద్దతు కోసం ఏఐ చాట్‌బాట్లను ఆశ్రయిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
వృద్ధులలో విపరీతమైన మందుల వాడకం (పాలీఫార్మసీ) మరియు సంక్లిష్టమైన రెజిమెన్స్ వల్ల వైద్యులపై పడుతున్న భారం గురించి తాజా అధ్యయన విశేషాలను తెలుసుకోండి.
అల్గారిథమ్‌ల గందరగోళం మరియు ఆటోప్లే పాటలతో విసిగిపోయిన మ్యూజిక్ ప్రియులు మళ్లీ సీడీల (CDs) వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? సీడీల పునరాగమనం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలపై ప్రత్యేక కథనం.
ఆంధ్ర స్టైల్ శెనగపప్పు మటన్ కూరను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. రుచికరమైన మరియు ప్రోటీన్ నిండిన ఈ ట్రెడిషనల్ రెసిపీ తయారీ విధానం పూర్తి వివరాలతో.
ఏ ఇంటికైనా ఆ ఇంట్లోని పిల్లల ప్రవర్తనే వారి పరువు ప్రతిష్టలను నిర్ణయిస్తుంది. ముఖ్యంగా కొడుకు మంచివాడైతే ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు.
ప్రస్తుత డిజిటల్ కాలంలో చిన్నారులను స్మార్ట్‌ఫోన్‌లు, టీవి,  వీడియో గేమ్స్ నుండి దూరం చేయడం  తల్లిదండ్రులకూ ఒక పెద్ద ఛాలెంజ్ గా  మారింది.
మన సమాజంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో మొహమాటం ఒకటి. ఎదుటివారు ఏది అడిగినా,
తక్కువ నీటితో లేదా నీరు లేకుండా మాత్రలు మింగుతున్నారా? దీనివల్ల ఆహార నాళంలో పుండ్లు, మంట వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాత్రలు వేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకోండి.
క్యాన్సర్‌కు సర్జరీ మాత్రమే కాకుండా రేడియేషన్ థెరపీ, రేడియోసర్జరీ ద్వారా ఎలాంటి కోతలు లేకుండా ఎలా చికిత్స అందించవచ్చో తెలుసుకోండి. IMRT, IGRT మరియు అడాప్టివ్ రేడియోథెరపీ ప్రత్యేకతల పూర్తి సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.