వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్.. కారణం అదేనట.!

Publish Date:May 9, 2022

Advertisement

ఏపీలో రాజకీయం హాట్ హాట్ గా మారింది. ముఖ్యంగా అధికార వైసీపీ ఎమ్మెల్యేల్లో కొన్ని రోజులుగా టెన్షన్ మొదలైందనే ప్రచారం జరుగుతోంది. ఓ వైపు ప్రతిపక్ష టీడీపీ దూకుడుగా ప్రజల్లోకి వెళ్తోంది. చంద్రబాబు నాయుడు సభలకు కూడా జనం పోటెత్తి వస్తున్నారు. దీనికి తోడు ఇటీవల సీఎం జగన్ చేయించిన ఓ సర్వేలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. చాలా మంది ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని ఓ మీటింగ్ లో కుండబద్దలు కొట్టారు. అంతే కాదు.. చాలా మంది ఎమ్మెల్యేలకు కనీసం పాస్ మార్కులు కూడా రాలేదట.  

జగన్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో కొత్త చర్చ మొదలైంది. సర్వేలో తక్కువ శాతం వచ్చిన వారి లిస్టులో తమ పేరు ఉందా.? అని ఆరా తీయడం మొదలుపెట్టారట. ఎందుకైనా మంచిదని తమ అనుచరులతో క్షేత్ర స్థాయిలో తమ పరిస్థితి ఎలా ఉందనే లెక్కలు వేసుకుంటున్నారని సమాచారం. అందుకే చాలా మంది నేతలు సైలెంట్ గా తమ పని తాము చేసుకొని పోవాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటికే కొంత మంది నేతలు ఎక్కడ తమకు టికెట్ రాదేమో అనే భయంతో ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. 

ఇప్పటికే కొంత మంది నేతలు అధినేత జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారట. కొన్ని రోజుల క్రితం వరకు తమకు మంత్రి పదవి ఖాయం అని అనుకున్న వారిలో కొంత మందికి బెర్త్ కన్ఫాం కాలేదు. దీనికి తోడు పనితీరు బాగోలేకుంటే టికెట్ కూడా ఇచ్చేది లేదని చెప్పడంతో అయోమయంలో పడిపోయారట. వాస్తవానికి జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు పెద్దగా పనేమి ఉండటం లేదు. వారంతా ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే మిగిలిపోయారు. ఏ పని జరగాలన్నా తాడేపల్లి నుంచి ఆదేశాలు వస్తేనే అధికారులు పనులు చేసి పెడుతున్నారు. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజలకు కాదు కదా.. కనీసం తమ అనుచరుల కోసం కూడా పనులు చేసి పెట్టుకునే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో తామేమి చేయడం లేదని నిందించడం ఏంటని కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. 

అందుకే వచ్చే ఎన్నికల నాటికి ఎవరికి టికెట్ వస్తుందో, ఎవరికి రాదో అనే టెన్షన్ లో చాలా మంది నేతలు ఉన్నారు. సొంత పార్టీలోనే వర్గపోరుతో ఇబ్బంది పడుతున్న కొంత మంది నేతలు అయితే పక్కపార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఒకవేళ తమకు జగన్ టికెట్ ఇవ్వకపోతే వెంటనే పార్టీ మారిపోవడానికి గ్రౌండ్ వర్క్ కూడా ఇప్పటి నుంచే చేసుకుంటున్నారట. రాబోయే రోజుల్లో వైసీపీ నేతల్లో ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.

By
en-us Political News

  
భేటీ అనంతరం అంబటి రాంబాబు ముద్రగడపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన పట్టుదల, రాజకీయాలలో నిజాయితీ, విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తుతించారు. తమ మధ్య జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.
తెలుగువన్ వాస్తవ వేదిక సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు.
అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.
ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.
భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
జ‌గ‌న్ లెవ‌న్ పై మీమ్స్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ లాగా.. జ‌గ‌న్స్ లెవ‌న్ అనే పేరు మీద మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా 11వ నెంబర్ రూమే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.