జగన్ సింహం కాదు పిల్లి.. 2024 తరువాత వైకాపా మాయం.. చంద్రబాబు

Publish Date:May 9, 2022

Advertisement

సింహం సింగిల్ గా వస్తుందంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం అధినేత ఘాటుగా రిప్లై ఇచ్చారు. జగన్ సింహం కాదు పిల్లి అంటూ అభివర్ణించారు పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సోమవారం వర్చువల్ గా  సమావేశమయ్యారు.  ఆ సమావేశంలో ఆయన ముఖ్యమంత్రి జగన్ పైనా, వైసీసీపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ భయంతో వణికిపోతున్నారనీ, అందరి కాళ్లూ పట్టుకుంటున్నారని అన్నారు.  
2024 ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమన్న చంద్రబాబు.. ఓడిపోతే వైసీపీ అడ్రస్ ఉండదని జగన్ కు అర్ధమైందని అన్నారు. అందుకే జగన్ అక్రమ మార్గాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.  తన భీమిలీ పర్యటనలో జనం జై బాబు నినాదాలు చేస్తే.. జై జగన్ నినాదాలు చేశారన్నట్లుగా వీడియోలు మార్ఫింగ్ చేసి సమాజిక మాధ్యమంలో పోస్టు చేశారని చంద్రబబు అన్నారు.  అలాగే, ప్ర‌జా వ్య‌తిరేక ప్ర‌భుత్వాన్ని ఓడించ‌డానికి ప్ర‌జ‌లంతా క‌లిసి రావాల‌ని తాను అంటే.. పొత్తుల కోసం వెంపర్లాడుతున్నట్లుగా వక్రీకరించారని దుయ్యబట్టారు. 

రాష్ట్ర ప్రజల్లో జగన్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ఉందని  అన్ని వర్గాల ప్రజలు అసమర్థ ప్రభుత్వ పాలనతో విసిగిపోయి ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్న విషయం తన పర్యటనకు వచ్చిన స్పందన ద్వారా స్పష్టం అయ్యిందన్నారు. 2024లో టీడీపీకి అధికారం అనేది చారిత్రిక అవసరం అని ప్రజలే భావిస్తున్నారన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, జగన్ పోకడలను చూస్తే 2024 ఎన్నికలే వైసీపీకి చివరి ఎన్నికలు అవనున్నాయని  అన్నారు.   
బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెళ్లాలని  సూచించారు. గ్రామ స్థాయిలో పార్టీలో చేరికలను ఆహ్వానించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.  

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదిక సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు.
అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.
ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.
భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
జ‌గ‌న్ లెవ‌న్ పై మీమ్స్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ లాగా.. జ‌గ‌న్స్ లెవ‌న్ అనే పేరు మీద మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా 11వ నెంబర్ రూమే.
ఇక 2026 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లుర‌కాల ఉచితాల వ‌ల ప‌న్నాయంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.