జగన్ ప్రచారంలో బాబాయ్ నామస్మరణ

కోడలికి బుద్ధి చెప్పి అత్త మూకుడు నాకిందనే సామెత తెలుగువారందరికీ తెలిసే వుంటుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీరు ప్రస్తుతం ఈ సామెత చెప్పినట్టే వుంది. బాబాయి వివేకా హత్యను ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష తెలుగుదేశంతోపాటు, తన సొంత చెల్లెళ్ళు షర్మిల, సునీత  ప్రస్తావించే అవకాశం వుంది కాబట్టి, అలా ప్రస్తావిస్తే అది తనకు నెగటివ్ అయ్య ప్రమాదం వుంది కాబట్టి వైసీపీ వర్గాలు కోర్టును ఆశ్రయించాయి. ప్రతిపక్ష పార్టీలతోపాటు వివేకా కుటుంబ సభ్యులు కూడా వివేకా హత్య గురించి మాట్లాడకూడదని కోర్టు  ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఎవరూ వివేకా హత్య గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడ్డం లేదు. కానీ, ఇప్పుడు వివేకా హత్య గురించి ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడే బాధ్యతను స్వయంగా జగనే తీసుకున్నారు. ఏ సభలో మాట్లాడినా వివేకా ప్రస్తావన తప్పకుండా తెస్తున్నారు. చిన్నాన్నకి రెండో భార్య వున్నట్టు అందరికీ తెలుసు కదా అని జనంతో అంటున్నారు. అవినాష్ రెడ్డి చాలా అమాయకుడు అన్నట్టు సర్టిఫికెట్ ఇస్తున్నారు. కోర్టు వివేకా హత్య గురించి ప్రతిపక్షాలు, షర్మిల, సునీత మాట్లాడవద్దని అన్నదే తప్ప నన్ను కాదు కదా అని జగన్ భావిస్తున్నారో ఏమో. ఏది ఏమైనా వివేకా హత్య గురించి ప్రస్తావించి రాజకీయంగా లాభం పొందాలని జగన్ అనుకుంటే అది బూమ్‌రాంగ్ అవడం ఖాయం.
Publish Date: Apr 26, 2024 6:05PM

ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీకి 3 సీట్లు వ‌స్తే, ముద్ర‌గ‌డ ఇంట్లో అంట్లు తోముతా

ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం స్టార్ట్ అయింది.  ప్ర‌చారంలో ప్రధాన పార్టీల నేత‌లు మాట‌ల‌ ప‌దును పెంచుతున్నారు. రాజ‌కీయ స‌వాళ్ళు, ప్ర‌తిస‌వాళ్ళ‌తో నేత‌లు, ఓట‌ర్ల‌ను వినోదాన్ని పంచుతున్నారు. “హాష్ ట్యాగ్ బ్యాండైడ్ ఛాలెంజ్” పేరుతో ట్విట్టర్ లో ఛాలెంజ్ విసురుకుంటున్నారు. టీడీపీ నేటిజన్లు జగన్ బ్యాండేజ్ సైజు పెరిగిందంటూ పోస్టులు పెడుతున్నారు. జగన్ ఇకపై ఆ బ్యాండేజ్ తీసేస్తేనే బెటర్, లేకపోతే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉందని  వైఎస్ వివేకా కుమార్తె సునీత ట్వీట్ చేశారు. ఇదే విషయం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ట్విట్టర్ లో స్పందించారు. "2014, 2019 ఎన్నికల్లో శవరాజకీయాలతో నెట్టుకొచ్చిన జగన్... ఈసారి ఒక డ్రామాతో వచ్చాడు. కనపడని ఒక గులకరాయి తగిలిందంట. బ్యాండ్ వేసాడు. రోజురోజుకు ఆ బ్యాండ్ పెద్దదవుతోంది. మే 13 ఎన్నికల రోజు వరకు డ్రామా ఆడిస్తానే ఉంటాడు ఈ నాటకాల రాయుడు" అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు!  మరోపక్క టీడీపీ శ్రేణులు పోస్టులు పెడుతున్నారు. ఈ నెల 13న బ్యాండేజ్ సైజు చిన్నగా ఉంది.. ప్రస్తుతం అది పెద్దగా అయ్యింది అంటూ... “హాష్ ట్యాగ్ బ్యాండైడ్ ఛాలెంజ్” పేరుతో ట్విట్టర్ లో ఛాలెంజ్ విసురుకుంటున్నారు. అయితే నేను వున్నాను. న‌న్ను గుర్తించండి అంటూ థర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ, టాలీవుడ్ న‌టుడు పృథ్వీ రాజ్ ఓ ఛాలెంజ్ విసిరారు. జ‌న‌సేన త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తూ ముద్ర‌గ‌డ‌ను ల‌క్ష్యంగా  చేసుకొని ఆయ‌న విమ‌ర్శ‌లు చేసారు.  ముద్రగడ కాపు ఉద్య‌మ నాయ‌కుడిగా ప్ర‌స్థానం ప్రారంభించి, ఇప్పుడు రెడ్డి ఉద్య‌మ నాయ‌కుడిగా, రెడ్డి సేవ‌కుడిగా మారార‌ని ఆరోపించారు.  కిర్లంపూడి లో కూర్చుని క‌బుర్లు చెబుతున్న ముద్ర‌గ‌డ‌ త‌న ప‌రిశ్ర‌మ‌ల‌కు, రైస్ మిల్లుల‌కు ఉన్న విద్యుత్ బ‌కాయిలు ఎంతో చెప్పాల‌ని ఆయన డిమాండ్ చేశారు. ఉత్త‌రాంధ్ర లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ కనీసం మూడు సీట్లు కూడా గెలిచే ప‌రిస్థితి లేద‌న్నారు. ఒక‌వేళ మూడు సీట్లు వైసీపీ గెలిస్తే మాత్రం నేను ఆయన ఇంట్లో అంట్లు తోముతాన‌ని అన్నారు.  ప్రస్తుతం ముద్ర‌గ‌డను ప‌ట్టించుకునేవారు, న‌మ్మేవారు ఎవ‌రూ లేర‌ని పృథ్వీ గట్టిగా చెబుతున్నారు. మెగా కుటుంబంలో చిరంజీవి, రామ్‌చరణ్ స‌హా ప‌లువురు కూటమికి మద్దతుగా ప్ర‌చారం చేసేందుకు త్వ‌ర‌లోనే రాబోతున్నాట‌. అలాగే సీఎం జ‌గ‌న్‌పై కూడా పృథ్వీ విమ‌ర్శ‌లు చేసారు. అయితే దీనిపై వైసీపీ నాయ‌కులు స్పందించారు.  ఉత్తరాంద్ర లో వైసీపీ గెలవడం పక్కా అని,  తాను చెప్పినట్లు అంట్లు తోమాడానికి గిన్నెలు కూడా రెడీగా ఉన్నాయని వైసీపీ నాయకులు అంటున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: Apr 26, 2024 6:03PM

జేడీ లక్ష్మీనారాయణని ఎవరు హత్య చేయాలనుకుంటున్నారు?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన రాజకీయ ఉత్కంఠ, టెన్షన్ భరిత వాతావరణం చాలదన్నట్టుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అగ్నిలో ఆజ్యం పోశారు. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించి, విశాఖ ఉత్తర స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయన పార్టీకి ఎన్నికల కమిషన్ టార్చ్ లైట్ గుర్తును కేటాయించింది. లక్ష్మీనారాయణ గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వణుకుపుట్టేలా వున్నాయి. విశాఖపట్టణంలో పోటీ చేస్తున్న తనను చంపడానికి కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. తనకు ప్రాణహాని వుంది కాబట్టి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జేడీ లక్ష్మీనారాయణ తనకు ప్రాణహాని వుందని అన్నారు తప్ప, తనకు ఎవరి ద్వారా ప్రాణహాని వుందో చెప్పడం లేదు. ఆయన ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆరోపణలు చేశారో కూడా అర్థం కాకుండా వుంది.  గతంలో జగన్‌ని జైలుకు పంపిన సీబీఐ మాజీ అధికారి లక్స్మీనారాయణ. అప్పటి నుంచి ఆయనకు ఒక హీరో వర్షిప్ వచ్చింది. తమ నాయకుడి చేత చిప్పకూడా తినిపించారు కాబట్టి వైసీపీ మూకలకు ఆయన మీద కోసం వుంటుంది కాబట్టి వారు హత్యాయత్నం చేసే అవకాశం వుందా అనే అనుమాలు కలగడం సహజం. అయితే జేడీ ఆ పరిస్థితి నుంచి ఏనాడో బయటపడిపోయారు. ఆమధ్య జగన్ ప్రభుత్వాన్ని, జగన్ బుర్రలోంచి ఊడిపడ్డ పరమ శుద్ధ దండగ వాలంటీర్ వ్యవస్థని ఆకాశానికి ఎత్తేయడం ద్వారా ఆయన వైసీపీ వర్గాలకు అస్మదీయుడిగా మారారు. మరి ఇప్పుడు  ఆయన్ని చంపాల్సిన అవసరం ఎవరికి వుంది? నన్ను హత్య చేయాలని చూస్తున్నారు. రక్షణ కల్పించడం అని కాకుండా, మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆయన తనను ఎవరు చంపాలని అనుకుంటున్నారో క్లియర్‌గా బయట పెట్టాలి. అంతే తప్ప అర్ధోక్తిలో స్టేట్‌మెంట్లు ఇచ్చి జనాల్లో లేనిపోని అనుమానాలు కలిగేలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు.
Publish Date: Apr 26, 2024 5:43PM

వంశీకి దింపుడు కళ్లెం ఆశకూడా మిగల్లేదుగా?

 వల్లభనేని వంశీ  నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఓటమిని అంగీకరించేశారా? అంటే పరిశీలకలు ఔననే అంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించడం ద్వారా తనకు గెలుపు ఆశలు ఆవిరి అయిపోయాయని చెప్పకనే చెప్పేశారు.  అలా చెప్పేస్తూనే ఏదో ఓ మేరకు సానుభూతి ఓట్లను రాబట్టుకోవడానికి చివరి ప్రయత్నం కూడా చేశారు. గన్నవరం నుంచి ఇక తాను పోటీ చేయనని చెప్పిన వల్లభనేని వంశీ.. వచ్చే ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి దుట్టారామచంద్రరావు కుమార్తె పోటీ చేస్తారనీ, తాను ఆమెకు మద్దతు ఇస్తానని చెప్పారు. ఇదంతా ఆయన ఎన్నికల నిమినేషన్ ర్యాలీ వెలవెలబోయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ వంశీ పలికిన పలుకులు.  దుట్టారామచంద్రరావు కుమార్తెకు వచ్చే ఎన్నికలలో మద్దతు ఇస్తానంటూ వంశీ చెప్పడం వెనుక ఈ ఎన్నికలో దుట్టా వర్గం కనీసం ఇప్పటికైనా తనకు మద్దతుగా చురుగ్గా పని చేస్తుందన్న చివరి ఆశ ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే వైసీపీలో వంశీకి మద్దతు కరవైంది. తెలుగుదేశం పార్టీలో ఉండగా వంశీ అనుచరులుగా ఉన్నవారిలో 90 శాతం మందికి పైగా ఆయన తెలుగుదేశం వీడగానే ఆయనకు దూరం అయ్యారు. ఇక వైసీపీ నుంచి తెలుగుదేశం గూటికి చేరి గన్నవరం తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు వెంట ఆయన అనుచరవర్గమంతా టీడీపీ పంచన చేరిపోయింది. ఇక నియోజకవర్గంలో బలమైన దుట్టా రామచంద్రరావు వంశీకి మద్దతుగా పని చేయడానికి ససేమిరా అంటున్నారు.  ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి వంశీ చేసినదేమీలేదన్న ఆగ్రహం నియోజకవర్గ ప్రజలలో బలంగా కనిపిస్తోంది.   అది వంశీ నామినేషన్ ర్యాలీలో ప్రస్ఫుటంగా కనిపించింది. తీసుకువచ్చిన కూలి జనం కూడా మధ్యలోనే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయారు. అదే తెలుగుదేశం అభ్యర్థిగా యార్లగడ్డ నామినేషన్ ర్యాలీ కళకళలాడింది. భారీ జనసందోహంతో  జైజై ధ్వానాలతో ఆ ర్యాలీ సాగింది. జనం స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో  వంశీకి పరిస్థితి అర్ధమైంది.  దుట్టాను శరణుజొచ్చారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయను.. మీ కుమార్తెకే మద్దతు ఇస్తానంటూ బతిమలాడుతున్నారు. అయితే ఇప్పటికే పరిస్థితి చేయిజారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దుట్టా మెత్తబడినా ఆయన వర్గం మాత్రం వంశీకోసం పని చేసే పరిస్థితి లేదని సోదాహరణంగా వివరిస్తున్నారు.  మొత్తం మీద వంశీకి గెలుపుపై దింపుడు కళ్లెం ఆశకూడా మిగలలేదని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. 
Publish Date: Apr 26, 2024 4:36PM

జగన్ మీద హైపర్ ఆది వేసిన పంచ్‌ల లిస్టు!

జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కమెడియన్ హైపర్ ఆది ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా హైపర్ ఆది వేస్తున్న పంచ్‌లు అదరిపోతున్నాయి. ఆది స్పీచ్‌లకు ప్రజల నుంచి విశేష ప్రతిస్పందన లభిస్తోంది. ఇదిగో హైపర్ ఆది జగన్ బ్యాచ్ మీద వేస్తున్న పంచ్‌ల లిస్టు.. 1. కూటమిని చూసి వైసీపీ వాళ్ళు భయపడిపోతున్నారు. కానీ, పైకి మాత్రం సింహం సింగిల్‌గా వస్తుంది అంటున్నారు. మరి 2014లో కూడా సింహం సింగిల్‌గా వచ్చింది కదా.. మరి ఎందుకు ఓడిపోయింది? ఈసారి కూడా అదే కూటమి ఏర్పడింది.. ఈసారి కూడా కూటమికి అదే విజయం.. వైసీపీ అదే ఓటమి దక్కుతుంది. 2. షూటింగ్‌లన్నీ ఆపుకుని ప్రచారానికి వచ్చాను.. అక్కడ షూటింగ్‌లు లేకపోయినా.. ఇక్కడ కూటమికి వ్యతిరేకంగా వుండే వాళ్ళని మాటలతో షూట్ చేయడం కంటిన్యూ అవుతుంది. 3. కమెడియన్ ప్రచారానికి వచ్చాడని వైసీపీ వాళ్ళు అంటున్నారు.. నేను ప్రొఫెషనల్‌గానే కమెడియన్‌ని.. వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్‌ని కాదు. 4. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు అంటూ వైసీపీ వాళ్ళు ఊదరగొడుతున్నారు. రెండు చోట్ల ఓడిపోయినా ఎంతోమంది కష్టాన్ని తీర్చాడు.. అదే ఆయన గెలిస్తే, ప్రజల కష్టం కాంపౌండ్ దాటకుండా చూసుకుంటాడు. 5. రికార్డులు కొల్లగొట్టడానికో, ఆస్తులు కూడబెట్టుకోవడానికో సినిమాలను ఒప్పుకునే హీరోలను చూసి వుంటాడు.. కానీ, కౌలు రైతుల కష్టాలు తీర్చడానికి సినిమా ఒప్పుకున్న హీరో పవన్ కళ్యాణ్. 6. ఆయన ప్రెజెంట్ ఆస్తి ఎంత వుంటుందో తెలుసా? నాకు తెలిసి ఈ స్టేజీ మీద వున్న నాయకుల ఆస్తికంటే తక్కువే వుంటుంది. ఎందుకంటే, వచ్చింది వచ్చినట్టు పంచుకుంటూ వెళ్ళడమే తప్ప, డబ్బులు పెంచుకుంటూ వెళ్ళే మనస్తత్వం ఆయనకి లేదు. 7. వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికి రెడీగా వుంటారు. వాళ్ళకి పవన్ కళ్యాణ్‌ని తిట్టే శాఖ అని పేరు పెట్టుకుంటే సరిపోతుంది. 8. వారాహి బండి యాత్ర ఆపేస్తారా? ఆయనకి తిక్కరేగితే పాదయాత్ర చేస్తాడు.. అప్పుడు మీ పని కాశీ యాత్రే. 9. పవన్ కళ్యాణ్ జనాల పక్షాన వున్నాడు కాబట్టే జనసేనానిగా వున్నాడు. మీరు ఇలాగే విసిగిస్తే ‘వీరమల్లు’ బయటకి వస్తాడు.. జాగ్రత్త. 10. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ కాదురా.. ప్రేమకు లొంగే స్టార్.. 11. దత్తపుత్రుడు.. దత్తపుత్రుడు అన్న నోళ్ళతోనే అంజనీ పుత్రుడు అనిపించుకునే రోజు వస్తుంది. 12. మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీని దెబ్బతీసేలా మాట్లాడారా? ఈసారి జనసేన కొట్టే దెబ్బకి మీ అబ్బ గుర్తొస్తాడు. 13. 151 మంది ఒక్కడికి భయపడిపోతున్నారు. 14. పవన్ కళ్యాణ్‌ది నిలకడలేని రాజకీయం కాదు.. నిఖార్సైన రాజకీయం.
Publish Date: Apr 26, 2024 3:55PM