ఇంత కాలానికి అంబటి రాంబాబు జగన్ గుడ్ లుక్స్ లోకి వచ్చేశారు. అవును ఇప్పుడు వైసీపీలో ఇదే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ కు ఎంతో ఇష్టమైన బూతుపురాణాన్నివినిపించిన అంబటికి ఇక ఇప్పుడు పార్టీలో పదోన్నతి, కీలక స్థానం ఖాయమన్న భావన పార్టీలో వినిపిస్తోంది. పైగా వైసీపీ ఎకో సిస్టమ్ లో జగన్ దృష్టిలో పడాలన్నా, ఆయన మెప్పు పొందాలన్న ప్రత్యర్థి పార్టీల నాయకులపై బూతులతో విరుచుకుపడాలి. లేదా వారి ఇళ్లపై దాడులకు పాల్పడాలీ, అదీ కాకపోతే ప్రత్యర్థి పార్టీల కార్యాలయాలను దగ్ధం చేయాలి. వైసీపీ అధికారంలో ఉండగా దాదాపు ఇలాంటి పనులే చేసి జోగి రమేష్ మంత్రిపదవి పొందారు. కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు జగన్ కు అత్యంత నమ్మకస్తులుగా మారారు. తెలుగుదేశం నుంచి వలస వచ్చిన వల్లభనేని వంశీ జగన్ కు అస్మదీయుడయ్యారు. ఇక అంబటి రాంబాబు, పేర్ని నాని కూడా జగన్  అధికారంలో ఉన్నప్పటి నుంచీ ఆయన మెప్పు కోసం సొంత సామాజికవర్గాన్ని కూడా కించపరుస్తూ జనసేనాని పవన్ పై దూషణలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే వారిరువురికీ జగన్ కేబినెట్ లో స్థానం దక్కింది.  ఇక నగరి మాజీ ఎమ్మెల్యే రోజా సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  జగన్ వైసీపీ లో రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చేసి హద్దులు మీరి బూతులు, దాడులు, దౌర్జన్యాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడిన వారందరికీ అందలాలు దక్కాయి. పదవుల తాయిలాలు అందాయి. అధికారం కోల్పోయిన తరువాత  అప్పట్లో హద్దులు మీరి చెలరేగిన వారిలో చాలా మంది జాగ్రత్తపడో, భయపడే నోటికి తాళాలు వేసేసుకున్నారు. కానీ అప్పటి కంటే ఎక్కువగా చెలరేగిపోతున్న అంబటి రాంబాబు  ఇప్పుడు జగన్ మెప్పు పొదారనీ వైసీపీలో చర్చ జరుగుతోంది. ఆయనకు పార్టీలో కీలక స్థానం ఖాయమన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అయితే తన బూతులతో అంబటి రాంబాబు జనం దృష్టిలో మరింత దిగజారిపోయారని పరిశీలకులు అంటున్నారు. అయితే జగన్  మెప్పు ముందు ప్రజల దృష్టిలో దిగజారడం ఏమంత విషయం కాదని వైసీపీయులు అంటున్నారు. ఇప్పుడు పార్టీలో చర్చ అంతా అంబటికి పార్టీలో దక్కే కీలక స్థానం ఏమిటన్నదే అని అంటున్నారు. అన్నిటికీ మించి తెలుగుదేశం కూటమిలో చీలకలు తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్న జగన్ కు జనసేనాని పవన్ కల్యాణ్ సామాజిక వర్గానికి చెందిన అంబటికి పార్టీలో కీలక పదవి ఇవ్వడం కలిసొచ్చే అంశంగా మారుతున్నంద ఆశా ఉందని అంటున్నారు. 
బూతులు, దూషణలు వైసీపీ ఎకో సిస్టమ్ లో భాగంగా మారిపోయాయి. అయితే అలా నోరు పారేసుకునే వారిలో చాలా మంది అనూహ్యంగా సైలెంటైపోయారు. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత వైసీపీలో బ్యాడ్ మౌత్ లీడర్లలో చాలా మంది మౌనమే నా భాష అన్నట్టుగా మారిపోయారు. ఇందుకు కారణాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీ అధికారంలో ఉండగా నోరెట్టుకు పడిపోవడమే కాకుండా... ఇష్టారీతిగా దౌర్జన్యాలు, దాడులు, కబ్జాలకు పాల్పడిన నేపథ్యంలో వారిప్పుడు పీకల్లోతు కేసుల్లో మునిగిపోయి ఉండటమే. మౌనంగా ఉంటే మేలు.. బయటకు వచ్చి కేసుల చిక్కులను కోరి ఆహ్వానించడం ఎందుకన్న ధోరణి వారిలో కనిపిస్తోంది. అయితే వైసీపీలో అంబటి రాంబాబురూటే సెపరేటు.  ఆయనకు నోటిని అదుపులో పెట్టుకోవడం అన్న సంగతి తెలియదు. జగన్ మెప్పు కోసం, జగన్ ప్రశంస కోసం ఏమైనా చేస్తారన్న పేరుంది. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో  అంబటి రాంబాబు జట్టుకు రంగు వేయించు కోకపోవ డానికి జగన్ కు నలుపు రంగు అంటే ఇష్టం లేకపోవడమే కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు కూడా జుత్తుకు రంగు వేసుకోవడం లేదనుకోండి.. జగన్ కు అప్పుడు ఇష్టం లేని నల్ల రంగు ఇప్పుడు ఎందుకు ఇష్టం అవుతుందన్న అభిప్రాయం కావచ్చు. అది పక్కన పెడితే తాజాగా గత నాలుగు రోజులుగా ఏపీలో అంబటి వ్యవహారమే పెద్ద చర్చగా, రచ్చగా ఉంది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై నోరు పారేసుకున్నందుకు ఆయనపై కేసులు నమోద య్యాయి. అరెస్టై రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.  అంబటి అరెస్టు నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ రోడ్డు మీదకు వచ్చారు. రాజమహేంద్రవరం వెళ్లి అంబటిని పరామర్శించలేదు కానీ, గుంటూరు వచ్చి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటానని చెప్పడమే కాకుండా... అంతకు అంతా బదులు తీర్చుకుంటామంటూ చంద్రబాబు, తెలుగుదేశంలకు వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. ఇక్కడ వైసీపీయులలోనే ఒక సందేహం వ్యక్తం అవుతోంది. జగన్ సరే గుంటూరు వచ్చి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి రాజకీయమైలేజీ కోసం చేయగలిగినంత చేసి వెళ్లారు. మరి పార్టీలో మిగిలిన వారి సంగతేంటి? బూతుపురాణాల స్పెషలిస్టుగా పేరుపొందిన మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అంబటికి మద్దతుగా కనీసం గొంతు కూడా సవరించుకోలేదేంటి? అన్న ప్రశ్నలు వైసీపీ శ్రేణుల నుంచే వినవస్తున్నాయి. అలాగే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏమయ్యారు? కనీసం అంబటికి మద్దతుగా ఒక్క ప్రకటన చేయడానికి కూడా వారికి ఎందుకు మనసు రావడం లేదు?   సాక్షాత్తూ పార్టీ అధినేత గుంటూరు వచ్చి ర్యాలీ నిర్వహిస్తే కనీసం అటువైపు తొంగి చసేందుకు కూడా వారు ఎందుకు ధైర్యం చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అధికారంలో ఉండగా హద్దూపద్దూ లేకుండా బూతుపురాణంతో రెచ్చిపోయిన ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి,  జగన్ హయాంలో పార్టీలో, ప్రభుత్వంలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇలా అధికారంలో ఉండగా రెచ్చిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదెందుకని అని వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.   ఇప్పుడు వైసీపీలో గొంతు వినిపిస్తున్న వారు అంబటి, పేర్ని నాని, జోగి రమేష్ లు మాత్రమే. అంబటికి మద్దతుగా పేర్నినాని, జోగి రమేష్ లు మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు వీరే వైసీపీ ఎకో సిస్టమ్ లోని బూతుల పారాయణాన్ని కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోందన్న చర్చ రాజకీయవర్గాలలో జరుగులోంది. 
  తెలుగువన్ వాస్తవ వేదిక పదకొండవ సంచికలో ఘాటైన చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయాలపై నిర్మోహమాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్‌కు పాదయాత్ర చేయనిస్తారా? అనే ప్రశ్నను కంఠంనేని రవిశంకర్ లేవనెత్తారు. దీనికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్, చంద్రబాబు డిక్టేటర్ కాదు… డెమోక్రాట్ అని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేయలేదని  గుర్తుచేశారు. జగన్ బూచీ చూపిస్తే ఓట్లు పడతాయని చంద్రబాబు, లోకేశ్ భావిస్తున్నారని కొందరు అంటున్నారని పేర్కొన్నారు. అలాగే ఆర్గానిక్ నేతలకు ఇన్‌ఆర్గానిక్ పదవులు లేవని, జ్యోతీబసు, బుద్ధబట్టాచార్య వంటి వారు వేరే పార్టీలోకి వెళ్లలేదని డోలేంద్ర ప్రసాద్ తెలిపారు. తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు స్పష్టమైన సిద్ధాంతాలు లేవని ఆయన విమర్శించారు. మరోవైపు, వైసీపీ నాయకులు మాయలో ఉన్నారని, ఇసుక దందాలు, గనుల వ్యవహారాల్లో.. దేశంలో ఒక రకం న్యాయం, పేదలకు మరో రకం న్యాయం ఉందా? అని రవిశంకర్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు అరెస్టులు చేస్తే ప్రజల్లో సానుభూతి కలుగుతుందని పార్టీలు భావిస్తున్నాయని కూడా చర్చలో ప్రస్తావన వచ్చింది. ఈ వంటి అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.
ALSO ON TELUGUONE N E W S
  తారాగణం: అభిషన్ జీవింత్, అనస్వర రాజన్‌, హరీష్ కుమార్, కావ్య అనిల్, సచిన్ నాచియప్పన్, థేని మురుగన్, శరవణన్, ఆర్జే అనంతి డీఓపీ: శ్రేయాస్ కృష్ణ ఎడిటింగ్: సురేష్ కుమార్ సంగీతం: షాన్ రోల్డాన్ కథ, దర్శకత్వం: మధన్ నిర్మాతలు: సౌందర్య రాజినీకాంత్, పసిలియన్ నజరత్, మగేష్ రాజ్ పసిలియన్ విడుదల తేదీ: ఫిబ్రవరి 6, 2026    ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంతో దర్శకుడిగా ప్రశంసలు పొందిన అభిషన్ జీవింత్, ఇప్పుడు హీరోగా ‘విత్ లవ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయనకు జోడీగా మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న అనస్వర రాజన్ నటించింది. సౌందర్య రాజినీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ప్రేమ, జ్ఞాపకాలు, పాత క్రష్‌ల నేపథ్యంతో సాగే ఈ రొమాంటిక్ డ్రామా ఎలా ఉందో చూద్దాం. (With Love Movie Review)   కథ: పెళ్ళిపై ఆసక్తి లేని సత్య( అభిషన్ జీవింత్), తన సోదరి కారణంగా అనుకోకుండా పెళ్ళి చూపుల కోసం మోనిషా (అనస్వర రాజన్)ను కలుస్తాడు. అలా కలిసిన తర్వాత వాళ్లిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారని.. సీనియర్, జూనియర్ అని తెలుసుకుంటారు. అలా మాటల్లో స్కూల్ లవ్ స్టోరీలు షేర్ చేసుకుంటారు. స్కూల్ టైంలో తమ ప్రేమని వ్యక్తపరచలేకపోవడంతో ఆ క్రష్ లను ఇప్పుడు కలవాలి అనుకుంటారు. పాత జ్ఞాపకాలను వెలికితీస్తూ మొదలైన వీరి ప్రయాణం ఎలా సాగింది? పాత ప్రేమలు పట్టాలెక్కాయా లేక కొత్త ప్రేమలు చిగురించాయా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.   విశ్లేషణ: నటుడిగా అభిషన్ జీవింత్ మంచి ప్రదర్శన ఇచ్చాడు. స్కూల్ బాయ్ లుక్‌లోనూ, పెళ్లికి సిద్ధమైన యువకుడి పాత్రలోనూ సహజంగా కనిపించాడు. అతని కళ్లలో భావాలు బాగా పలికాయి. ఈ ప్రేమకథలో అతని ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. అనస్వర రాజన్ పాత్ర తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి. మలయాళంలో చేసిన కొంత సీరియస్ పాత్రలకంటే, ఈ చిత్రంలో ఆమె బబ్లీ పాత్రలో ఎంతో చురుకుగా, సహజంగా కనిపించింది. సున్నితమైన భావోద్వేగాలను ఆమె చక్కగా పలికించింది. కొన్నిసార్లు అభిషన్ కంటే కూడా అనస్వర తనదైన చమత్కారం, చురుకుదనంతో సన్నివేశాలకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. అభిషన్-అనస్వర మధ్య కెమిస్ట్రీ ఈ సాధారణ కథనాన్ని కూడా తాజాగా, ఆసక్తికరంగా మార్చింది. అయితే కొన్ని చోట్ల కథను వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో.. మరికొన్ని మధుర క్షణాలను నిర్మించే అవకాశమున్నా, అలాంటి ప్రయత్నం చేయకుండా.. వేరే సన్నివేశానికి తొందరపడుతున్నట్లు అనిపిస్తుంది. సన్నివేశాల్లో ఆ తొందరపాటు చూపించకుండా మరిన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ క్రియేట్ చేసి ఉంటే సినిమా మరింత ప్రత్యేకంగా నిలిచేది. నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలు బాగున్నాయి. పెద్దగా కొత్తదనం లేకపోయినా, ఒక సరళమైన ప్రేమకథను సున్నితంగా చూపించడంలో చిత్ర బృందం విజయం సాధించింది. ఇది సంచలనం సృష్టించగలిగే సినిమా కాకపోయినా, భారీ భావోద్వేగాలతో నిండిన సినిమా కాకపోయినా.. నిజాయితీగా, సహజంగా, సరదాగా అనిపించే క్షణాలను అందిస్తుంది. కథలోని మలుపులు ఊహించగలిగేవే అయినప్పటికీ, ప్రధాన తారాగణం మధ్య కెమిస్ట్రీ, సహజత్వం ఈ సినిమాను ప్రధాన బలంగా నిలిచాయి. తొలి ప్రయత్నమే అయినప్పటికీ దర్శకుడు మధన్‌ ఓ అందమైన చిత్రాన్ని అందించాడు.    ఫైనల్ గా.. కథాకథనాలు గొప్పగా లేకపోయినా నిజాయితీగా, సహజంగా సాగే రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.   రేటింగ్: 2.75/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.  
నటీనటులు: సారా అర్జున్, భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, ఆదర్శ్ బాలకష్ణ తదితరులు సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె.పోతన్ ఎడిటింగ్: ప్రవీణ్ పూడి సంగీతం: కాలభైరవ సమర్పణ: శ్రీమతి రాగిణి గుణ నిర్మాతలు: నీలిమ గుణ, యుక్తా గుణ బ్యానర్: గుణ హ్యాండ్‌మేడ్ ఫిలింస్ రచన, దర్శకత్వం: గుణశేఖర్ విడుదల తేదీ: 06.02.2026 సినిమా నిడివి: 162.54 నిమిషాలు మారుతున్న కాలాన్ని బట్టి నేరాలు, వాటి తాలూకు ప్రభావాలు కూడా మారుతూ వస్తున్నాయి. ఒకప్ప్పుడు మైనర్లు నేరాలు చెయ్యడం, జైలుకు వెళ్లడం వంటివి చాలా తక్కువగా కనిపించేవి. ఇటీవలికాలంలో దాని తాలూకు శాతం బాగా పెరిగిందని చెప్పాలి. పిల్లలు ఇలా దారి తప్పి ప్రవర్తించడానికి, నేరాలు చేయడానికి కారణం ఎవరు అని ప్రశ్నించుకుంటే మొదట వారి తల్లిదండ్రులే కనిపిస్తారు. పిల్లల్ని బాధ్యత గల పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత వారిదే అనే సమాధానం వస్తుంది. ఇదే పాయింట్‌తో డైరెక్టర్ గుణశేఖర్ ‘యుఫోరియా’ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే గాడి తప్పిన అతని కెరీర్‌ని మళ్లీ ట్రాక్‌లోకి తెచ్చుకునేందుకు ఓ కొత్త ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఈ సినిమాతో గుణశేఖర్ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోగలిగారా? సినిమాని ప్రేక్షకులకు కనెక్ట్ చెయ్యడంలో సక్సెస్ అయ్యారా? అనేది చూద్దాం.  కథ: చైత్ర(సారా అర్జున్) 18 ఏళ్ళు కూడా నిండని ఓ అమ్మాయి. ఐఎఎస్ ఆఫీసర్ అవ్వాలన్నది ఆమె కల. ఈకాలం టీనేజర్స్‌కి ఉండే కొన్ని లక్షణాలు ఆ అమ్మాయి దగ్గర లేవు. తన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఎప్ప్పుడూ చదువు మీదే ధ్యాస పెడుతుంది. ఒకరోజు మధ్యాహ్నం స్నేహితురాలి ఆహ్వానం మేరకు ‘ఆంబ్రోసియా’ అనే పబ్‌లో జరుగుతున్న ‘యుఫోరియా’ ఈవెంట్‌కి వెళుతుంది. ఆ స్నేహితురాలి ద్వారా ఐదుగురు హైఫై కుర్రాళ్లు పరిచయమవుతారు. పార్టీ తర్వాత చైత్రను కారులో ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యడానికి బయల్దేరతారు. దారిలో ఆమెకు డ్రగ్స్ ఇచ్చి ఆ ఐదుగురు ఫ్రెండ్స్ ఆమెను దారుణంగా రేప్ చేస్తారు. ఆ తర్వాత పోలీస్ కేసు, కోర్టు తదితర ప్రాసెస్ అంతా జరుగుతుంది. ధనవంతుల కుటుంబాలకు చెందిన ఆ కుర్రాళ్లు చేసిన నేరం ప్రూవ్ అయ్యిందా? వారిని కోర్టు శిక్షించిందా? తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనేది మిగతా కథ.  విశ్లేషణ:  ఒక అమ్మాయిని రేప్ చేయడం, ఆ తర్వాత పోలీసులు, కోర్టు, శిక్షలు.. ఇది చాలా సినిమాల్లో మనం చూసిన కథే. యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు ముందే చెప్పాడు. అయితే దాన్ని ఈ సినిమాలో కొత్తగా ఎలా చెప్పారు? ఇందులో తీసుకున్న కొత్త పాయింట్ ఏమిటి? అంటే.. పిల్లలు నేరం చేస్తే వారి తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుంది అనే పాయింట్‌పైన ఈ కేసులో ప్రధాన నిందితుడైన వికాస్(విఘ్నేష్ గవిరెడ్డి) తల్లి వింధ్య(భూమిక చావ్లా) తను నేరం చేశానని, తనని శిక్షించమని కోర్టుకెక్కుతుంది. ఈ అంశంతోనే సినిమా ప్రారంభమవుతుంది. నేరం జరిగిన తర్వాత చైత్ర ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని చెప్పిన విధానం, దాన్ని చూపించిన తీరు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది, నేరస్తులపై విపరీతమైన కోపం తెప్పిస్తుంది. ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్ని నిమిషాల్లోనే అసలు కథలోకి వెళ్లిపోయాడు డైరెక్టర్. అక్కడి నుంచి ఫస్ట్‌హాఫ్ వరకు నెక్స్‌ట్ ఏం జరగబోతోంది అనే క్యూరియాసిటీ కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. ఒక విధంగా నేరస్తులకు శిక్ష పడడంతో సినిమా అయిపోయిందా అనిపిస్తుంది. కానీ, అది ఫస్ట్‌హాఫ్. ఇక సెకండాఫ్‌కి వచ్చేసరికి ఫస్ట్‌హాఫ్‌లో ఉన్నంత స్టఫ్ సెకండాఫ్‌లో కనిపించదు. డ్రగ్స్, జైలు సన్నివేశాలు, కొడుకుని పెరోల్‌పై తీసుకొచ్చి ఎగ్జామ్ రాయించాలనుకున్న భూమిక అందులో ఫెయిల్ అయి మందుకు బానిస కావడం, జైల్లోనే వికాస్‌పై పగ పెంచుకున్న ఒక సైకో కిల్లర్ వికాస్‌ని చంపాలని ప్రయత్నించడం.. ఇవన్నీ అసలు కథను మరింత పెంచడానికి చేసిన సీన్స్‌లా అనిపిస్తాయి తప్ప ఏమాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవు. ఇక ప్రీ క్లెíమాక్స్, క్లెíమాక్స్ మాత్రం  అద్భుతంగా రాసుకున్నారు. అంతేకాదు, విజువల్‌గా కూడా ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా, ఎమోషనల్ అయ్యేలా చూపించారు. ఎలాంటి వారికైనా క్లెíమాక్స్ కంటతడి పెట్టిస్తుంది.  నటీనటులు: ఈ సినిమాలో ప్రధానంగా కనిపించే క్యారెక్టర్లు వికాస్, వింధ్య, చైత్ర. ఈ పాత్రలు పోషించిన విఘ్నేష్, భూమిక, సారా అర్జున్.. వారి వారి క్యారెక్టర్స్‌కి పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా అందరి కంటే విఘ్నేష్ తన క్యారెక్టర్‌లో జీవించాడని చెప్పాలి. ఈ సినిమా ద్వారా దాదాపు 10 మంది కొత్తవారిని పరిచయం చేశారు గుణశేఖర్. అయితే పెర్‌ఫార్మెన్స్ పరంగా అందరికీ మంచి మార్కులు పడతాయి. ప్రతి ఒక్కరూ మంచి పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. పోలీస్ ఆఫీసర్ జయదేవ్‌గా గౌతమ్ మీనన్ కూడా ఎంతో డిగ్నిఫైడ్‌గా కనిపించారు.  సాంకేతిక నిపుణులు: టెక్నికల్‌గా ఈ సినిమాకి ఫోటోగ్రఫీ పెద్ద ప్లస్ అని చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రవీణ్ పోతన్ కెమెరా వర్క్ చాలా బాగుంది. అందులో కొన్ని రిస్కీ షాట్స్ కూడా ఉన్నాయి. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. పార్టీకి సంబంధించిన సీన్స్, ఛేజింగ్ సీన్స్ కళ్లకు ఇబ్బంది కలిగించేలా ఎడిట్ చేశారు. కాల భైరవ సంగీతం ఆకట్టుకోలేకపోయింది. పాటల విషయం పక్కన పెట్టేస్తే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్నిచోట్ల బాగుంది అనిపించినా, చాలాచోట్ల రణగొణ ధ్వనులతో నిండిపోయింది. ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే.. ఫ్లాపుల నుంచి బయట పడేందుకు నానా తిప్పలు పడుతున్న గుణశేఖర్.. సొంతంగా నిర్మించిన ఈ సినిమాతో మరోసారి వార్తల్లోకి వచ్చినప్పటికీ కమర్షియల్‌గా ఆశించిన స్థాయి ఫలితం దక్కే అవకాశం లేదు. సినిమాలోని కొన్ని సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మరికొన్ని సీన్స్ పేలవంగా ఉన్నాయి. తల్లిదండ్రుల్ని బాధ్యుల్ని చేస్తూ చేసిన ఈ సినిమాలో పేరెంట్స్ కూడా చూడలేని సీన్స్ కొన్ని పెట్టారు గుణశేఖర్. వాటి వల్ల వారు కూడా సినిమా చూసే అవకాశం తక్కువ.  ఫైనల్‌గా చెప్పాలంటే.. పాయింట్ మంచిదే. కానీ, తెరపై దాన్ని చూపించిన విధానంలో ఎన్నో లొసుగులు ఉన్నాయి. ఫస్ట్‌హాఫ్ ఎంతో ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్ విషయానికి వస్తే ప్రీ క్లెíమాక్స్, క్లెíమాక్స్ వచ్చే వరకు ఆడియన్స్ బోర్ ఫీలవ్వక తప్పదు. పాత కథనే కొత్తగా చెప్పాలనుకున్న గుణశేఖర్ పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేదని చెప్పాలి.                                                                                                                                              రేటింగ్: 2.5/5                                                                                                                                                - జి.హరా Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
  Cast: Abishan Jeevinth, Anaswara Rajan, Harish Kumar, Kavya Anil, Sacchin Nachiappan, Theni Murugan, Saravanan, RJ Ananthi Crew:  Cinematography by Shreyaas Krishna Edited by Suresh Kumar Music by Sean Roldan Written & Directed by Madhan  Produced by Soundarya Rajinikanth, Pasilian Nazerath, Magesh Raj Pasilian   Abishan Jeevinth debuted with a highly appreciated and sucessful blockbuster Tourist Family as a director. Now, he debuted as an actor with his film, With Love, alongside a seasoned Malayalam sensational actress, Anaswara Rajan. Soundarya Rajinikanth has produced the film and it released, yesterday. Let's discuss about the film, in detail.    Plot:  Sathyaa (Abishan Jeevinth) is a well-performing designer, who is reclusive from his family and doesn't want to marry even when his sister forces him. But his elder sister makes him meet Monisha (Anaswara Rajan) without giving any details or a chance to refuse to meet her. He meets her and after a miscommunication with another girl, they start a cool conversation.  They understand that they are some same school and he is her senior. Both talk about their serious school crushes Anisha and Balaji, respectively. Monisha is a successful influencer but Sathyaa doesn't have any idea about it. She proposes to him a plan to meet their old school mates, track their crushes. What happens next? Will they unite or find their crushes as better life partners? Watch the movie to know more.    Analysis:  Abishan Jeevinth is good as a performer. He is believable in young school boy look and as a matured person ready for marriage. His eyes speak volumes and his expressions are spot on at all places. He has his own charm and screen presence that is pleasant to watch in this love story.  Anaswara Rajan is a revelation for Telugu and Tamil audiences who did not see her Malayalam films. She is charming in this bubbly role away from her slightly serious ones in Malayalam and effortless. She carries the dynamics of relationship on her shoulders with absolute ease. At times, more than Abishan, it is Anaswara who adds necessary intricate wit to the scenes.  We can say that both of them complicated each other well in many scenes and their chemistry makes this slightly routine plotline, a fresh and enjoyable film. We see how their journey progresses but at places it feels like there is a rush to other scene to keep the audiences interested rather than building few more moments among the leads.  This could have made the movie much better and even more special with such lively characters at play. Production values and technical standards are good enough for the film without much innovation. Still, the basics have been perfectly well executed for the film to showcase a love story to audiences With Love.  It is not a groundbreaking film or a considerably emotion heavy film about nostalgia but it offers moments that feels honest, realistic and fun to watch. While many story beats are predictable still, the chemistry, realism and believability presents the movie as a good watch from Debutant Madhan.    Bottomline:  An enjoyable rom-com that offers simple and heartfelt moments.    Rating: 2.75/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.  
  -అభిమానులకి బాధని కలిగిస్తున్న ప్రియాంక మాటలు  -ఎందుకు అలా జరిగిందంటూ కామెంట్స్  -వారణాసి పై భారీ అంచనాలు   పాన్ ఇండియా యాక్ట్రస్ అనే స్థాయి దాటి పాన్ వరల్డ్ యాక్ట్రస్ అనే స్థాయికి ఎదిగిన 'ప్రియాంక చోప్రా(Priyanka Chopra)సినీ జర్నీ తెలిసిందే. ప్రెజంట్  మహేష్ బాబు(Mahesh Babu) రాజమౌళి(ss Rajamouli)ల 'వారణాసి'(Varanasi)తో బిజీగా ఉంది. ఆ ఇద్దరు ఏరి కోరి మందాకినీ అనే క్యారక్టర్ కి ప్రియాంక ని సెలక్ట్ చేసారు. అంటే తన వల్ల వారణాసి విజయ నాదానికి ఎంత లాభం జరగబోతుందో అర్ధం చేసుకోవచ్చు. వరల్డ్ సిల్వర్ స్క్రీన్ వద్ద కూడా ప్రియాంక మాయాజాలం వారణాసి కి అదనపు ఆకర్షణ అని  చెప్పుకోవడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె చెప్పిన విషయాలు అభిమానులనే కాకుండా ప్రతి ఒక్కర్ని ఎంతో ఆవేదనకి గురి చేస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం. ప్రియాంక మాట్లాడుతు నా పాప పేరు మాల్తీ మేరీ. నెలలు నిండకుండానే మూడు నెలల  ముందుగానే మాల్తీ జన్మించింది. ఆ సమయంలో తను 765 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో కొన్ని నెలలపాటు హాస్పిటల్ లోనే ఉండాల్సి వచ్చింది. పైగా అప్పుడు కరోనా సమయం. దాంతో చావు బతుకల మధ్య మాల్తీ హాస్పిటల్ లోనే పోరాటం చేసింది. మూడు నెలల్లో ఆరు సార్లు రక్తం మార్చారు. ఆ టైంలో చాలా భయంగా బతికాం. చివరకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుని మాల్తీ క్షేమంగా బయటపడిందని ప్రియాంక చెప్పుకొచ్చింది. ఇంటర్వ్యూ సమయంలో తన భర్త నిక్ జోనస్ కూడా ప్రియాంక పక్కనే ఉన్నాడు.    Also read: Epstein files: ఎప్ స్టీన్ కుంభకోణంలో బాలీవుడ్ ప్రముఖుల పేర్లు!  అమెరికా పాప్ సింగర్ నిక్ జోనస్(Nick Jonas)ప్రియాంక కి 2018 లో వివాహం జరిగింది. ప్రియాంక కి కన్నా పదేళ్ల చిన్నవాడు. సరోగసి ద్వారా మాల్తీ మేరీ కి జన్మనిచ్చారు. అమెరికాలోనే సెటిల్ అయిన ప్రియాంక వారణాసి షూటింగ్ కోసమే ఇండియాలో ఉంది.      
  -ఇంటి నుంచి గెంటి వెయ్యవల్సిన పరిస్థితి ఏంటి  -మాధవన్ కి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది  -అసలు మాధవన్ చేసిన నేరం ఏంటి -ఆ ఇద్దరికి పెళ్లి ఎప్పుడు జరిగింది   ఆర్ మాధవన్(R Madhavan)ఈ పేరుకి సిల్వర్ స్క్రీన్ కి, సినీ ప్రియులకి ఉన్న అనుబంధం రెండున్నర  దశాబ్దాలపైనే. అంతలా హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మెప్పిస్తూ వస్తున్నాడు. మెప్పిస్తుండటమే కాదు తన చరిష్మా కి సంబంధించి ఎక్స్ పైరీ డేట్ కి నో ఛాన్స్ అంటు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. రీసెంట్ గా ఇండియన్ సినిమా గొప్పతనాన్ని చాటుతూ 1300 కోట్ల క్లబ్ లోకి చేరిన ధురంధర్(Dhurandhar)లో ఐబీ ఆఫీసర్ అజయ్ సన్యాల్ గా చేసి ప్రేక్షకులు ధురంధర్ లో లీనమయ్యేలా చేసాడు. రియల్ గా మన దేశపు ఎన్ ఎస్ ఏ ఆఫీసర్ అజిత్ దోవల్ అనే నిజమైన క్యారక్టర్ లో అత్యద్భుతంగా చేసి మాధవన్ కి ఎక్స్ పైరీ డేట్ అనేది లేదని ప్రేక్షకులు కూడా అనేలా చేస్తున్నాడు. అలాంటి మాధవన్ ని భార్య ఇంట్లో నుంచి పంపించేసిన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.   మాధవన్ రీసెంట్ గా ఒక ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూలో మాట్లాడుతు కరోనా సమయంలో ఇంట్లో ఖాళీగా ఉన్నాను. అప్పుడు నా భార్య నాతో మాట్లాడుతు నువ్వెప్పుడూ ఖాళీగా ఇంట్లోనే కూర్చోకుండా సినిమాలు, ఓటిటి ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉంటుంటావు. కానీ ఇప్పుడు  బయటకి వెళ్లినా త్వరగా వచ్చేస్తున్నావు.గతంలో ఉన్నంత ఉత్సాహం నీలో కనిపించడం లేదు. అసలు నువ్వు బాగానే ఉన్నావా! లేదా! ఎప్పటిలాగానే బయటకి వెళ్లి డబ్బు సంపాదించు అని మా ఆవిడ చెప్పింది. ఆ మాటలు నాలో ఆలోచనలు కలిగించడంతో పాటు నాపై ఎంతో ప్రభావం చూపించాయని చెప్పుకొచ్చాడు. అయితే ఇదే ఇంటర్వ్యూ లో టోటల్ గా అవే మాటల సారాంశం మొత్తాన్ని'నా భార్య కోవిడ్ సమయంలో డబ్బు సంపాదించమని ఇంట్లో నుంచి గెంటివేసిందనిగా సరదాగా చెప్పడంతో  మాటలు వైరల్ గా నిలిచాయి.   Also read:   25 రోజులకి గాను ఒరిజినల్ కలెక్షన్స్ ఇవే.. బుక్ మై షో నే సాక్ష్యం   మాధవన్ వైఫ్ పేరు సరితా బిర్జే(Sarita Birje).. 1999 లో ఆ ఇద్దరి వివాహం జరగగా మాధవన్ ఫిలిం  ఇనిస్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటున్నాడు.పెళ్లి తర్వాతనే లెజండ్రీ మేకర్ మణిరత్నం డైరెక్షన్ లో సఖి మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. జార్ఖండ్ కి చెందిన  మాధవన్ కి అదే తొలి చిత్రం. ఇక అక్కడుంచి తన ప్రభావాన్ని చాటుతూ వస్తున్నాడు. ఇటివల 2026 కి సంబంధించి ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి మాధవన్ ఎంపికైన విషయం తెలిసిందే. ఎంపిక కావడం కంటే పద్మశ్రీ నే వెతుక్కుంటూ వచ్చిందని చెప్ప్పవచ్చు. అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే ధురంధర్ పార్ట్ 2(Dhurandhar 2)తో ఈ సారి పాకిస్థాన్ లో జరపబోయే తన ఆపరేషన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మార్చి 19 న తెలియబోతుంది.  
  -అభిమానులు ఇప్పుడు ఏమంటారో  -తొలి తెలుగు చిత్రంగా నిలిచిందా! -అసలు మొత్తం కలెక్షన్స్ ఎన్ని! -ఓటిటి లోకి వస్తుందా  'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)తో చిరంజీవి(Chiranjeevi)తన సినీ కెరీర్ ని ఇప్పుడే స్టార్ట్ చేశాడా అనేలా  సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అంతలా యాక్టింగ్, డాన్స్, లుక్స్ తో రఫ్ఫాడించాడు. విక్టరీ వెంకటేష్ కూడా యాడ్ అవ్వడంతో హిట్ రేంజ్ కి సరికొత్త పదాలని కనిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మాస్ జోనర్ ని ఇష్టపడే ప్రేక్షకులని ఫ్యామిలీ ప్రేక్షకుల్లా, ఫ్యామిలీ జోనర్ ని ఇష్టపడే ప్రేక్షకులని మాస్ ప్రేక్షకులుగా కూడా మార్చివేసిన ఘనత ని మన శంకర వర ప్రసాద్ అందుకున్నాడు. మరి వాళ్లందరూ ఇంతవరకు ఏ మేర కలెక్షన్స్ ని కట్టబెట్టారో చూద్దాం. 2026 సంక్రాంతికి పర్యాయపదంలా నిలబడాలనే ఉద్దేశ్యంతో  జనవరి 12 న థియేటర్స్ లోకి అడుగుపెట్టిన మన శంకర వరప్రసాద్ గారు నిన్నటితో పాతిక రోజులని పూర్తి చేసుకుంది. ఈ మేరకు సినీ ట్రేడ్ సర్కిల్స్ లో  375 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకున్నట్టుగా న్యూస్ వినపడుతుంది. మేకర్స్ సైతం సదరు ప్రకటనపై అధికార ప్రకటన ఇచ్చేసారు. కేవలం తెలుగు లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయ్యి 375 కోట్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా కూడా మన శంకర వరప్రసాద్ నిలిచింది. ఫస్ట్ వీక్ నుంచే ఆ రికార్డుని తన పేరుపై ఉంచుకుంటు వస్తున్న విషయం తెలిసిందే. బుక్ మై షో లో ఇప్పటి వరకు 3 .6 మిలియన్ల టికెట్స్ సోల్డ్ అయ్యాయని సదరు యాప్ నిర్వాహకులు కూడా అధికారకంగా ప్రకటించారు. Also read:  టైటిల్ మార్చాలని రోడ్డు ఎక్కిన బ్రాహ్మణులు.. అందుకు అలా చేస్తున్నారు   ఇక మన శంకర వర ప్రసాద్ గారు ఓటిటి లో ఎప్పుడు అడుగుపెడ్తాడని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో స్ట్రీమింగ్ హక్కులని పొందిన  జీ 5 సంస్థ అధికారకంగా ప్రకటించకపోయినా తమ యాప్ వెబ్ సైట్ లో  ఈ నెల 11 న స్ట్రీమింగ్ కి సిద్ధం చేస్తున్నట్టుగా ఉంచింది. మరి త్వరలోనే ఓటిటి కి సంబంధించి అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి.    
  -వివాదంలో ఘూస్‌ఖోర్ పండత్ -అసలు  ఘూస్‌ఖోర్ పండత్ అనే అర్ధం ఏంటి! -ఎవరు ఎవర్ని టార్గెట్ చేశారు తెలుగు సినిమా ప్రేమికులు 'మనోజ్ బాజ్ పేయి'(Manoj Bajpayee)పేరు చెప్పగానే చాలు, విలక్షణమైన పెర్ ఫార్మెన్స్ కి పేటంట్ హక్కు తీసుకున్న యాక్టర్ కదా అంటారు. పైగా తన గురించి మనం ఏం చెప్పబోతున్నామో పూర్తిగా వినకుండానే సదరు మూవీ లవర్స్ ఎంతో ఆనందంతో 'సత్య మూవీలోని బీకు మాత్రే, ప్రేమకథ లోని శంకరం, అల్లు అర్జున్  హ్యాపీ లోని డిసిపి అరవింద్, పవన్ కళ్యాణ్  పులి లోని ఏ ఐ సలీం, వేదం లోని రహీముద్దీన్ ఖురేషి క్యారెక్టర్స్ లలో మనోజ్ బాజ్ పేయి ఒక రేంజ్ లో  చేసాడు కదా అని స్టార్ట్ చేస్తారు.ఆయన పెర్ ఫార్మెన్స్ కి   అంత రేంజ్ ఉంది. బాలీవుడ్ తో పాటు వెబ్ సిరీస్ లలో కూడా పెర్ ఫార్మెన్స్ కి ఉన్న పదును ఏ మాత్రం తగ్గకుండా అభిమానులు గర్వపడేలా రాణిస్తూ ఉన్నాడు. ఈ కోవలోనే 'ఘూస్‌ఖోర్ పండత్’(Ghooskhor Pandat)అనే మూవీతో నెట్ ఫ్లిక్స్ వేదికగా రావడానికి ముస్తాబు అవుతున్నాడు.  మూడవ తారీఖున టీజర్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ బ్రాహ్మణ కమ్యూనిటీ ఆగ్రహ జ్వాలలకి గురవుతుంది. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.   ఘూస్‌ఖోర్ పండత్.. పండత్ లేదా పండిత్ అనే వర్డ్  బ్రాహ్మణ కమ్యూనిటీ కి గుర్తింపు. ఘూస్‌ఖోర్ అంటే లంచగొండి అని అర్ధం. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ బ్రాహ్మణులని అవమానించడానికే ఈ విధమైన టైటిల్ ని ఫిక్స్ చేసారు. వెంటనే ఘూస్‌ఖోర్ పండత్ అనే టైటిల్ ని తొలగించక పోతే దేశ వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. వేరే కమ్యూనిటీ వాళ్ళకి ఈ రకమైన టైటిల్ ని ఉపయోగించగలరా! హీరో క్యారక్టర్ పేరు అజయ్ దీక్షిత్ అనే పేరు కూడా మార్చాలని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ హైకోర్ట్ లో ఈ విషయంపై బ్రాహ్మణ సంఘాలు పిటిషన్ కూడా నమోదు చేసాయి. అయితే ఇంకా ఈ ఇష్యుపై  మనోజ్ బాజ్ పేయి గాని చిత్ర బృందం గాని  స్పందించలేదు.   Also read: 16 ఏళ్ళ లోపు పిల్లల విషయంలో అందరు ఈ పని చెయ్యాలి..సోను సూద్ డిమాండ్     ఘూస్‌ఖోర్ పండత్ లో అజయ్ దీక్షిత్ అనే బ్రాహ్మణ వర్గానికి చెందిన పోలీసు అధికారి గా    మనోజ్ బాజ్‌పేయి చేస్తున్నాడు.దీక్షిత్ ముద్దు పేరు పండత్. అవినీతి, కోపం, క్రూరత్వంతో నిండిన పోలీసు అధికారి గా చేస్తున్నాడని టీజర్ లో చాలా స్పష్టంగా చెప్పారు.రితేష్ షా దర్శకత్వంలో నీరజ్ పాండే నిర్మించాడు. అతిరధ మహారధులు కనిపిస్తున్న ఈ మూవీ ట్రయిలర్ ఈ రోజు రిలీజ్ కావాలి. కానీ నిరసనల మధ్య రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.  రిలీజ్ డేట్ కూడా ఇంకా ప్రకటించలేదు.    
  - గాయాలపాలైన సంయుక్త మీనన్ - 'ది బ్లాక్ గోల్డ్' కోసం డూప్ లేకుండా భారీ ఫైట్లు - గాయాలను సైతం లెక్క చేయకుండా షూటింగ్ కొనసాగింపు   తన అందం, అభినయంతో ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ సంయుక్త మీనన్(Samyuktha Menon) ఇప్పుడు యాక్షన్ మోడ్ లోకి మారిపోయింది. ప్రస్తుతం ఆమె 'ది బ్లాక్ గోల్డ్'(The Black Gold) అనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది.    'ది బ్లాక్ గోల్డ్' కోసం డూప్ లేకుండా భారీ యాక్షన్ సీక్వెన్సులు చేస్తుంది సంయుక్త. ఈ క్రమంలోనే ఆమెకు గాయాలు అయ్యాయి. అయితే గాయాలను సైతం లెక్క చేయకుండా షూటింగ్ కొనసాగిస్తోంది.    ఈ మూవీలో సంయుక్త మీనన్ చేస్తున్న యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ గా నిలవనున్నాయట. సంయుక్త కెరీర్ లో 'ది బ్లాక్ గోల్డ్' ఒక స్పెషల్ మూవీగా నిలుస్తుందని మూవీ టీమ్ నమ్మకంగా ఉంది.   కొందరు హీరోలే డూప్స్ సహాయంతో యాక్షన్ సీన్స్ చేస్తుండగా.. సంయుక్త  గాయాలను సైతం లెక్క చేయకుండా యాక్షన్ సీన్స్ చేస్తుండటంపై ప్రశంసలు కురుస్తున్నాయి.     పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాగా 'ది బ్లాక్ గోల్డ్' చిత్రాన్ని యోగేష్ కెఎంసి రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాగంటి పిక్చర్స్ భాగస్వామ్యంతో హాస్య మూవీస్ బ్యానర్‌పై రజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ లోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.    ఈ చిత్రంలో మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, మనీష్ వాధ్వా ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో 'ది బ్లాక్ గోల్డ్' సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు  ప్లాన్ చేస్తున్నారు.  
    -ఉత్తరప్రదేశ్ లో చనిపోయిన పిల్లల విషయంలో ఏం చెయ్యాలి  -సోను సూద్ చెప్పేది ఫాలో అవ్వాలా! -ఆ టైం వచ్చిందా! -సోను సూద్ ఇంతకీ ఏం చెప్తున్నాడు         'బొమ్మాలి నిన్ను వదల' అంటు తెలుగు ప్రేక్షకులకి సరికొత్త విలనిజాన్ని పరిచయం చేసిన వర్ స్టైల్ యాక్టర్ 'సోను సూద్'(Sonu Sood). అలరించడమే కాదు ఎప్పటికప్పుడు ఆల్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ ని పోషిస్తు  ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. బాషా బేధం తో సంబంధం లేకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పాన్ ఇండియా రియల్ హీరోగా కూడా గుర్తింపు పొందాడు. ఎప్పుడు ఆ రెండు విభాగాలకి సంబంధించి సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచే సోను సూద్ ఇప్పుడు పదహేరేళ్ళ వయసు లోపు ఉన్న పిల్లల గురించి తీసుకోవల్సిన జాగ్రత్తలతో ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారాడు. ఆ డిటైల్స్ ఏంటో చూద్దాం. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్(Ghaziabad)లో ఆన్ లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసలైన ముగ్గురు మైనర్ యువతులు తమ అపార్ట్మెంట్ పై నుంచి కిందకి దూకి చనిపోయిన సంఘటన ప్రతి ఒక్కరిని ఎంతగానో కలిచివేస్తుంది. ఈ విషయంపై సోను సూద్ ఎంతో ఆవేదనతో మాట్లాడుతు 'సోషల్ మీడియా ప్రపంచంలో చిక్కుకొని ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు చనిపోవడం బాధాకరం. స్మార్ట్ ఫోన్ అనేది పిల్లల చేతుల్లో ఆయుధంగా మారుతుంది. వాటి వినియోగంపై నియంత్రణ లేకపోతే ఇలాంటి విషాదాలే పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. మన బాల్యానికి ఇప్పుడు మార్గదర్శకత్వం అవసరం.  చదువు కోసం తప్ప పదహారు సంవత్సరాల లోపు పిల్లలకి  సోషల్ మీడియా, ఆన్ లైన్ గేమింగ్ పై కఠినమైన రూల్స్ ని విధించే సమయం వచ్చింది. తల్లి తండ్రులు తమ పిల్లలు ఫోన్ లో ఏం చేస్తున్నారో గమనిస్తుండాలి. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేలా చూడాలని సోను సూద్ ప్రభుత్వాలకి, ప్రజలకి విజ్ఞప్తి చేసాడు. also read: శృతి హాసన్ వల్ల ఒక పాప ప్రాణాలు సేఫ్..  ఆ పాప ఎవరో తెలుసా   చనిపోయిన ముగ్గురు అమ్మాయిలు స్వయానా అక్కా చెల్లెల్లు. కొరియన్ కి చెందిన టాస్క్ ఆధారిత గేమ్ కి బానిస అయ్యి అందులో ఉన్న చివరి టాస్క్ ప్రకారం తొమ్మిదవ అంతస్థు నుంచి దూకి చనిపోయారు.  
  - టాలీవుడ్ లో మరో విషాదం - ప్రముఖ నటి జయవాహిని కన్నుమూత   తెలుగు పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. పలు సినిమాలు, సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి జయవాహిని కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె.. బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. (Actress Jaya Vahini)   విజయనగరానికి చెందిన జయవాహిని.. టెలివిజన్, సినీ రంగాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా టీవీ సీరియల్స్ లో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తెలుగుతో పాటు తమిళ సీరియల్స్ లోనూ నటించి గొప్ప పేరు సంపాదించుకున్నారు. అయితే క్యాన్సర్ తో పోరాడుతూ కొంతకాలంగా నటనకు దూరమయ్యారు. చివరిగా 'బహిర్భూమి', 'పోలీస్ వారి హెచ్చరిక' వంటి సినిమాల్లో ఆమె నటించారు.   జయవాహిని మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ముఖ్యంగా జయవాహినితో మంచి అనుబంధమున్న కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ లు పెట్టారు. "అక్కా నిన్ను కాపాడాలని చాలా ప్రయత్నం చేసినా ఆ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయావు. నువ్వు కరాటే నేర్చుకున్నప్పుడు విజయనగరం లో సైకిల్ మీద వెళ్తూ  స్కూల్ నుండి నన్ను కూడా ఎక్కించుకొని మా ఇంటిదగ్గర దింపిన రోజులు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి. కేన్సర్ ఎప్పటికైనా ప్రాణాంతకం. మహిళలు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోండి. అక్క బాధను మేము చూడలేకపోయాము. భగవంతుడు కూడా ఆమె బాధ చూడలేక దగ్గరకి తీసుకున్నాడు" అంటూ కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
దేశ చరిత్రను, ప్రపంచ చరిత్రను గమనిస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు,  మరెన్నో గొప్ప  ప్రణాళికలు, వ్యూహాలు కనిపిస్తాయి.  నేటికాలంలో స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ పుణ్యమా అని ఎవరికైనా ఫోన్ చేయాలన్నా,  మెసెజ్ చేయాలన్నా, మెయిల్ పంపాలన్నా కేవలం సెకెండ్లు, నిమిషాల వ్యవధిలో జరిగిపోతూ ఉంటుంది.  కానీ మూడు దశాబ్దాల క్రితం ఈ వెసులుబాట్లు ఉండేవి కాదు.. మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు సమాచారాన్ని అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ అడ్డంకిని అధిగమించడానికి, పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఆకాశాన్నే తమ మార్గంగా ఎంచుకుని హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్‌ను ప్రారంభించింది. అప్పట్లో కమ్యూనికేషన్ రంగంలో ఈ సర్వీస్ చరిత్ర సృష్టించింది.  ఎంతో ఆసక్తికరమైన ఈ సర్వీస్ గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. భారత్ హెలికాప్టర్ మెయిల్ సర్వీస్.. ఎంతో విప్లవాత్మకమైన భారత్ హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ను భారతదేశంలో జనవరి 27వ తేదీ,  1988లో ప్రారంభించారు. భారతదేశం ద్వీప సమూహాలతో కూడుకుని ఉంటుంది.   ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవులకు ఏదైనా సమాచారాన్ని అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ చారిత్రాత్మక హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్ కు ఈ దీవులే ప్రారంభ వేదికగా నిలిచాయి. మొదటి విమానం పోర్ట్ బ్లెయిర్ నుండి హేవ్‌లాక్ ద్వీపానికి సమాచారాన్ని చేరవేసేది. హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ప్రాధమిక ఉద్దేశ్యం మారుమూల ప్రాంతాలకు కూడా మెయిల్ ను డెలివరీ చేయడం. గతంలో మెయిల్ చేరుకోవడానికి రెండు నుండి మూడు రోజులు పట్టే ప్రాంతాలు కాస్తా హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ వచ్చాక ఆ దూరం,  సమయం చాలా తగ్గాయి. భారత తపాలా శాఖ.. హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ను విజయవంతం చేయడానికి బారత తపాలా శాఖ పవన్ హన్స్ లిమిటెడ్ తో కలిసి పనిచేసింది. ఈ సేవలో ప్రధానంగా డౌఫిన్ హెలికాప్టర్ ను ఉపయోగించారు. తొలి విమాన ప్రయాణ గుర్తుగా ఫస్ట్ డే కవర్లు జారీ చేయబడ్డాయి.  వీటిలో చాలా స్పెషల్ గా పిలువబడే హెలికాప్టర్ మెయిల్ స్టాంప్ కూడా ఉంది.  ఇది నేటికీ తపాలా చరిత్రలో విలువైన రికార్టు కావడం విశేషం. ప్రపంచంలో హెలికాప్టర్ మెయిల్ సర్వీస్.. ప్రపంచంలో మొట్టమొదటి హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ అక్టోబర్ 1, 1947న అమెరికాలో ప్రారంభమైంది. US పోస్టల్ సర్వీస్, లాస్ ఏంజిల్స్ ఎయిర్‌వేస్‌తో కలిసి, సికోర్స్కీ S-51 రోటరీ-వింగ్ హెలికాప్టర్‌ను ఉపయోగించి  ఈ సర్వీస్ ను నడిపింది. అమెరికా విజయం సాధించిన ఒక సంవత్సరం తర్వాత, యునైటెడ్ కింగ్‌డమ్ కూడా 1948లో తన సొంత హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇదీ భారతదేశంలో జరిగిన హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ గురించి ఆసక్తికరమైన సమాచారం.                                  *రూపశ్రీ.
క్యాన్సర్.. ప్రపంచ వ్యాప్తంగా అదిక శాతం జనాభాను కుదిపేస్తున్న ఆరోగ్య సమస్య.  క్యాన్సర్ వచ్చింది అంటే ఇక చావు ఖాయం అని అనుకుంటారు.  ఒక వేళ ట్రీట్మెంట్ తీసుకోవాలన్న.. దీని చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో మధ్యతరగతి,  దిగువ తరగతి కుటుంబాలు మనుషుల మీద ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. క్యాన్సర్ గురించి అవగాహన పెంచేందుకు,  ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీన క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా ఒక షాకింగ్ నిజం బయటపడింది. 2045 నాటికి భారతదేశంలో కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య ప్రతి ఏటా 1.5 మిలియన్ల నుండి 2.45 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. భారతదేశంలో క్యాన్సర్ అనేది ప్రధానమైన, తీవ్రమైన ఆరోగ్య సమస్యగా పరిణమిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. భారతదేశంలో క్యాన్సర్ ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోందని నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. 2045 నాటికి ప్రతి ఏడాది నమోదు అయ్యే క్యాన్సర్ కేసులు 15 లక్షల నుండి 24 లక్షలా 50వేల వరకు పెరుగుతాయని అంచనాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి క్యాన్సర్ ఎంత ఉదృతంగా పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.  దీని గురించి ఆరోగ్య నిపుణులు,  ప్రభుత్వాలు కూడా ఆలోచనలో పడ్డాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలామంది క్యాన్సర్ ఉందని తెలిసిన తరువాత లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవడం అనే విషయం మీదే ఎక్కువగా ఆలోచిస్తుంటారు అని చెబుతున్నారు. కానీ క్యాన్సర్ వచ్చిన తరువాత వైద్యం గురించి ఆలోచించడం కంటే.. క్యాన్సర్ ను ముందుగానే గుర్తించే దిశగా ఉండటం మంచిదని చెబుతున్నారు. క్యాన్సర్ కు చికిత్స మాత్రమే సరైన మార్గం కాదు.. దీని కోసం ముందస్తు స్క్రీనింగ్ కు హాజరు కావడం,  జీవనశైలి మార్చుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని మెయింటైన్ చేయడం, క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవడం,  శరీరంలో ఏదైనా అసౌకర్యం అనిపించినా,  ఎక్కడైనా అసాధారణంగా గడ్డలు, చర్మం రంగు మారడం,  శరీరంలో మార్పులు వంటివి జరిగినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించడం వంటివి చేయాలని అంటున్నారు. ఇవన్నీ చేయడం వల్ల క్యాన్సర్ కు ఖరీదైన చికిత్స అనే వరకు వెళ్లకుండా దాన్ని విత్తనం దశలోనే నిర్మూలించేందుకు వీలవుతుంది.  పైగా ఇలాంటి పరిస్థితిలో క్యాన్సర్ ను నయం చేయడం కూడా తక్కువ ఖర్చులోనే జరిగిపోతుంది. ప్రభుత్వ విధానాలు.. తాజాగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.  ఈ బడ్జెట్ లో క్యాన్సర్ చికిత్సను తక్కువ ఖర్చుతో, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రకటించింది. క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీ మినహాయింపులు,  దేశీయ బయోపార్మాస్యూటికల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం వంటివి బడ్జెట్ లో ఉన్నాయి. ప్రజలు చేయాల్సినది.. క్యాన్సర్ అనేది భారతదేశంలో ఎవరికైనా రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు.. కానీ కుటుంబ చరిత్ర ఉన్నవారిలో ఇది వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతారు.  క్యాన్సర్ గురించి ప్రతి వ్యక్తి తనకు తాను జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రీనింగ్ కు హాజరు కావాలి,  శరీరంలో ఏ మార్పును నిర్లక్ష్యం చేయకూడదు,  ఆరోగ్యకరమైన జీవనశైలి,  ఆరోగ్యకరమైన  ఆహారం తీసుకోవడం,  వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా గడపడం వంటివి చేయాలి.  ఇలా చేస్తే ఎవరికి వారు క్యాన్సర్ నుండి దూరంగా ఉండవచ్చు.                                    *రూపశ్రీ.
  అమ్మాయిలకు అయినా, అబ్బాయిలకు అయినా జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక పెళ్లి.  ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లి విషయంలో తల్లిదండ్రులు చాలా ఆలోచన చేస్తారు. అబ్బాయి ఉద్యోగం,  సొంతిల్లు ,  సంపాదన, ఆస్తిపాస్తులు,  అబ్బాయి అలవాట్లు.. ఇవి మాత్రమే కాకుండా కొందరు తల్లిదండ్రులు తమ కూతురిని తమకు ఎంత దగ్గర ప్రాంతంలో వీలైతే అంత దగ్గరలో ఇవ్వాలని అనుకుంటారు. మరీ ముఖ్యంగా ఉద్యోగం లేని అమ్మాయిల విషయంలో అయితే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది.  కేవలం కొన్ని గంటలు ప్రయాణం చేయగానే ఒకరిని ఒకరు చేరుకునేట్టుగా ఉండే ప్రాంతాలకు ఇవ్వాలని ఆశిస్తారు.  దీని వెనుక చాలా విషయాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. చేరుకోవడం తేలిక.. దగ్గరగా నివసించడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం  ఒకరినొకరు కలవడానికి  అడ్డంకులు తక్కువగా ఉండటం. ఎప్పుడు కావాలంటే అప్పుడు తల్లిదండ్రులు కూతురిని చూడవచ్చు, కూతురు తల్లిదండ్రుల వద్దకు వెళ్లవచ్చు. చిన్న,  పెద్ద సమస్యలు,  అపార్థాలను వెంటనే పరిష్కరించవచ్చు. ఇది సంబంధంలో పారదర్శకతను తెస్తుంది,  పరస్పర విశ్వాసాన్ని బలపరుస్తుంది. దగ్గరగా ఉండటం వల్ల, రెండు కుటుంబాలు ఒకరి మనస్తత్వాన్ని,  వారి అవసరాలను సులభంగా అర్థం చేసుకోగలవు, ఇది సంబంధంలో సామరస్యాన్ని పెంచుతుంది. సమయం, ఖర్చు.. కూతురిని దూరంగా ఇచ్చినప్పుడు ఆమెను చూసి రావడానికి  తరచుగా ఎక్కువ సమయం,  డబ్బు ఖర్చవుతుంది.  ప్రయాణాలు, ఫోన్ కాల్స్,వాహన సదుపాయం మాత్రమే కాకుండా  ప్రయాణానికే ఉన్న సమయం అంతా గడిపోతుంటుంది. దీని  వల్ల సంబంధాలకు సమయం కేటాయించడంలో ఒత్తిడిని కలిగిస్తుంది. దగ్గర ఉన్న సంబంధాలకు ఇాలాంటి సమస్యలు ఉండవు.  చిన్న చిన్న పండుగలు,శుభ సందర్భాలను కూడా  కుటుంబంతో పంచుకోవచ్చు. ఇది సంబంధాన్ని బలపరుస్తుంది. అంతేకాదు.. ఆర్థిక, మానసకి భారాన్ని తగ్గిస్తుంది. వాతావరణం.. దగ్గరి ప్రాంతంలోనే అమ్మాయిని ఇవ్వడం వల్ల ప్రాంతీయత, అలవాట్ల సమస్య ఉండదు. ఆహారపు అలవాట్లు,  పద్దతులు కూడా తెలిసి ఉంటాయి.  ఇది మనుషుల్లో కలిసిపోవడానికి బాగా సహాయపడుతుంది. సామాజిక-సాంస్కృతిక నేపథ్యంలో పెద్దగా తేడా లేకపోతే, రెండు కుటుంబాలకు ఒకరితో ఒకరు సర్దుకుపోవడంలో ఎటువంటి సమస్య ఉండదు. ఈ ఉమ్మడి పునాది సంబంధాన్ని దీర్ఘకాలికంగా స్థిరంగా,  బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. పిల్లల పెంపకం.. తల్లిదండ్రుల ఇల్లు,  అత్తమామల ఇల్లు కొన్ని మైళ్ల దూరంలో ఉన్నప్పుడు,  పిల్లలను పెంచడంలో మంచి సపోర్ట్ లభిస్తుంది.  ఉద్యోగం కారణంగా నేటి కాలంలో వారు పిల్లల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే దగ్గరలోనే రెండు కుటుంబాలు ఉంటే పిల్లల విషయంలో మంచి సపోర్ట్ దొరుకుతుంది. పిల్లలకు రెండు కుటుంబాల  ప్రేమ,  మద్దతు కూడా లభిస్తుంది. ప్రతికూలతలు.. కుటుంబాలు దగ్గరలో ఉండటం వల్ల ప్రయోజనాలే కాదు.. ప్రతికూలతలు కూడా ఉంచాయి.  రెండు కుటుంబాలు ఆరోగ్యకరమైనవి అయితే సమస్య లేదు. కానీ కేవలం అమ్మాయి మాత్రమే కావాలని, ఆమె తల్లిదండ్రులు వారి కుటుంబం మాకు అవసరం లేదని అనుకునే అత్తింటి వారితో ఇలా దగ్గరగా ఉండటం వల్ల అటు ఆడపిల్ల తల్లిదండ్రులు,  ఆ అమ్మాయి కూడా చాలా బాధపడాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు దగ్గర  ఉంటే ఏ చిన్న గొడవ జరిగినా ఆడపిల్ల తమ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడుతుంది.  ఇది అత్తింటితో అనుబంధాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఆడపిల్ల తల్లిదండ్రులు తమ కూతురు అల్లుడి వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడం,   ఆడపిల్లకు చెడు మాటలు నేర్పి  కుటుంబాన్ని విచ్చిన్నం చేసే దిశగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది.  కాబట్టి ఇది వారి విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. అయితే.. దూరం సంబంధం అయినా, దగ్గరి సంబందం అయినా..  రెండు కుటుంబాలు  ఆరోగ్యకరంగా ఉండే విదానం మీదనే సంబంధాలు నిలబడతాయి, సంతోషంగా ఉంటాయి.                                   *రూపశ్రీ.
ఆహారం ప్రతి జీవికి శక్తివనరు.  ప్రాణం లేని వాహనాలు కూడా వాటికి ఇంధనం  ఉంటేనే పని చేస్తాయి. అలాంటి ప్రాణం ఉన్న జీవులకు ఆహారం చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రాణం ఉన్న జీవులలో ఈ ప్రపంచంలో మనిషి చాలా ప్రత్యేకం.  అయితే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి.  ఇందులో ఫైబర్ కూడా ముఖ్యమైనది. చాలామంది ఆహారంలో కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ప్రోటీన్ వంటివి ఉన్నాయా లేదా అని చూస్తారు. కానీ ఫైబర్ గురించి ఆలోచించే వారు తక్కువ. ఆహారంలో ఫైబర్ లోపిస్తే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. పైబర్ గురించి నిర్లక్ష్యంగా ఉండేవారు తప్పకుండా తెలుసుకోవలసిన నిజాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. పేగు ఆరోగ్యం.. ఫైబర్ లేకపోవడం వల్ల మన గట్ లైనింగ్ నేరుగా దెబ్బతింటుంది, ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల పేగులు దెబ్బతినే అవకాశాలు క్రమంగా పెరుగుతాయి.   షుగర్ లెవల్స్.. ఫైబర్ లేకపోవడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుదల మరింత తీవ్రమవుతుందని. ఆహారంలో ఫైబర్ ఉన్నప్పుడు, అది చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. ఫైబర్ లేకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకత,  టైప్ 2 డయాబెటిస్‌కు  దారితీస్తుంది. కొలెస్ట్రాల్.. గుండె ఆరోగ్యం.. ఫైబర్ శరీరంలో చీపురులా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తుడిచిపెడుతుంది. ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటే, ఈ చెడు కొవ్వు ధమనులలో పేరుకుపోతుంది. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఫ్యాటీ లివర్.. ఫైబర్ లేకపోవడం కొవ్వు కాలేయం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. దీనివల్ల శరీరం  ప్రధాన వడపోత  అవయవమైన లివర్ పనితీరు మందగిస్తుంది.  ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజూ 25-30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫైబర్ లేకపోవడం వల్ల శరీరం బ్యూటిరేట్ అనే ముఖ్యమైన షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్ ఉత్పత్తి తగ్గుతుంది. బ్యూటిరేట్ పేగు కణాలకు శక్తిని అందిస్తుంది,  క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి వాటిని రక్షిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం లేకపోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్,  ఇతర శోథ వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని, ఇది దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎక్కువ ముప్పును కలిగిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. హార్మోన్ల అసమతుల్యత.. అకాల వృద్దాప్యం.. ఫైబర్ లేకపోవడం వల్ల అంతర్గత అవయవాలు మాత్రమే కాకుండా చిన్న వయసులోనే వయస్సు పెరిగినట్టు (అకాల వృద్ధాప్యం) కూడా ప్రభావితమవుతుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది,  అకాల వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఫైబర్ తగినంతగా తీసుకోకపోవడం ముడతలు,  శరీరంలో ఎనర్జీ నష్టానికి దారితీస్తుంది. అందువల్ల,  ఆహారంలో తృణధాన్యాలు, పప్పుధాన్యాలు,  కాలానుగుణ కూరగాయలను చేర్చడం చాలా ముఖ్యం.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
ఒకప్పుడు సొంపు చాలా మందికి తెలియదు. జీలకర్రను పోలిన సొంపు చాలా మంచి సువాసనతో ఉంటుంది. కొన్నిరకాల వంటల్లో సొంపును వాడతారు. మరికొందరు సొంపును భోజనం తర్వాత జీర్ణశక్తి కోసం తీసుకుంటారు. రెస్టారెంట్లలో భారీ భోజనం తిన్న తరువాత సొంపు ఇవ్వడం వెనుక కారణం.. కడుపు ఉబ్బరం, అజీర్తి ఉండకూడదనే.. అయితే ఆయుర్వేదం సొంపుతో మరింత గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంది. చాలామంది రాత్రి నీటిలో సొంపును నానబెట్టి ఉదయాన్నే తాగుతూ ఉంటారు.  కానీ రాత్రి పడుకునే ముందు సొంపు నీరు తాగితే అద్భుతాలు జరుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇంతకూ రాత్రి పడుకునే ముందు సొంపు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఆయుర్వేద వైద్యులు ఏం చెప్పారు? తెలుసుకుంటే.. మనం తినే,  త్రాగే ఆహారాలు మన చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని చెబుతారు. అందుకే మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి.  కడుపును శుభ్రంగా ఉంచుకోవడం వల్ల సహజమైన మెరుపు వస్తుంది. సొంపు నీరు కూడా ఇలాంటిదే..  డిటాక్స్ డ్రింక్.. రోజూ డీటాక్స్ డ్రింక్ తాగడం వల్ల శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పోతాయి. ఇది  చర్మాన్ని హైడ్రేటెడ్ గా, ప్రకాశవంతంగా,  యవ్వనంగా ఉంచుతుంది. డిటాక్స్  డ్రింక్ తాగడం వల్ల మొటిమలు , మంట,  మచ్చలు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. సొంపు నీటిని ఎలా చేసుకోవాలి.. 1 కప్పు నీరు 1 టీస్పూన్ సోంపు.. 1 టీస్పూన్ జీలకర్ర.. 1 టీస్పూన్ క్యారమ్ విత్తనాలు.. తయారు విధానం.. పైన పేర్కొన్నవన్నీ ఒక పాన్‌లో లేదా గిన్నెలో వేయాలి. అందులో ఒక కప్పు నీరు పోయాలి.  దీన్ని తక్కువ మంట మీద మరిగించాలి. 5 నుండి 10 నిమిషాలు ఉడకబెట్టండి.  ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.   డిటాక్స్ డ్రింక్ రెడీగా ఉన్నట్టే ప్రతి రాత్రి పడుకునే ముందు దీన్ని తయారు చేసుకుని తాగమని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ప్రయోజనాలు.. ఈ డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి, చర్మం మెరుస్తుంది,  కడుపు శుభ్రంగా ఉంటుంది, శరీరం డీటాక్స్ అవుతుంది సొంపు చేసే మ్యాజిక్.. పైన పేర్కొన్న డిటాక్స్ డ్రింక్ లో సొంపు ఉంటుంది.  ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి, ఇ తో పాటు అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మాన్ని శుద్ది చేస్తాయి. ఇది మొటిమలు,  ముడతలను తగ్గిస్తుంది,  ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది . ఇది మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
మహిళలు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి సందర్బాలలో మహిళలు తమ మూత్రవిసర్జనను నియంత్రించుకోలేకపోతారు. దీనివల్ల అసౌకర్యం,  ఇబ్బంది కలుగుతాయి. 40 ఏళ్ల తర్వాత మహిళల్లో దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వయస్సు పెరిగే కొద్దీ కటి కండరాలు క్రమంగా బలహీనపడటం జరుగుతాయని, ఇది మాత్రమే కాకుండా వైద్యుల పర్యవేక్షణ లేకుండా డెలివరీ వంటివి జరగడం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చని మహిళా వైద్యులు చెబుతున్నారు.  అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని చిట్కాలను వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే.. మూత్రం లీకేజి ఇందుకే.. వయసు పెరిగే కొద్దీ కటి కండరాలు క్రమంగా బలహీనపడతాయి . ఇది గర్భాశయం, మూత్రాశయం,  పురీషనాళం (ప్రేగు మార్గం) కు ఇచ్చే సపోర్ట్ ను బలహీనపరుస్తుంది. ఈ సపోర్ట్  బలహీనపడినప్పుడు, ఈ అవయవాలు వాటి స్థానం నుండి పక్కకు   వెళ్లడం జరుగుతుంది. ఇది దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యకు మరో కారణం  ఎక్కువ ప్రసవాలు జరగడం. ప్రతి ప్రసవంతో కటి కండరాలు బలహీనంగా,  వదులుగా మారుతాయి. దీనివల్ల అవయవాలు సరైన సపోర్ట్ ను కోల్పోతాయి,  మూత్రం లీకేజ్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. మూత్రం లీకేజి కాకూడదంటే ఇలా చేయాలి.. మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి.  పోషకాహారం గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు. మల్టీవిటమిన్లు,  కాల్షియం తీసుకోవడానికి ముందు వైద్యుల సలహా లేదా విటమిన్ల లోపాన్ని నిర్ధారించుకున్న తర్వాతే తీసుకోవాలి.  ఆహారంలో ప్రోటీన్‌ను బాగా ఉండేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా  కెగెల్ వ్యాయామాలు చేయాలి.  సమస్య తీవ్రంగా ఉంట వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి.   ఇలా చేయడం వల్ల మూత్రం లీకేజీ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. లేదంటే మూత్రాన్ని నియంత్రించుకోలేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు, గుడులకు వెళ్లినప్పుడు , శుభకార్యాలు వంటివి జరుగుతున్నప్పుడు, ప్రయాణాలలో ఉన్నప్పుడు ఇది చాలా దారుణమైన అనుభవాన్ని మిగులుస్తుంది.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...