జింబాబ్వేను చిత్తు చేసిన టీమ్ ఇండియా.. సెమీస్ ఆశలు సజీవం

Publish Date:Feb 26, 2026

Advertisement

టి 20 వరల్డ్ కప్ టోర్నీలో టీమ్ ఇండియా సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. జింబాబ్వేతో గురువారం (ఫిబ్రవరి 26) జరిగిన కీలక మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. 237 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వే   20 ఓవర్లలో  6 వికెట్లు నష్టపోయి 184 పరుగులు మాత్రమే చేసి 72 పరుగుల తేడాతో చిత్తైంది.  జింబాబ్వే బ్యాటర్లలో బెనెట్  97 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టారు.  

తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ సత్తా చాటారు. సంజూ శాంసన్24 పరుగులు, అభిషేక్ శర్మ55 పరుగులు చేశారు. ఇరువురూ టీమ్ ఇండియాకు అదిరే ఆరంభాన్ని అందించారు. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు కూడా మెరుపు ఇన్నింగ్స్ తో స్కోరింగ్ రేట్ ఎక్కడా తగ్గకుండా వేగంగా పరుగులు సాధించారు.

ఇషాన్ కిషన్  38, సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు చేశారు. ఇక చివరిలో  హార్దిక్ పాండ్యా 50 నాటౌట్, తిలక్ వర్మ 44 సిక్సర్లతో చెలరేగడంతో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 256 పరుగుల భారీ స్కోరు చేసింది.  ఈ విజయంతో టీమ్ ఇండియా సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి.  23 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 50 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా కు ప్లేయర్  ఆప్ ది మ్యాచ్ దక్కింది.  ఇక టీమ్ ఇండియా సెమీస్ కు చేరాలంటే ఆదివారం (మార్చి 1) విండీస్ తో జరిగే మ్యాచ్ లో విజయం సాధించాలి. 

By
en-us Political News

  
ప్రాణాపాయ స్థితిలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి ఓ భర్త చేసిన పోరాటం మన వ్యవస్థ వైఫల్యాన్ని కళ్లకు కట్టింది. వివరాల్లోకి వెళ్తే.. ​అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామానికి చెందిన ఓ మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమె పరిస్థితి విషమిస్తుండటంతో, కుటుంబ సభ్యులు ఆందోళనతో 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, "అంబులెన్స్ అందుబాటులో లేదు అన్న సమాధానం వచ్చింది.
ఈ పట్టాభిషేక మమోత్సవం మంగళవారం నుంచి గురువారం వరకూ నభూతో న భవిష్యత్తు అన్నరీతిలో వేలాదిమంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ప్రస్తుత మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి ,మఠాధిపతి సోదరులు నొస్సం దత్తాత్రేయస్వామి, వీరభట్లయ్య స్వామి, మఠాధిపతి బావమరిది, భవిష్యత్ మేనేజర్ పి.పి.ఎన్. ప్రసాద్ పర్యవేక్షణలో కన్నులపండువగా నిర్వహించారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి పూర్తిగా మాజీ సీఎం జగన్‌నే కారణమని మంత్రి నిమ్మల విమర్శించారు.
ముంబైలో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ నివాసం, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
రెండో సారి అమెరికా ప్రెసిడెంట్‌ అయిన డోనాల్డ్ ట్రంప్ .. అగ్రదేశ అధినేతగా ప్రపంచానికి తానే బాస్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో పోలీసులు భారీ స్థాయిలో డ్రగ్స్ రాకెట్‌ను బట్టబయలు చేశారు.
జూబ్లీహిల్స్‌ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురు కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు.
పాకిస్థాన్‌లో తీవ్ర ద్రవ్యోల్బణంతో నిత్యావసర వస్తువుల ధరలు తార స్థాయికి చేరాయి.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఒకే రోజు రెండు సార్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందాన పెళ్లి జరగనుంది
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్ 36లోని మంగళగౌరి షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.