కన్నుల పండువగా బ్రహ్మంగారి మఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం
Publish Date:Feb 26, 2026
Advertisement
శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి 12వ మఠాధిపతిగా శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వామి పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ పట్టాభిషేక మమోత్సవం మంగళవారం (ఫిబ్రవరి 24) నుంచి గురువారం (ఫిబ్రవరి 26) వరకూ నభూతో న భవిష్యత్తు అన్నరీతిలో వేలాదిమంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ప్రస్తుత మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి ,మఠాధిపతి సోదరులు నొస్సం దత్తాత్రేయస్వామి, వీరభట్లయ్య స్వామి, మఠాధిపతి బావమరిది, భవిష్యత్ మేనేజర్ పి.పి.ఎన్. ప్రసాద్ పర్యవేక్షణలో కన్నులపండువగా నిర్వహించారు. గురువారం (ఫిబ్రవరి 26) సాయంత్రం మఠాధిపతి వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారికి తులాభారం కార్యక్రమం నిర్వహించారు. ఈ పట్టాభిషేక మహో త్సవాన్ని వీక్షించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులుపెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పూర్వపు మఠాధిపతి శ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామిజ్యేష్ట కుమారుడు వెంకటాద్రి స్వామికి మఠాధిపతి బాధ్యతలు అప్పగించారు. . తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాపతి, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూద నాచారి, హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ కే.యం. కిరణ్ కుమార్ తోపాటు మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి, వైసీపీ నాయకులు రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి, ఎంపీపీ వీరనారాయణ రెడ్డి, మండల టిడిపి అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, సహకార పరపతి బ్యాంకు చైర్మన్ యల్లటూరి సాంబశివరెడ్డి, టిడిపి మండల నాయకులు ఎస్సార్ శ్రీనివాసులు రెడ్డి, ఎం పోలిరెడ్డి, పూజా శివ యాదవ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ యం. రామ గోవిందరెడ్డి, డిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ ఈ.తిరుపాల్రెడ్డి తోపాటు కందిమల్లయ్యపల్లె పుర సంస్థాన ప్రజలు, వివిధ రాష్ట్రాల నుండి స్వామి శిష్యులు భక్తులు పాల్గొని పట్టాభిషేక మహోత్సవాన్ని కనులారా తిలకించి తరించారు. పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమానికి దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం వసతి సౌకర్యం, భోజనం సౌకర్యం ఏర్పాటు చేశారు .జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వివిధ మండలాల నుండి పోలీస్ సిబ్బంది ఎస్సై శివప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా గట్టి బందో బస్తు ఏర్పాటు చేశారు. మఠం పురవీధుల గుండా, ప్రాంగణమంతా చలువ పందిళ్ళు విద్యుద్దీపాలంక రణలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
http://www.teluguone.com/news/content/brahmamgari-marham-mathadipat-pattabhishekam-36-214718.html





