అంబులెన్స్ జాడ లేదు.. ఎద్దుల బండిలోనే రోగి తరలింపు!
Publish Date:Feb 26, 2026
Advertisement
అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నామని మురిసిపోతున్నామే కానీ, అత్యవసర సమయాల్లో సామాన్యుడికి కనీస వైద్య సాయం మాత్రం అందడం లేదు. కనీసం అనారోగ్యంతో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్సు కూడా అందుబాటులోకి రాని దుస్థితి ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి ఓ భర్త చేసిన పోరాటం మన వ్యవస్థ వైఫల్యాన్ని కళ్లకు కట్టింది. వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామానికి చెందిన ఓ మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమె పరిస్థితి విషమిస్తుండటంతో, కుటుంబ సభ్యులు ఆందోళనతో 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, "అంబులెన్స్ అందుబాటులో లేదు అన్న సమాధానం వచ్చింది. ప్రైవేటు వాహనాన్ని పిలిపించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆ మహిళ భర్త భర్త తన వద్ద ఉన్న ఎద్దుల బండినే అంబులెన్స్‌గా మార్చుకున్నాడు. ఎండను సైతం లెక్కచేయకుండా, తన భార్య ప్రాణాలను కాపాడుకోవడమే లక్ష్యంగా మైళ్ల దూరం ఎద్దుల బండిపై ఆసుపత్రికి తరలించాడు.
http://www.teluguone.com/news/content/no-ambulence-patient-transported-hospital-in-cort-36-214719.html




