బౌలర్లే గెలిపించారు.. టీమ్ ఇండియా స్కిప్పర్ సూర్య
Publish Date:Mar 5, 2026
Advertisement
టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో అద్భుత విజయంతో ఫైనల్స్ కు దూసుకెళ్లిన టీమ్ ఇండియా సంబరాల్లో మునిగిపోయింది. ఈ గెలుపునకు కారణం బౌలర్లేనని కెప్టెన్ స్యూర్య అన్నాడు. నిజంగా ఈ విజయం తమకు ఒక నమ్మశక్యంకాని అనుభూతిని ఇచ్చిందన్నారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్ లో టీమ్ ఇండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 253 పరుగుల భారీ స్కోరు చేసినా, ఛేదనలో ఇంగ్లాండ్ ఇండియాను ఖంగారు పెట్టింది. బ్యాటింగ్ కు, బ్యాటర్లకు స్వర్గధామం లాంటి వాంఖడే స్టేడియంలో భారత్ చేసిన భారీ స్కోరును అలవోకగా ఛేదించేలా ఇంగ్లండ్ బ్యాటర్ల దూకుడు విధ్వంసం ఉంది. క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా.. ఛేదనలో ఇంగ్లాండ్ ఎక్కడా తడబడలేదు. ఇదే విషయాన్ని సూర్య మ్యాచ్ అనంతరం ప్రజంటేషన్ సెర్మనీలో చెప్పాడు. జాకబ్ బెథెల్ 45 బంతుల్లో 100 పరుగులతో అద్భుత సెంచరీతో ఇంగ్లండ్ ను గెలిపించేలా కనిపించాడన్న సూర్య.. అయితే బుమ్రా, హార్థిక పాండ్యాలు చివరి ఓవర్లలో బ్యాటర్లను కట్టడి చేసిన విధానం అద్భుతమన్నాడు. ఇంగ్లాండ్ చేతిలోంచి టీమ్ ఇండియా బౌలర్లు మ్యాచ్ ను లాగేసుకున్నారని చెప్పాడు ఇక ఫీల్డింగ్ విషయం ఎంత చెప్పినా తక్కువేనన్న సూర్య అక్షర్ పటేల్ పట్టిన అద్భుత క్యాచలను పొగడ్తలతో ముంచెత్తాడు.
http://www.teluguone.com/news/content/surya-all-praises-for-bowlers-36-215089.html





