మూడో బిడ్డను కనే దంపతులకు రూ. 25 వేల ప్రోత్సాహకం.. ఏపీ సీఎం చంద్రబాబు

Publish Date:Mar 5, 2026

Advertisement

మూడో బిడ్డను కనే దంపతులకు రూ. 25 వేల ప్రోత్సాహకం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.  రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును అరికట్టి, జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు  జనాభా నిర్వహణ  (పాపులేషన్ మేనేజ్ మెంట్ )విధానం ముసాయిదాను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం (మార్చి 5) అసెంబ్లీలో ఆవిష్కరించారు.

ఇందులో భాగంగానే  మూడో బిడ్డను కనే దంపతులకు రూ. 25 వేల ప్రోత్సాహకం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మూడో బిడ్డకు ఐదేళ్ల వయసు వచ్చేవరకు నెలకు రూ. 1,000 చొప్పున పౌష్టికాహార సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య  అందించనున్నట్లు తెలిపారు. పిల్లలు కనేవారిని ప్రోత్సహించేందుకు తల్లికి 12 నెలలు, తండ్రికి 2 నెలల పాటు సెలవులు మంజూరు చేసే యోచన ఉందన్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) 1.5కు పడిపోయిందని,  ఇది ఇలాగే కొనసాగితే జపాన్, ఇటలీ మాదిరిగా వృద్ధుల జనాభా పెరిగి, యువత సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని చంద్రబాబు అన్నారు.  

గతంలో   కుటుంబ నియంత్రణ  నినాదం ఉండేదని, ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా సంరక్షణ  విధానానికి మారుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.   పాపులేషన్ మేనేజ్ మెంట్ పాలసీ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని తెలిపారు.

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం
హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది.
ఈ నెల 20వ తేదీన దేశంలోని అన్ని మెడికల్ షాపులు పూర్తి స్థాయిలో మూతపడనున్నాయి.
కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఏపీలోని పలు రైల్వే స్టేషన్లకు మహర్దశ పట్టింది.
చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో పోలీస్ విభాగానికే చెందిన కానిస్టేబుల్‌కు భారీ శిక్ష పడింది.
బండి సంజయ్‌ తన కుమారుడిని వెంట తీసుకుని వచ్చి విచారణను ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరుకు అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్‌లో సంచలనం గా మారిన బండి సంజయ్ కుమార్ కుమారుడికి సంబంధించిన కేసు నేపథ్యంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం లభించింది.
తెలంగాణలో ఆదివారం పెట్రోల్ బంకుల మూసివేతపై సాగుతున్న ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అసలు నిజమేంటో, అధికారులు ఏమన్నారో ఈ స్టోరీలో తెలుసుకోండి.
హైదరాబాద్‌లో నమోదైన ఫోక్సో కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.