పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ : కేటీఆర్

Publish Date:May 15, 2026

Advertisement

 

హైదరాబాద్ ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేశామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులపైనే ప్రజలు ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చేదని, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆధునిక సదుపాయాలతో టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణం ఒక కీలక ముందడుగుగా నిలిచిందన్నారు. ఎయిమ్స్ స్థాయి వైద్యాన్ని హైదరాబాద్‌లోనే అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపుదిద్దామని తెలిపారు.

సనత్‌నగర్‌లో 22 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రత్యామ్నాయంగా సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం టిమ్స్‌ను ప్రారంభించిందన్నారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్, ఎల్‌బీనగర్, ఆల్వాల్ ప్రాంతాల్లో టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే వరంగల్‌లో 2000 పడకల భారీ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతుండగా, నిమ్స్ విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయని వెల్లడించారు.

సనత్‌నగర్ టిమ్స్‌లో మూడు బ్లాకులు నిర్మించామని, 300 ఐసీయూ పడకలతో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రోగుల బంధువుల కోసం ప్రత్యేక ధర్మశాల కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. సుమారు రూ.1200 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ఆసుపత్రి మరింత ముందుగానే పూర్తయ్యేదని వ్యాఖ్యానించారు.

ఈ హాస్పిటల్‌లో 16 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ సహా అన్ని డయాగ్నస్టిక్ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక వీఐపీ సూట్స్‌తో పాటు కిడ్నీ వ్యాధులపై పరిశోధనలకు అనువైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. దేశంలోనే అత్యధిక వైద్య సిబ్బందితో కూడిన ప్రభుత్వ వైద్య వ్యవస్థగా టిమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రత్యేక రీసెర్చ్ బ్లాక్స్, అకాడెమిక్ విభాగాలు, భారీ ఆడిటోరియం నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఒకేసారి వెయ్యి కార్లు పార్క్ చేసే ఆధునిక పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. టిమ్స్ హాస్పిటల్ డిజైన్ దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ వైద్య నిర్మాణాల్లో ఒకటిగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు.

అత్యవసర సేవల కోసం ప్రత్యేక ఎమర్జెన్సీ ర్యాంప్ ఏర్పాటు చేసినట్లు, లిఫ్టుల పనితీరును మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రజలకు చేరువలో వైద్యం అందించామని గుర్తుచేశారు. మిగిలిన పనులను ప్రభుత్వం వేగంగా పూర్తి చేసి టిమ్స్‌ను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

By
en-us Political News

  
హైదరాబాద్‌లో సంచలనం గా మారిన బండి సంజయ్ కుమార్ కుమారుడికి సంబంధించిన కేసు నేపథ్యంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం లభించింది.
తెలంగాణలో ఆదివారం పెట్రోల్ బంకుల మూసివేతపై సాగుతున్న ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అసలు నిజమేంటో, అధికారులు ఏమన్నారో ఈ స్టోరీలో తెలుసుకోండి.
హైదరాబాద్‌లో నమోదైన ఫోక్సో కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది.
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పరిధిలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కొహెడ గ్రామంలో చోటుచేసుకున్న ఓ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్.. ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ (జేజీఎఫ్)..
బండి భగీరథ్‌‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పనిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు.
బినెట్ ఆమోదం తరువాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 47.60 కిలోమీటర్ల పొడవున ఆరు కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. మచిలీపట్నం , రేపల్లె మధ్య రైల్వేలైన్‌లో మొత్తం 70 బ్రిడ్జిలు, 24 అండర్‌ బ్రిడ్జిలు రానున్నాయి.
రాష్ట్రంలో రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు, ఏపీని డిఫెన్స్ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది.
దీంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ.. డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్(డిఓపిటి)మంత్రిత్వ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపపాలన శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియ జేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.