Publish Date:Feb 16, 2026
ఇరవై నాలుగేళ్ల కిందట పెను సచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రత్యూష మృతి కేసులో సుప్రీం కోర్టు మంగళవారం (ఫిబ్రవరి 17) తుది తీర్పు వెలువరించనుంది.
కేసు వివరాల్లోకి వెడితే.. భువనగిరికి చెందిన ప్రత్యూష్ పిన్న వయస్సులోనే చిత్రపరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వర్థమాన నటిగా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ స్టార్ స్టేటస్ కు చేరుకున్నారు. మోహన్ బాబు హీరోగా నటించిన రాయుడు సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రత్యూషకు ఆ సినిమాలో నటనకు మంచి గుర్తింపు వచ్చింది. తొలి సినిమాతోనే అశేష ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ఈ గుర్తింపుతో వరుసగా తెలుగు, తమిళ సినిమాలలో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది.
ఈ నేపథ్యంలోనే ఆమె మరణించారు. 2002 ఫిబ్రవరి 24న తన 20 ఏళ్ల వయస్సులో ప్రత్యూష మృతి అప్పట్లో సంచలనం సృష్టించింది. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రత్యూష, ఆమె స్నేహితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డిలు 2002 ఫిబ్రవరి 23న విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రి పాలయ్యారు. ప్రత్యూష చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న మరణించింది. ఆమె స్నేహితుడు సిద్ధార్థ కోలుకుని మార్చి 9న సిద్ధార్థ డిశ్చార్చి అయ్యాడు.
అయితే ప్రత్యూష మృతి పట్ల అప్పట్లో పపలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యూషది ఆత్మహత్య కాదనీ, ఆమె హత్యకు గురైందనీ ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రత్యూషది హత్యేనని ఆరోపిస్తూ ఆమె తల్లి సరోజినీదేవి న్యాయ పోరాటానికి దిగారు. ఈ కేసులో దర్యాప్తు జరిపిన సీబీఐ.. ప్రత్యూషది ఆత్మహత్యేనని తేల్చింది. అయితే ప్రత్యూష స్నేహితుడు సిద్ధార్థపై ఆత్మహత్యకు ప్రేరేపించడం, సెక్షన్ ఆత్మహత్యకు యత్నించడం తదితర కేసులు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సిద్ధార్థకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి.. ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు, రూ.5 వేల జరిమాన విధిస్తూ 2004లో తీర్పు వెలువరించారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ్ హైకోర్టును ఆశ్రయంచగా, కింది కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ హైకోర్టు 2011లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చూస్తూ సిద్ధార్థ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అలాగే ప్రత్యూష తల్లి కూడా హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు.
నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ప్రత్యూష తల్లి, హైకోర్టు విధించిన శిక్షను పూర్తిగా రద్దు చేయాలంటూ సిద్ధార్థ.. వేర్వేరుగా పిటిషన్లు ధాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్ రాజేష్ బిందల్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం గత ఏడాది నవంబర్ లో తీర్పు రిజర్వ్ చేసింది. ఇప్పుడు ఆ రిజర్వ్ చేసిన తీర్పును మంగళవారం (ఫిబ్రవరి 17) వెలువరించనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-court-final-verdict-today-in-actress-pratyusha-36-214198.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.