ప్రేమ పేరుతో బాలిక కిడ్నాప్ యత్నం.. యువకుడి అరెస్టు

Publish Date:May 11, 2026

Advertisement

వికారాబాద్ జిల్లాలో సంచలనం రేపిన మైనర్ బాలిక అపహరణ యత్నం కేసుకు సంబంధించి ఓ యువకుడిని పోలీసులు అరెరస్టు చేశారు. ప్రేమ పేరుతో 16 ఏళ్ల బాలికను మాయమాటలతో ట్రాప్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఢిల్లీకి చెందిన ఆదీమ్  అనే 28 ఏళ్ల యువకులు..   కొంతకాలం క్రితం పనిమీద తాండూరు పట్టణానికి వచ్చాడు. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఢిల్లీ సెలూన్ షాపులో గత ఆరు నెలలుగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ సమయంలో అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. కున్నాడు. ప్రేమిస్తున్నాననీ, పెళ్లి చేసుకుంటాననీ నమ్మించి  బాలికను తనతో రావడానికి ఒప్పించాడు.  

శనివారం (మే 9) బాలికను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లిన ఆదీమ్..  ముందుగా హైదరాబాద్ కు చేరుకున్నాడు. అక్కడి నుంచి రైలు ద్వారా ఢిల్లీ కి తరలించే ప్రయత్నం చేశాడు. అయితే బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు తాండూరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

 రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో బాలిక మొబైల్ లొకేషన్‌ను ట్రాక్ చేసి హైదరాబాద్‌లో నిందితుడి కదలికలను గుర్తించారు. వెంటనే ప్రత్యేక బృందం హైదరాబాద్‌కు చేరుకుని ఆదీమ్‌ను అదుపులోకి తీసుకుని బాలికను   రక్షించారు. అనంతరం వారిని తాండూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ ఘటనపై స్పందించిన తాండూరు పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, మైనర్ బాలికను అపహరించేందుకు యత్నించిన కేసు నిందితుడిపై నమోదు చేసినట్లు తెలిపారు. బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించి, కౌన్సెలింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్‌కు పంపింది.  

By
en-us Political News

  
మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆదివారం సీఎం నారా చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆ సందర్భంగా అక్కడ అరుదైన, అత్యంత భావోద్వేగపూరితమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.
ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువనటుడు భరత్ కాంత్ తుది శ్వాస విడిచాడు. ఈ ప్రమాదంలో సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ కూడా కన్నుమూశారు. అప్పుడప్పుడే కెరీర్‌లో ఎదుగుతున్న ఒక యువ ప్రతిభావంతుడు ఇలా ప్రమాద రూపంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల చిత్ర పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది.
ఐపీఎల్ లో భాగంగా రాయపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరి బంతి వరకూ విజయం ఇరు జట్లతోనూ దోబూచులాడింది. చివరి బంతికి అవసరమైన రెండు పరుగులు తీసి ముంబై ఇండియన్స్ విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆద్యంతం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలు ఆవిరైపోయాయి. ఈ ఓటమి ముంబై ఇండియన్స్ నే కాకుండా లక్నో సూపర్ జయంట్స్ జట్టును కూడా ప్లే ఆప్ రేస్ నుంచి ఔట్ అయిపోయేలా చేసింది.
 దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం భాగ్యనగరంలో పర్యటించారు
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతో సహకరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.
నేపాలీ పనిమనిషి కల్పన హత్యానంతరం నాగపూర్ రైలెక్కి పారిపోతూ, మార్గమధ్యంలోనే దిగిపోయిన పోలీసులకు టోకరా ఇచ్చింది.
గుజరాత్‌తో సమానంగా తెలంగాణకు నిధులు ఇస్తామని ప్రధాని మోదీ అన్నారు
తెలంగాణ పర్యటనలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
త‌మిళ మార్కు ద్ర‌విడ సంప్ర‌దాయాల‌కు టీవీకే విజ‌య్ చెక్ పెట్టేశారా?
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దళపతి విజయ్‌కు ప్రముఖ హీరోయిన్ త్రిష శుభాకాంక్షలు తెలిపారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ నగరం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో హై అలర్ట్‌లోకి వెళ్లింది.
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.