రోడ్డు ప్రమాదంలో వర్థమాన హీరో భరత్ కాంత్ దుర్మరణం

Publish Date:May 11, 2026

Advertisement

తెలుగు చలన త్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. నటుడిగా ఎదుగుతున్న తరుణంలోనే ఒక ప్రతిభావంతమైన యువ నటుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువనటుడు భరత్ కాంత్ తుది శ్వాస విడిచాడు. ఈ ప్రమాదంలో  సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ కూడా కన్నుమూశారు. అప్పుడప్పుడే కెరీర్‌లో ఎదుగుతున్న ఒక యువ ప్రతిభావంతుడు ఇలా ప్రమాద రూపంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల చిత్ర పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై  బొంగులూరు గేట్ సమీపంలో..  నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హీరో భరత్ కాంత్‌, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భరత్ కాంత్ ఇటీవల విడుదలైన  టాలెంట్  సినిమాలో హీరోగా నటించి మంచి గుర్తింపు పొందాడు.   పలు తెలుగు, హిందీ వెబ్ సిరీస్‌లలో కూడా నటించాడు.

ఇక సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ పలు తెలుగు సినిమాలకు పనిచేసి  మంచి పేరు తెచ్చుకున్నారు. ఇద్దరూ కలిసి తమ సొంత ఊరైన నెల్లూరు వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులు భరత్ కాంత్ మృతికి నివాళులర్పిస్తున్నారు.

By
en-us Political News

  
అనంతపురం జిల్లాలో లక్కీ, విక్కీ రిస్కీ స్టంట్స్ వైరల్!
ఓటర్ మ్యాపింగ్, ఓటర్ల జాబితా పరిశీలన, బీఎల్ఏల బాధ్యతలపై కాంగ్రెస్ నాయకత్వం విస్తృతంగా చర్చించింది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
సుదీర్ఘమైన వేసవి సెలవుల సందడి ముగిసింది. పుస్తకాల సంచులు సర్దుకుని, సరికొత్త ఆశలతో క్లాస్‌రూముల్లోకి అడుగుపెట్టేందుకు విద్యార్థి లోకం సిద్ధమైంది.
ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి, ఒకరు గల్లంతు
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకం షాదీ ముబారక్ పేరుతో కోట్ల ఆశలు పెట్టుకున్న పేద కుటుంబాల కోసం కేటాయించిన నిధుల
పార్వతీపురం మన్యం క్రైమ్ స్టోరీ వెనుక షాకింగ్ నిజాలు..
ఫామ్‌హౌస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి..
అడ్వెంచర్ గేమ్స్ అంటే ఈ రోజుల్లో యువతకు ఎంతో క్రేజ్. థ్రిల్ కోసం, కాసేపు గాల్లో తేలిపోవాలనే సరదా కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇలాంటి ఆటలపై మక్కువ చూపిస్తుంటారు.
హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళల్లో కొందరు యువకులు బర్త్‌డే వేడుకల పేరుతో హద్దులు మీరుతున్న ఘటనలు
భాగ్యనగరంలో ‘బొద్దింకల’ పోరాటం..సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు..
నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.