తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40° డిగ్రీలు దాటుతున్నాయి.ఈ నేపథ్యంలో వాతావరణశాఖ 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 40° డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన 27 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. మిగత అన్ని జిల్లాల్లో 36°నుండి 40°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ఎండలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. గత ఎప్పుడూ లేనంతగా మార్చిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు డీహైడ్రేషన్‌కు, వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/severe-temperatures-in-telangana-36-215114.html
జాబిల్లి యాత్రలో ఐఫోన్ల సందడి.. అంతరిక్షంలో ఆపిల్ స్మార్ట్‌ఫోన్ల ప్రయోగం సక్సెస్!
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ భార్యపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల
రేణుక, మంద కృష్ణ ఇద్దరూ ఫైర్ బ్రాండ్లు కులం మెచ్చిన సామాజిక వీరులు
సోషల్ మీడియా వేదికలో అభ్యంతరకరంగా, దూషణాత్మకంగా వ్యాఖ్యలు పోస్టు చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం జలవిహార్ వద్ద ఉన్న నీటి సరఫరా ఆర్వో ప్లాంట్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది.
మాములుగా దక్షిణాదిలో అత్యంత సంపన్న పొలిటీషియన్లలో విజయ్ కూడా ఒకరు.
20వ శతాబ్దం మధ్య నుంచి 21వ శతాబ్దం వరకు ప్రపంచ రాజకీయాల్లో ఒక నిరంతర ప్రభావశక్తిగా నిలిచింది అమెరికా.
ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత విషయంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మౌనంగానే ఉండిపోయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఎందుకంటే.. అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకిస్తున్నారు కనుక. సపోజ్ ఫర్ సపోజ్ రేపు ఆయన అధికారంలోకి వస్తే అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిపై ప్రతీకార చర్యలకు దిగుతారన్న భయమే అందుకు కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కేరళ నుంచి కర్ణాటకకు వచ్చి ట్రెక్కింగ్ చేస్తూ తప్పిపోయిన జీఎస్ శరణ్య మిస్టరీలో నిజమెంత?
కృత్రిమ మేధ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు ఉద్యోగ విధానాల్లోనూ సంచలన మార్పులకు తెరలేపుతోంది.
ఆర్‌ఆర్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.