దంతాల్లో చిప్‌...ఖమేనీ హత్యకు ఏడాదిగా పక్కా ప్లాన్‌..!

Publish Date:Mar 6, 2026

Advertisement

 

ఒక దేశ అత్యున్నత నేత ఎక్కడ ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన వెంట ఎవరున్నారు? వంటి వివరాలు తెలుసుకోవడం సాధారణంగా చాలా కష్టమైన పని. ముఖ్యంగా యుద్ధ పరిస్థితుల్లో, ప్రాణాలకు ముప్పు ఉందన్న హెచ్చరికలు ఉన్నప్పుడు ఇది మరింత క్లిష్టంగా మారుతుంది. అయితే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖమేనీని లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్‌లో అమెరికా, ఇజ్రాయెల్‌ నిఘా సంస్థలు సీఐఏ, మొస్సాద్‌లు అత్యంత పద్ధతిగా పని చేశాయన్న ప్రచారం జరుగుతోంది.

ఖమేనీని హతమార్చడం వెనుక ఒక్కరోజు లేదా ఒక్కసారిగా చేసిన ప్రయత్నం కాదని తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌ కోసం నిఘా వర్గాలు ఏళ్ల తరబడి సేకరించిన సమాచారమే కీలకమైందని విశ్లేషకులు అంటున్నారు. 86 ఏళ్ల ఖమేనీ కదలికలను నిశితంగా గమనిస్తూ, సరైన సమయం కోసం చాలా కాలం పాటు వేచి చూసిన తర్వాతే దాడి జరిగిందని వివిధ నివేదికలు పేర్కొంటున్నాయి.ఖమేనీ హత్యకు సంబంధించి పలు సిద్ధాంతాలు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. వాటిలో డెంటల్‌ చిప్‌ ట్రాకింగ్‌ విధానం ఒకటిగా చెప్పబడుతోంది. ఈ విధానం ప్రకారం దంత చికిత్స సమయంలో రహస్యంగా ట్రాకింగ్‌ పరికరాలను అమర్చడం జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ ప్రచారం ప్రకారం, ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ తమ అనుబంధ వైద్యులు, దంత వైద్యులను ఏళ్ల కిందటే ఇరాన్‌లో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. ముఖ్యంగా సైనికులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో క్లినిక్‌లు ఏర్పాటు చేసి, చికిత్స సమయంలో దంత ఇంప్లాంట్‌లలో సూక్ష్మ ట్రాకింగ్‌ చిప్‌లు అమర్చినట్టు సమాచారం. అలాగే వైద్య శిబిరాల పేరుతో కూడా దంత చికిత్సలు నిర్వహిస్తూ పరికరాలు అమర్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదే విధంగా కొంతమంది వైద్యుల ద్వారా కీలక అధికారుల శస్త్రచికిత్సల సమయంలో కడుపులోనూ ట్రాకింగ్‌ పరికరాలు అమర్చినట్టు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు.ఇంకొక వాదన ప్రకారం, ఇరాన్‌లో కోటి మందికి పైగా వినియోగించే ప్రార్థనా సమయాల యాప్‌ను కూడా ఇజ్రాయెల్‌ నిఘా సంస్థలు హ్యాక్‌ చేశాయనే ప్రచారం ఉంది. అదేవిధంగా పలు వెబ్‌సైట్లు, యాప్‌లను కూడా హ్యాక్‌ చేసి సమాచారాన్ని సేకరించారన్న వార్తలు వెలువడుతున్నాయి.

ట్రాఫిక్‌ కెమెరాల హ్యాకింగ్‌

ఇరాన్‌లో పరిస్థితులను గమనించేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌ నిఘా సంస్థలు చాలా కాలం క్రితమే ట్రాఫిక్‌ కెమెరాలను హ్యాక్‌ చేశాయన్న కథనాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా రాజధాని టెహ్రాన్‌లోని ట్రాఫిక్‌ కెమెరాల ద్వారా కీలక నేతల కదలికలను పర్యవేక్షించారన్న ప్రచారం ఉంది.ఈ వ్యవస్థ ద్వారా ఖమేనీ ఎక్కడికి వెళ్తున్నారు, ఎంతసేపు అక్కడ ఉంటున్నారు, ఆయన వెంట ఎవరున్నారు వంటి వివరాలను నిఘా వర్గాలు రియల్‌ టైమ్‌లో గమనించగలిగాయని కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ప్రత్యేకంగా ఖమేనీ తరచూ సంచరించే పాశ్చర్‌ వీధి పరిసరాల్లో నిఘా మరింత పెంచినట్టు చెబుతున్నారు. ట్రాఫిక్‌ డేటాను విశ్లేషించడం ద్వారా ఆయన కార్యాలయానికి ఎప్పుడు వస్తారు, ఆయనతో పాటు ఎవరుంటారు వంటి వివరాలను ముందుగానే గుర్తించారని నివేదికలు పేర్కొంటున్నాయి.అలాగే ఖమేనీ భద్రతా సిబ్బంది వాహనాల కదలికలు, వారు ఎక్కడ ఆగుతున్నారు. 

ఎక్కడ భోజనం చేస్తున్నారు వంటి వివరాలు కూడా నిఘా వ్యవస్థల ద్వారా తెలుసుకునే ప్రయత్నం జరిగినట్టు సమాచారం. పాశ్చర్‌ వీధి సమీపంలోని కొన్ని మొబైల్‌ టవర్లపై కూడా దాడులు జరిగి కమ్యూనికేషన్‌ వ్యవస్థను దెబ్బతీశారని కొన్ని నివేదికలు వెల్లడించాయి. దీంతో హెచ్చరికలు సమయానికి చేరకుండా చేసే ప్రయత్నం జరిగిందని చెబుతున్నారు.అయితే ఈ అంశాలన్నింటిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. ప్రస్తుతం ఇవన్నీ అంతర్జాతీయ మీడియా కథనాలు, విశ్లేషణల్లో వినిపిస్తున్న వాదనలుగానే ఉన్నాయి.

By
en-us Political News

  
దేవుబాపై మనీలాండరింగ్ కేసు దర్యాప్తునకు గత ఏడాదే బీజం పడింది. ఖాట్మండు శివార్లలోని బుధనీల్‌కంఠలో ఉన్న వీరి నివాసంలో సగం కాలిన కరెన్సీ నోట్లు లభించడం అప్పట్లో పెను దుమారం రేపింది. ఈ ఆధారాలతో రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు.. వారి ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు.
ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన రామ్మోహన్ నాయుడు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనలపై చర్చించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పాత ఎయిర్‌స్ట్రిప్‌ను పూర్తిస్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు.
ఈ కేసులో అరెస్టైన మిధున్ రెడ్డికి గతంలో కోర్టు కండీషన్డ్ బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో బెయిలు మంజూరు చేసిన సమయంలో కోర్టు ఆయనకు ప్రతి శుక్రవారం సిట్ కార్యాలయానికి వెళ్లి అధికారుల ఎదుట హాజరై సంతకం చేయాలనే నిబంధనను విధించింది.
ఒప్పందంలో లెబనాన్ పై దాడులు జరపకూడదని లేదంటూ ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులకు తెగబడటమే. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్.. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ అంటుంటే.. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ను చేర్చలేదని చెప్పుకు వస్తున్నది.
ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం గుజరాత్ టైటాన్స్ ను వరించింది. స్టేడియంలో చూస్తున్న ప్రేక్షకులే కాదు.. టీవీల ముందు కూర్చుని ఈ మ్యాచ్ ను తిలకించిన వీక్షకులను సైతం మునివేళ్ల మీద నిలబెట్టేసేంత ఉత్కంఠగా ఈ మ్యాచ్ సాగింది. అయితే.. ఇదే మ్యాచ్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి.
రూ.72,000 కోట్ల గ్రేట్ నికోబార్ పోర్ట్ ప్రాజెక్ట్ ఒక ప్రధాన రాజకీయ వివాదాంశంగా మారింది. హిందూ మహాసముద్రంలో చైనా నౌకాదళ ఉనికిని ఎదుర్కోవడానికి ఇది ఒక కీలకమైన వ్యూహాత్మక ఆస్తి అని బీజేపీ ప్రచారం చేస్తుండగా, సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్, ఇది తీవ్రమైన పర్యావరణ విధ్వంసానికి, స్థానిక గిరిజన హక్కులకు హాని కలిగించే ఒక ప్రణాళికాబద్ధమైన దుస్సాహసం అని వ్యతిరేకిస్తోంది.
సైబర్ క్రైమ్ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్క్ నిఘా, ఐఎంఈఐ ట్రేసింగ్ వంటి పద్ధతులను వినియోగించి ఈ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుంది.
గోదాములో ఉన్న ప్లాస్టిక్ డెకరేషన్ వస్తువులు, ఫ్లెక్సీలు, థర్మాకోల్ సామాగ్రి పెద్ద మొత్తంలో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ కొద్దిసేపటికే గోదాం పక్కనే ఉన్న నివాస గృహానికి కూడా వ్యాపించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
మొజ్త‌బా ఖ‌మేనీ.. కుటుంబంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు అత్యంత విషాద‌క‌రంగా, గంద‌ర‌గోళంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతానికి ఉన్న స‌మాచారాన్ని బ‌ట్టీ చూస్తే.. ఫిబ్ర‌వ‌రి 28న జ‌రిగిన దాడిలో.. ఇరాన్ సీనియ‌ర్ సుప్రీం లీడ‌ర్ అయ‌తుల్లా అలీ ఖ‌మేనీ.. చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఇరాన్ సుప్రీం లీడ‌ర్ గా ఖ‌మేనీ కుమారుడు మోజ్త‌బా ఖ‌మేనీ ఉన్నారు. అయితే ఆయ‌న ప్ర‌స్తుతం కోమ్ న‌గ‌రంలోని ఒక ఆస్ప‌త్రిలో అప‌స్మార‌క స్థితిలో చికిత్స పొందుతున్న‌ట్టు తెలుస్తోంది.
ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బుధవారం (ఏప్రిల్ 8) రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆ బృందం అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రశంసించింది.
జాబిల్లి యాత్రలో ఐఫోన్ల సందడి.. అంతరిక్షంలో ఆపిల్ స్మార్ట్‌ఫోన్ల ప్రయోగం సక్సెస్!
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ భార్యపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల
రేణుక, మంద కృష్ణ ఇద్దరూ ఫైర్ బ్రాండ్లు కులం మెచ్చిన సామాజిక వీరులు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.