అమరావతిలో బ్రిటన్ బెడ్‌ఫోర్డ్ స్కూలు: ఆదివారం భూమిపూజ.. వచ్చే ఏడాది తరగతులు ప్రారంభం.!

Publish Date:Nov 28, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరుతోంది.   ఐదు శతాబ్దాల సుదీర్ఘ విద్యా చరిత్ర కలిగిన బ్రిటన్‌లోని ప్రఖ్యాత బెడ్‌ఫోర్డ్ స్కూల్   అమరావతిలో ఏర్పాటు అవుతోంది. ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో భారతదేశంలో తన రెండో క్యాంపస్‌ను బెడ్ ఫోర్ట్  అమరావతిలో ఏర్పాటు చేసింది.  హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీ,  మా లక్ష్మి గ్రూప్ భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ విద్యా ప్రాజెక్టుకు ఆదివారం, (నవంబర్ 29)  భూమిపూజ కార్యక్రమం జరగనుంది. వచ్చే ఏడాది నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. 

ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరిస్తూ హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీ, మా లక్ష్మి గ్రూప్ చైర్మన్ హరీష్ చంద్ర ప్రసాద్ యార్లగడ్డ.. దాదాపు 500 ఏళ్ల విద్యా వారసత్వం కలిగిన సంస్థను అమరావతికి తీసుకురావడం కేవలం ఒక పాఠశాల నిర్మాణానికే పరిమితం కాదని, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరాల వికాసంతో పాటు రాజధాని నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చే దీర్ఘకాలిక పెట్టుబడిగా అభివర్ణించారు.  స్థానిక విద్యార్థులు సొంత రాష్ట్రంలోనే ప్రపంచ ప్రమాణాలతో కూడిన విద్యను అభ్యసించేందుకు ఈ క్యాంపస్ దోహదపడుతుందన్నారు. 

ప్రణాళికల ప్రకారం బెడ్‌ఫోర్డ్ స్కూల్ అమరావతి క్యాంపస్‌లో 2028 ఏప్రిల్ నాటికి విద్యా తరగతులు ప్రారంభం కానున్నాయి. మూడు సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు ఇక్కడ విద్యాబోధన అందించనున్నారు. కేవలం తరగతి గది పాఠాలు, పరీక్షలకే పరిమితం కాకుండా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా పాఠ్యప్రణాళికను రూపొందిస్తున్నారు.

ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక వసతులతో నిర్మించనున్న ఈ క్యాంపస్‌లో నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక ఆలోచనా విధానం, క్రీడలు, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యత ఇవ్వనున్నారు. విద్యార్థుల్లో విజ్ఞానంతో పాటు సామాజిక బాధ్యత, మానవతా విలువలు, ప్రపంచ స్థాయి దృక్పథాన్ని పెంపొందించే వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా ఈ విద్యా సంస్థ పనిచేయనుంది.

ఇది కూడా చదవండి: అమరావతి.. సస్టైనబుల్ గ్లోబల్ సిటీ.. చంద్రబాబు విజన్ కు దర్పణం!​

అంతర్జాతీయ ఖ్యాతి గడించిన విద్యాసంస్థలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం ద్వారా రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు యార్లగడ్డ వివరించారు. అమరావతిని అంతర్జాతీయ నగరంగా, విద్య, ఆవిష్కరణలు, పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి,  అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్‌కు చెందిన బెడ్‌ఫోర్డ్ స్కూల్ ఇప్పటికే భారత్‌లో మొహాలీలో తన మొదటి అంతర్జాతీయ క్యాంపస్‌ను ప్రారంభించే దిశగా అడుగులు వేయగా, ఇప్పుడు అమరావతిలో రెండో క్యాంపస్ ఏర్పాటు చేస్తుండటం విశేషం.

ఒక వైపు రాజధాని నిర్మాణ పనులు  ఊపందుకుంటుండగా, మరో వైపు అంతర్జాతీయ విద్యా సంస్థల ప్రవేశం అమరావతి అభివృద్ధికి మరింత బలాన్ని చేకూరుస్తుందనడంలో సందేహం లేదు.  నాణ్యమైన విద్యా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల ఉన్నత విద్య, పరిశోధన, నివాస రంగాల అభివృద్ధికి కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని విద్యారంగ నిపుణులు అంటున్నారు.  మొత్తానికి, 500 ఏళ్ల బ్రిటిష్ విద్యా వారసత్వం కలిగిన బెడ్‌ఫోర్డ్ స్కూల్ అమరావతిలో అడుగుపెట్టడం ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కీలక పరిణామంగా నిలవనుంది. 

మీకు నచ్చవచ్చు:  అమరావతికి శుభారంభం.. XLRI ఏర్పాటు!​

జగన్ ద్వేషం.. అమరావతికి వరం!!

[Bedford School Amaravati, Amaravati international Schools, Ground breaking ceremony, Bhumi Pujan, TeluguOne] 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పర్యటించారు. అక్కడ కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో  సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు.
ప్రముఖ హెల్త్‌కేర్ టెక్నాలజీ సంస్థ యాక్సెస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు,  వైస్ ఛైర్మన్‌ ఈ వర్ధమాన్ జైన్. వ్యాపార రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆయనకు   ఆధ్యాత్మిక, సామాజిక సేవ కార్యక్రమాల్లోనూ ముందుంటారు. ఏకకాలంలో మానవ సేవా, మాధవ సేవా చేస్తుంటారు.
చెన్నై నగరానికి చెందిన వర్ధమాన్ జైన్ తిరుమల తిరుపతి దేవస్థానం   ఈవో ని కలిసి, తాను సమర్పిస్తున్న బంగారు ఆభరణాలకు సంబంధించిన అధికారిక పత్రాలను అందజేశారు. ఆభరణాల అప్పగింతకు సంబంధించిన నిబంధనలు, ధృవీకరణ ప్రక్రియలో భాగంగా ఈ డాక్యుమెంట్లను ఈవోకు సమర్పించారు.  
కఠినమైన చికిత్సల మధ్య కూడా బాలిక ముఖంలో చిరునవ్వు, ఆసుపత్రి సిబ్బంది చూపిన మానవీయ కోణం ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. వైద్యుల అంకితభావం వల్లే ప్రాణాలు నిలిచాయంటూ   ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో భాగంగా ఆయన మంగళవారం (నవంబర్ 24) అమ్రాబాద్, ఉడుమిల్ల పరిసరాల్లో పర్యటించారు. అమ్రాబాదు శివాలయంలో కాకతీయుల కాలపు అత్యంత కళాత్మకమైన నంది విగ్రహం, ఆలయం వెనుక, ప్రాకారంగోడ పక్కనే మట్టిలో కూరుకు పోయిందన్నారు.
 భక్తులు గోదావరి, కృష్ణా వంటి పుణ్యనదుల స్నానఘట్టాల వద్దకు చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. స్నానాల అనంతరం కార్తిక దీపాలను వెలిగించి, నదీ జలాల్లో వదులుతూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.
డిసెంబర్ 20న వైకుంఠ ఏకాదశి కావడంతో, ఆ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు మొత్తం పది రోజుల పాటు భక్తులకువైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించనున్నట్లు  టీటీడీ ప్రకటించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.  సంస్థ కార్యాలయాలు, సంబంధిత ప్రాంగణాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ అధికారులు విస్తృతంగా పరిశీలన జరిపారు.
ఈ పురాతన క్షేత్రంలో భారీ మర్రి, రావి చెట్ల వేర్లు, ఊడల తొర్రలో శివలింగ రూపం కనిపించడం ఆధ్యాత్మిక విశేషంగా నిలుస్తోంది. కార్తీక మాసంలో  స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ క్షేత్రాన్ని సందర్శించి పునీతులౌతారు.
అర్ధరాత్రి  దాటిన తర్వాత కూడా భారీ శబ్దాలు వచ్చేలా టపాసులు కాలుస్తూనే ఉన్నారని పేర్కొన్న రేణూ దేశాయ్ పండుగ రోజుల్లో తాను ఏదైనా మాట్లాడితే అనవసరంగా తనను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేస్తారనే భయంతోనే  దీపావళి రోజు తాను మౌనంగా ఉన్నానన్నారు.,
. తామిరువురం పరస్పర అవగాహనతో ఒకరిపై ఒకరుసంపూర్ణ గౌరవంతో విడిపోతున్నామని వారా ప్రకటనలో పేర్కొన్నారు.   తమ వివాహ బంధం ఒక ముగింపునకు వచ్చిందని పవన్, అన్నా ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. భార్యాభర్తలుగా తమ విడిపోయినప్పటికీ స్నేహితులుగా  కలిసే ఉంటామని పేర్కొన్నారు.
మీమ్ పేజీలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు,  సోషల్ మీడియా యూజర్లు ఎవరైనా సరే ఈ వైరల్ కంటెంట్‌ను రీపోస్ట్ చేయడం, అప్‌లోడ్ చేయడం,  షేర్ చేయడం తక్షణమే ఆపాలని సురేఖ వాణి  పేర్కొన్నారు.
అమెరికాలో వైద్యులను సంప్రదించకుండా చాట్‌జీపీటీ సలహా మేరకు మూర్ఛ మందుల మోతాదును తగ్గించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బోవెన్ వాన్ ఆకస్మిక మృతి చెందింది. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు OpenAIపై వేసిన సంచలన దావా వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.