హెల్త్‌కేర్ టెక్నాలజీ దిగ్గజం నుంచి మహాదాత వరకు: వర్ధమాన్ జైన్ సేవా ప్రస్థానం.!

Publish Date:Nov 26, 2026

Advertisement

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి  వజ్ర వైడూర్యాలు, మరకత మాణిక్యాలతో కూడిన దాదాపు 160 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించి వార్తల్లో నిలిచిన వర్ధమాన్ జైన్ నేపథ్యం ఏంటో తెలుసా? ఆయన వ్యాపార, వాణిజ్య వివరాలు, విద్యార్హతల గురించి తెలుసుకోవాలని ఉందా. అయితే చదవండి. ప్రముఖ హెల్త్‌కేర్ టెక్నాలజీ సంస్థ యాక్సెస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు,  వైస్ ఛైర్మన్‌ ఈ వర్ధమాన్ జైన్. వ్యాపార రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆయనకు   ఆధ్యాత్మిక, సామాజిక సేవ కార్యక్రమాల్లోనూ ముందుంటారు. ఏకకాలంలో మానవ సేవా, మాధవ సేవా చేస్తుంటారు. అందులో భాగంగానే  స్వామివారికి పాదాల నుంచి శిరస్సు వరకు అలంకరించే వివిధ రకాల స్వర్ణాభరణాలను ఆయన భక్తిశ్రద్ధలతో సమర్పించారు.

వర్ధమాన్ జైన్ క లయోలా కళాశాలలో స్టాటిస్టిక్స్ విభాగంలో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. గణాంక శాస్త్రం, కంప్యూటర్ సైన్స్ రంగాల్లో పొందిన ఈ బలమైన పునాది ఆయన భవిష్యత్ సాంకేతిక, వ్యాపార ప్రస్థానానికి కీలకంగా మారింది.

వృత్తిపరంగా హెల్త్‌కేర్ టెక్నాలజీ,  బీపీఓ రంగాల్లో వర్ధమాన్ జైన్‌కు విశేషమైన అనుభవం ఉంది. గతంలో ఆయన అంతర్జాతీయ ఐటీ సంస్థ డెల్ సర్వీసెస్‌లో బీపీఓ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించి సంస్థ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత విజన్ హెల్త్‌సోర్స్ సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరించడంతో పాటు, ఆసియా ఇంజనీరింగ్ సంస్థకు సహ యజమానిగా, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

సాంకేతిక ఆవిష్కరణల రంగంలోనూ వర్ధమాన్ జైన్ తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ) టెక్నాలజీ అభివృద్ధి, వినియోగంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇమేజ్ ప్రాసెసింగ్,  మెడికల్ కోడింగ్ రంగాల్లో ఆయన పేరిట పేటెంట్లు ఉండటం ఆయన సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం. యాక్సెస్ హెల్త్‌కేర్ ద్వారా హెల్త్‌కేర్ రంగంలో ఆధునిక ఆటోమేషన్ విధానాలను ప్రవేశపెట్టి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు.

ఇది కూడా చదవండి:  తిరుమలేశునికి రూ.160 కోట్ల బంగారు ఆభరణాలు: చంద్రబాబు సమక్షంలో సమర్పించనున్న అజ్ణాత భక్తుడు.!

వర్థమాన్ జైన్ కు దైవ భక్తి మెండు. అందులోనూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుని పట్ల ఆపారమైన భక్తి.  దైవభక్తితో పాటు సామాజిక సేవ విషయంలో కూడా ఆయన తన బాధ్యతను విస్మరించలేదు.  చెన్నైలోని కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తూ, పేద పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నారు. అలాగే పేద యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి వారికి ఉపాధి మార్గాలు చూపేందుకు  ఆవిష్కార్  అనే సంస్థను ఏర్పాటు చేశారు. శ్రీ సరితా జైన్ ఫౌండేషన్  ద్వారా విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన వంటి అనేక సేవా కార్యక్రమాలను వర్ధమాన్ జైన్  నిర్వహిస్తున్నారు. వ్యాపార రంగంలో సాధించిన విజయాలను సమాజ హితానికి, ఆలయ సేవలకు వినియోగించాలన్న సంకల్పంతోనే ఆయన గతంలోనూ టీటీడీకి విరాళాలు అందించడంతో పాటు తాజాగా రూ. 160 కోట్ల విలువైన వజ్ర, వైడూర్య, మరకత మాణిక్య ఖచిత స్వర్ణాభరణాలను సమర్పించారు.

తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి ఆయన అందించిన ఈ అమూల్యమైన ఆభరణాలు ఆలయ నిబంధనల ప్రకారం తనిఖీలు, నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత స్వామివారి, అమ్మవారి అలంకరణలో భాగం కానున్నాయి.  

మీకు నచ్చవచ్చు: వర్థమాన్ జైన్ ఎవరో తెలుసా: తిరుమలేశునికి 121 కిలోల బంగారం విరాళం ప్రకటించిన దాత.!

శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళం: ఓ భక్తుడి వితరణ: ఎప్పుడంటే.?

[VardhmanJain, founder Access Healthcare, gold ornaments, TirumalaDonar, Sri Sarita Jain Foundation, TeluguOne]

By
en-us Political News

  
చెన్నై నగరానికి చెందిన వర్ధమాన్ జైన్ తిరుమల తిరుపతి దేవస్థానం   ఈవో ని కలిసి, తాను సమర్పిస్తున్న బంగారు ఆభరణాలకు సంబంధించిన అధికారిక పత్రాలను అందజేశారు. ఆభరణాల అప్పగింతకు సంబంధించిన నిబంధనలు, ధృవీకరణ ప్రక్రియలో భాగంగా ఈ డాక్యుమెంట్లను ఈవోకు సమర్పించారు.  
కఠినమైన చికిత్సల మధ్య కూడా బాలిక ముఖంలో చిరునవ్వు, ఆసుపత్రి సిబ్బంది చూపిన మానవీయ కోణం ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. వైద్యుల అంకితభావం వల్లే ప్రాణాలు నిలిచాయంటూ   ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో భాగంగా ఆయన మంగళవారం (నవంబర్ 24) అమ్రాబాద్, ఉడుమిల్ల పరిసరాల్లో పర్యటించారు. అమ్రాబాదు శివాలయంలో కాకతీయుల కాలపు అత్యంత కళాత్మకమైన నంది విగ్రహం, ఆలయం వెనుక, ప్రాకారంగోడ పక్కనే మట్టిలో కూరుకు పోయిందన్నారు.
 భక్తులు గోదావరి, కృష్ణా వంటి పుణ్యనదుల స్నానఘట్టాల వద్దకు చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. స్నానాల అనంతరం కార్తిక దీపాలను వెలిగించి, నదీ జలాల్లో వదులుతూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.
డిసెంబర్ 20న వైకుంఠ ఏకాదశి కావడంతో, ఆ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు మొత్తం పది రోజుల పాటు భక్తులకువైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించనున్నట్లు  టీటీడీ ప్రకటించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.  సంస్థ కార్యాలయాలు, సంబంధిత ప్రాంగణాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ అధికారులు విస్తృతంగా పరిశీలన జరిపారు.
ఈ పురాతన క్షేత్రంలో భారీ మర్రి, రావి చెట్ల వేర్లు, ఊడల తొర్రలో శివలింగ రూపం కనిపించడం ఆధ్యాత్మిక విశేషంగా నిలుస్తోంది. కార్తీక మాసంలో  స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ క్షేత్రాన్ని సందర్శించి పునీతులౌతారు.
అర్ధరాత్రి  దాటిన తర్వాత కూడా భారీ శబ్దాలు వచ్చేలా టపాసులు కాలుస్తూనే ఉన్నారని పేర్కొన్న రేణూ దేశాయ్ పండుగ రోజుల్లో తాను ఏదైనా మాట్లాడితే అనవసరంగా తనను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేస్తారనే భయంతోనే  దీపావళి రోజు తాను మౌనంగా ఉన్నానన్నారు.,
. తామిరువురం పరస్పర అవగాహనతో ఒకరిపై ఒకరుసంపూర్ణ గౌరవంతో విడిపోతున్నామని వారా ప్రకటనలో పేర్కొన్నారు.   తమ వివాహ బంధం ఒక ముగింపునకు వచ్చిందని పవన్, అన్నా ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. భార్యాభర్తలుగా తమ విడిపోయినప్పటికీ స్నేహితులుగా  కలిసే ఉంటామని పేర్కొన్నారు.
మీమ్ పేజీలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు,  సోషల్ మీడియా యూజర్లు ఎవరైనా సరే ఈ వైరల్ కంటెంట్‌ను రీపోస్ట్ చేయడం, అప్‌లోడ్ చేయడం,  షేర్ చేయడం తక్షణమే ఆపాలని సురేఖ వాణి  పేర్కొన్నారు.
అమెరికాలో వైద్యులను సంప్రదించకుండా చాట్‌జీపీటీ సలహా మేరకు మూర్ఛ మందుల మోతాదును తగ్గించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బోవెన్ వాన్ ఆకస్మిక మృతి చెందింది. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు OpenAIపై వేసిన సంచలన దావా వివరాలు.
హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వారిరువురూ బేగంపేటలో  ఐటీసీ కాకతీయ హోటల్‌లో సోమవారం (నవంబర్ 2)న కలిశారు.  ఈ సందర్భంగా వారు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న  సైబర్ సవాళ్ల ను వివరించారు. ప్రధానంగా ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం, డీప్ ఫేక్, మార్ఫింగ్ ద్వారా సినీ ప్రముఖుల ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా, అనుచిత రీతిలో అభ్యంతరకరంగా సామాజిక మాధ్యమంలో ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా చిరంజీవి అమిత్ షాకు తెలిపారు.
భారతదేశానికి జంబుద్వీపం అనే పేరు ఎలా వచ్చింది? పూజల సంకల్పంలో జంబుద్వీపం అని ఎందుకు అంటారు? పురాణాలు మరియు చరిత్ర తెలిపే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.