భాగ్యనగరానికి మణిహారంగా నిలిచే మూసీ నది పునరుద్ధరణ, సుందరీకరణ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తొలి దశ పనులను ఏడువేల 55 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మొదటి విడత పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా గడువును నిర్దేశించుకుంది.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం (మే 8) జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు. మొదటి దశ నిధుల కోసం ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)తో జరిపిన చర్చలు సఫలమయ్యాయని అధికారులు కమిటీకి వివరించారు.
ఈ ఏడాది ఆగస్టు నుంచే క్షేత్రస్థాయిలో నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా నివాస ప్రాంతాలకు ఇబ్బంది కలగని విధంగా మొదటి 5 కిలోమీటర్ల మేర (హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుండి బాపు ఘాట్ వరకు) పనులను తక్షణమే ప్రారంభించాలని మంత్రులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కేవలం నది ప్రక్షాళన మాత్రమే కాదనీ.. నగర వాసుల జీవన ప్రమాణాలను పెంచే సామాజిక బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ సందర్భంగా అన్నారు.
ప్రాజెక్టులో భాగంగా నార్సింగి నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తారు. అలాగే.. నదిలో నీటి మట్టాన్ని క్రమబద్ధీకరించడానికి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి అత్యాధునిక రబ్బర్ డ్యామ్ లను ఏర్పాటు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. నాసిక్, ముంబై నగరాల్లో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
బాధితులకు పునరావాసం కల్పించే విషయంలో ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని మంత్రులు చెప్పారు. ఎలైన్‌మెంట్‌లో మార్పులు చేయడం ద్వారా వీలైనంత వరకు ప్రస్తుత కట్టడాలకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. భూసేకరణ మరియు పునరావాస ప్రక్రియను చట్టబద్ధంగా, పారదర్శకంగా పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అలాగే.. ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హోర్డింగ్‌లు, ప్రచార చిత్రాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/seven-thousand-crore-rupees-for-the-first-phase-of-the-musi-project-36-219285.html
గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు. అలాగే గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.
సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన యూనిట్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు.
ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి సుమారు రూ.కోట్లు తీసుకున్నారంటూ.. బాధితుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ కేసు సినీ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది.
హైకోర్టులో ఒక పిటిషన్ విచారణ సందర్భంగా జూనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఆ సమయంలో జడ్జి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కొంత అసహనానికి గురయ్యారు. ఆ క్రమంలో న్యాయవాది తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిస్తూ.. అక్కడే ఉన్న పోలీసులను పిలిచి ఆ జూనియర్ అడ్వకేట్ ను 24 గంటల పాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించారు.
ఏపీలో పెట్టుబడుల వాతావరణం పండుగలా సాగుతోందన్న ఆయన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తమ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, తద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను లభించే అవకాశాలు దండిగా ఉంటాయన్నారు.
తనపై నమోదైన మోసం కేసులో దర్యాప్తును నిలిపివేయాలని, స్టే మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికీ, కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించడానికీ తిరస్కరించింది.
అమెరికాకు చెందిన యుఎస్ఎస్ బాక్సర్ అనే యుద్ధనౌక హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుండగా.. ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్ ప్రమాదకర రీతిలో నౌకకు అత్యంత సమీపంలోకి వచ్చింది. సుమారు వెయ్యి గజాల దూరంలోకి వచ్చిన ఆ డ్రోన్.. నౌకలోని సిబ్బందికి, నౌక భద్రతకు ముప్పుగా మారుతుందని గుర్తించిన అమెరికా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.
వేద పండితులు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పెన్నా నది తీరం నుండి పుట్టిమట్టి తీసుకొచ్చి అమ్మవారి ప్రతిబింబాన్ని ప్రతిష్టించి జలాలతో అభిషేకాలు చేశారు.